Sadashiva
-
మీకు తెలుసా.. ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు!
కొరాపుట్: ఎక్కడైనా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. కానీ గతంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఒడిశా అసెంబ్లీ రికార్డుల్లో సైతం నమోదై ఉంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఈ నిబంధన ఉండేదని తెలుస్తోంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి ఒక నియోజకవర్గంలో ఒక జనరల్ కేటగిరి ఎమ్మెల్యేతో పాటు ఒక రిజర్వ్ కేటగిరి ఎమ్మెల్యే ఉండేవారు. నబరంగ్‌పూర్ విధానసభ స్థానం నుంచి 1951లో కాంగ్రెస్ పార్టీ తరుపున జనరల్ కేటగిరి కింద సదాశివ త్రిపాఠి, రిజర్వ్ కేటగిరిలో ముది నాయక్ ప్రాతినిధ్యం వహించారు. 1957లో ఇదే స్థానం నుంచి అదే పార్టీకి చెందిన సదాశివ త్రిపాఠితో పాటు రిజర్వ్ కేటగిరిలో మిరు హరిజన్ కొనసాగారు. ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. జయపూర్, ఉదయగిరి, అనుగుల్, పాల్ లక్రా కే నగర్, డెంకనాల్, భవానీపట్న, జునాగఢ్, నువాపడా, టిట్లాగఢ్, పాట్నగఢ్, బొలంగీర్, పదంపూర్, సోహేలా, రైరాకోల్, జర్సుగుడ, బెమ్రా, సుందర్ గఢ్, కెంజోర్, ఆనంద్‌పూర్, పంచ్పిర్, బరిపద, నిలగిరి, చందబలి, సుకింద, జాజ్‌పూర్, బింజాపూర్, అవౌల్, సాలేపూర్, కటక్ రూరల్, నిమాపరా, భువనేశ్వర్, నయాగడ్, కేంద్రపడా, దసపల్లా, అస్కా, బ్రహ్మపుర, పర్లాకిమిడి స్థానాల్లో సైతం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండేవారు. -
బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్ఈఎల్కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్ఈఎల్ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్ఈఎల్ తెలిపింది. -
ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి..
ఒడిశా: ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి.. లేదంటే మీ పనులు నిలిపివేస్తాను అని ఒక మహిళా అధికారి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో బిసంటక్ సమితి పరిధిలోని జీవికా మిషన్ కార్యాలయంలో మానసీ టకిరి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు ప్రతిరోజూ ఆఫీస్‌కు వచ్చిన వెంటనే సిబ్బంది మొత్తం నమస్కారం చేయడం లేదని, కొంతమంది గుడ్ మార్నింగ్తో సరిపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటివి కొనసాగవని, అందరు తప్పకుండా నమస్కారం చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అయితే ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ చెబుతున్నాం కదా మేడం అని ఒక వ్యక్తి అంటున్నా ఆమె ససేమిరా అన్నారు. ఈ వీడియోను బిసంకటక్ బీడీవో సదాశివ నాయక్ దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ సదాశివప్రసాద్ గుండెపోటుతో మృతి
-
దేవస్థానం పెద్దాయన ఇకలేరు
చిత్తూరు,శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయ ప్రధాన అర్చకులు, మీరాశీదారులు, స్థానాచార్యులు, దేవాదాయ ధర్మదాయశాఖ ఆగమ సలహాదారులు ఎస్ఎంకే సదాశివ గురుకుల్(82) 40 ఏళ్ల పాటు శివయ్యకు సేవలు అందించారు. అనారోగ్యంతో ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రభుత్వం మీరాశీ రద్దు చేసినప్పుడు దేవస్థానం అస్తులను పైసాతో సహా అప్పగించిన కుటుంబం గురుకుల్ది. దేవస్థానం ఆస్తులు ఆభరణాలు పరిరక్షించడంలోనూ ఆయన పాత్ర కీలకమైనది. ఆయన కన్నుమూయడంతో శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయం మూత వేశారు. ఆలయ ఈఓ శ్రీరామరామస్వామితోపాటు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధం గా ఆలయం నుంచి సారెను తీసుకువచ్చారు. దేవస్థానం తరుఫున ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూత వేశారు. ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. అనంతరం యథావిధిగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన్ని చివరిసారిగా చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవస్థానం మాజీ చైర్మన్లు కోలా ఆనంద్, పోతుగుంట గురవయ్యనాయుడు, శాంతారామ్ జేపవర్తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు, పట్టణ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. భరద్వాజ మహర్షి వంశీయులు శ్రీకాళహస్తీశ్వరుని, జ్ఞానప్రసూనాంబను పూజించి తరించిన వారెందరో ఉన్నారు. వారిలో భరద్వాజ మహర్షి ముఖ్యుడు. ద్వాపర యుగానికి చెందిన ఈయన ఇక్కడనున్న వాయులింగేశ్వరుడిని పూ జించి ముక్తి పొందినట్లు స్థలపురాణం చెబుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజా విధానం, సంప్రదాయాలను ఆ కాలంలోనే అమలు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. భరద్వాజుడు తమ పూజ కోసం తవ్వించిన పుష్కరిణే నేటి భరద్వాజ తీర్థంగా పేరుగాంచింది. సదాశివ గురుకుల్ భరద్వాజ మహర్షి వంశీయులు. 300 ఏళ్లుగా భరద్వాజ గోత్రానికి చెందిన వారే మీరాశీ విధానంలో ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సదాశివ గురుకల్ 40 ఏళ్లుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో శివయ్యకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన వృద్ధాప్యం నేపథ్యంలో ఆయన అన్న కుమారుడు స్వామినాథన్ గురుకుల్ స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు. -
ఈజీ మనీ డీల్ క్యాన్సిల్
మనీ... మనీమనీ... మోర్ మనీ... ఈజీ మనీ... ఒక్కరోజు పనిచేసి ఏడాదికి సరిపడా సంపాదించడం ఎలా? ఒక్కరోజులోనే లక్షాధికారులు కావాలనే కోరిక... అందుకోసం తప్పుడు పనులు చేయడం... కొన్నిరోజులు దర్జాగా బతకడం... దొరికిపోతే జైలుపాలవ్వడం... ఇదీ నేటి సంపాదనా మార్గం... ‘కష్టపడకుండా ఏదీ రాదు... కష్టపడకుండా వచ్చిందేదీ ఉండదు...’ అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన సదాశివ... డెరైక్టర్స్ వాయిస్: నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బి.కామ్ చదువుతున్నాను. ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. ఒక సంవత్సరం పాటు మానేశాను. మళ్లీ చేరబోతున్నాను. ఇంతకుముందు ‘సూసైడ్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఈ సినిమాకి నేనేమీ ఖర్చు చేయలేదు. ఇది ఒక హాబీగా తీసుకుని తీస్తున్నాను. చాలామంది తక్కువ టైమ్‌లో ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా సంపాదించినవారు ఆ తరవాత ఎన్నో ఇబ్బందుల పాలవుతారు. అటువంటివారిని ప్రేరణగా తీసుకుని తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రం తీయడానికి మూడురోజుల సమయం పట్టింది. చార్మినార్ దగ్గర, మా ఇంటి దగ్గర తీశాను. చార్మినార్ దగ్గర తీసిన దృశ్యాలు ఉదయం ఆరు గంటలకే చిత్రీకరించాం. ప్రస్తుతం ‘అన్నోన్’ అనే లఘుచిత్రం తియ్యబోతున్నాను. షార్ట్‌స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఉంటారు. అందులో ఒక సే్నిహ తుడికి... కష్టపడకుండా లక్షాధికారి కావాలనే కోరిక ఉంటుంది. గంట కష్టపడితే రెండు లక్షలు ఇస్తామని ఒక వ్యక్తి ప్రలోభపెట్టడంతో, డ్రగ్స్ సప్లై చేసేవారితో చేయి కలుపుతాడు. వారు చెప్పినచోట డ్రగ్స్ అందచేసి, డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి కొడతారు. అంతలో తేరుకుంటాడు. ఇంతకీ అది కల. ‘‘కలలోనే తప్పు ఇంత భయంకరంగా ఉంటే నిజంగా చేస్తే... ’’ అనుకుంటాడు. ‘డీల్ క్యాన్సిల్’ అనడంతో కథ ముగుస్తుంది. కామెంట్: మంచి అంశాన్ని ఎంచుకున్నందుకు సదాశివను ముందుగా అభినందించాలి. ఇందులోని కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్, కెమెరా, బ్యాక్ స్కోర్ మ్యూజిక్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. ‘‘హైదరాబాద్... కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్నవారికి ఎన్నో రూట్లు చూపించే సిటీ’’ ‘‘బస్ రూట్ల కన్నా డబ్బు సంపాదించడానికే రూట్లు ఎక్కువ’’ ‘‘చేతులు కాల్చుకున్నంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం’’ వంటి సంభాషణలు చాలా బావున్నాయి. ఒక మంచి థ్రిల్లర్లాగ తీశాడు. యూట్యూబ్‌లో సినిమాలు పెట్టేటప్పుడు సిగరెట్ కాలుస్తున్న బిట్స్ చూపిస్తూ, స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ అనే అవసరం లేకుండా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్‌ని చూపించకుండా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా చూపించాల్సి వస్తే సింబాలిక్‌గా చూపే అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. మంచి లఘుచిత్రాన్ని, మరింత అందంగా చిట్టితెరకెక్కించినందుకు సదాశివను అభినందించాల్సిందే. - డా.వైజయంతి