చుట్టూ చీకటున్నా, భయం లేకుండా
ఒంటరిగా వెలుగుతుందా గుడ్డి దీపం
దగ్గర కొచ్చిన చీకటిని కాలుస్తూ
వెలిగించిన వాడి జాడ కోసం చూస్తుందా దీపం
ఇప్పుడు ఆ చీకటికి గాలి తోడైంది
నలుపు నాలుగు దిక్కులనుంచీ దాడి చేస్తోంది
ఆ కొండ గాలికి చెట్లూ పువ్వులూ
స్వేచ్ఛా గానం చేస్తుంటే తనూ లీనమై
ఆ చుక్కల్లో చేరి చిత్రాలు చూస్తోంది
అతనొచ్చాడు,
ఇప్పుడంతా చీకటి.
నాగేంద్ర ప్రసాద్ కాశి, 8790198928