ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్‌ కట్‌! | Mumbai Power: Cut Funny Memes Flooded In Social Media | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై ముంబై గెలుపు.. అందుకే పవర్‌ కట్‌!

Oct 12 2020 7:35 PM | Updated on Oct 12 2020 8:24 PM

Mumbai Power: Cut Funny Memes Flooded In Social Media - Sakshi

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్‌ అంతరాయంతో ఈ రోజు జర‌గాల్సిన ప‌రీక్ష‌లు కూడా వాయిదాప‌డ్డాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు, ఉద్యోగస్తుల జూమ్‌ మీటింగ్‌, రైలు ప్రయాణాలు అన్ని పనులు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే సంగతి అలా ఉంచితే.. ముంబైలో మాత్రం చాలా అరుదుగా విద్యుత్‌ వ్యవస్థ వైఫల్యం సంభవిస్తుంది. చాలా కాలం తర్వాత ముంబైలో విద్యుత్‌ స్థంబించిపోవడంతో నెటిజన్లు తమదైన ఫన్నీ డైలాగ్స్‌తో మీమ్స్‌ క్రియేట్‌ చేయడంతో పాటు, ముఖ్యనేతల ఫోటోలను మార్పింగ్‌ చేస్తూ.. ప్రస్తుత పరిస్థితిపై జోకులు పేలుస్తున్నారు. ప‌వర్ క‌ట్ గురించి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న మీమ్స్ అంద‌రిని ఆకట్టుకుంటున్నాయి.
(చదవండి : అంధకారంలో ‘మహా’నగరం)

ముఖ్యంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను పవర్‌ కట్‌తో పోలుస్తూ చేసిన మీమ్స్‌  నవ్వులు పూయిస్తోంది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిని ముంబైలో పవర్‌ కట్‌కు ముడిపెడుతూ చేసిన మీమ్స్‌.. నవ్వులు పూయిస్తోంది. ఢిల్లీ ఓడిపోవడం భరించలేక ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముంబై పవర్‌ కట్‌ చేస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు పోల్‌ ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నట్లు ఉన్న ఫోటో కూడా నవ్వులు పూయిస్తోంది.
(చదవండి : ‘ముంబై పవర్ ‌కట్‌’ టాప్‌లో ట్రెండింగ్‌)

అలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వారి ఫీలింగ్‌ ఎలా ఉంటుందో తెలియజేసే మీమ్స్‌ కూడా తెగ వైరల్‌ అవుతోంది. పవర్‌ కట్‌ కావడంతో ‘ఇంత మజా ఎక్కడ ఉంటుంది.. కాసేపు పడుకుంటాను.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ బ్యాచ్‌ రోజంతా పవర్‌కట్‌ డిమాండ్‌ చేస్తున్నారు’ అంటూ క్రియేట్‌ చేసిన మీమ్స్‌ తెగ నవ్విస్తున్నాయి. మ‌రి కొంద‌రు బాహుబ‌లి సినిమాలోని ప్ర‌భాస్, స‌త్యరాజ్‌ల స‌న్నివేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. న‌గ‌రంలో దండోరా వేయించు మామ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement