Power Grid
-
రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.రూ.4.5 డివిడెండ్..వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్ కాలా అంబ్ ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ పర్లి ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (పీజీఇని్వట్)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్ అయింది. బ్లూస్టార్ ఆకర్షణీయ ఫలితాలుకూలింగ్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగినట్టు బ్లూస్టార్ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్ సిస్టమ్స్ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఏసీల వ్యాపారం సానుకూలంఅన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్ పీవీ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్లూస్టార్ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్ అయింది. -
కరెంటుకు కవచం
మన దేశంలో పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. కొంత కాలం క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాయాలను గుర్తించిన నిపుణులు.. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్ట బద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్ నివేదికను తయారు చేసింది. సెపె్టంబర్ 10 వరకూ ఈ ‘డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్’పై దేశవ్యాప్తంగా ఎవరైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించింది. –సాక్షి, అమరావతిఇవీ నిబంధనలు..మన దేశంలో నార్త్రన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐల్యాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదే విధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచి్చతంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఐఎస్ఓ)ను నియమించాలి. ఆ ఆఫీసర్ భారత పౌరసత్వం కలిగి ఉండాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ (సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్ (డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్ (పీఎస్)ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.అప్పట్లోనే ఏపీ చేయూత..కేవలం పవర్ గ్రిడ్లే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ).. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. విద్యుత్ సంక్షోభం
ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. పవర్ ప్లాంట్లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. దీంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొంది. అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. క్షిపణి దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది మాస్కో సైన్యం. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ స్పందించారు. రష్యా దాడులతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వచ్చిందని చెప్పారు. పారిశ్రామిక, గృహ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారంటూ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్అవుట్ను విధించేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. రష్యా దాడుల్లో 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.గత ఏప్రిల్‌లోనూ పవర్ ప్లాంట్‌పై దాడి చేసింది రష్యా. కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై అటాక్ చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్‌ను టార్గెట్ చేసి దాడి చేసింది. రష్యా దాడులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా చైనాపై ఆరోపణలు చేసిన జెలెన్స్కీ.. ఇప్పడు డైరెక్ట్‌గానే అటాక్ చేశారు. రష్యాకు చైనా సాయం చేస్తోందంటూ మండిపడ్డారు. పుతిన్ చేతిలో డ్రాగన్ ఓ ఆయుధంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సులో ఇతర దేశాలు హాజరుకాకుండా చైనా తన పరపతిని వినియోగిస్తోందని ఫైరయ్యారు. -
‘కోత’లపై చీకటి రాతలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 226.488 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే దానిలో కేవలం 1.35 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడింది. ఇది సరఫరా చేసిన మొత్తంలో కేవలం 0.6 శాతం మాత్రమే. దీనికే ‘చీకటి రాజ్యం’ అంటూ తాటికాయంత అక్షరాలతో పచ్చబ్యాచ్‌కు చెందిన క్షుద్రపత్రిక ఓ కథనాన్ని అచ్చేసింది. రామోజీ మోస్తున్న చంద్రబాబు హయాంలో వారంలో రెండ్రోజులు పరిశ్రమలకు ‘పవర్‌హాలిడే’, గ్రామాల్లో పగలంతా విద్యుత్ కోతలు విధించిన సంగతి ఈనాడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని రామోజీకి తెలియకపోవడం ఆశ్చర్యకరం. స్థానిక పరిస్థితుల కారణంగా తలెత్తిన విద్యుత్ అంతరాయాలన్నిటినీ విద్యుత్ కోతలుగా చూపించాలనే ప్రయత్నంలో అసలు నిజాలకు రామోజీ పాతరేశారు. కానీ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను విద్యుత్ సంస్థలు వాస్తవాలతో సహా ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ఉత్పత్తి, వాతావరణ ప్రభావం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గ్రిడ్ డిమాండ్ దాదాపు గతేడాది ఇదే రోజు జరిగిన 200.595 మిలియన్ యూనిట్లు కంటే 25.893 మిలియన్ యూనిట్లు (12.91 శాతం) పెరిగింది. కానీ, ఈ డిమాండ్‌కు సరిపడా సరఫరాకు వనరులు అందుబాటులో లేవు. ఈ సీజన్లో అధికంగా ఉండాల్సిన పవన విద్యుత్ కూడా వాతావరణంలో మార్పులవల్ల అంచనా వేసిన దానిలో కేవలం 30 శాతం కూడా రావడంలేదు. రోజులో వివిధ సమయాల్లో ఒక్కోసారి అంచనాలో కేవలం 10 శాతం కూడా ఉత్పత్తి కావటంలేదు. అలాగే, ఈ ఏడాది కృష్ణా నది బేసిన్లో జల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఎగువ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఇంకా నీటి చేరిక మొదలుకాలేదు. దానివల్ల జల విద్యుదుత్పత్తి కూడా జరగడంలేదు. ఏపీ జెన్కోలోని కొన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు వార్షిక మరమ్మతుల నిర్వహణ కోసం ఆపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని కుడిగి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. హిందుజా థర్మల్ కేంద్రంలో బొగ్గు కొరతవల్ల రెండు 520 మెగావాట్ల జనరేటర్లలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మార్కెట్లో దొరకడంలేదు.. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఏఏ సమయాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందో ఆయా సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్లాల్సి వస్తోంది. స్వల్పకాలిక మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటంలేదు. ఎంత ధర వెచ్చించినా బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్లు చేద్దామన్నా తగినంత విద్యుత్ అందుబాటులో లేదు. మనం పెట్టే బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 10–20 శాతం మాత్రమే దొరుకుతుంది. అత్యంత అధిక ధర (సీలింగ్ ధర)కు బిడ్డింగ్ వేయడానికి సిద్ధపడినా కూడా తగినంత విద్యుత్ లభించడంలేదు. అయినప్పటికీ ఎలాగోలా ప్రయత్నించి బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.483 చొప్పున రూ.46.803 కోట్లతో 46.802 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను శనివారం కొనుగోలు చేశారు. నిరంతర చర్యలు.. ఇక విద్యుత్ గ్రిడ్‌ను సమతుల్యం చేసే క్రమంలో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దేశీయ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రాయల్ విపరీతంగా పెరిగిపోయి మొత్తం గ్రిడ్ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉండడంతో దక్షిణ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అనివార్యంగా విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది. దక్షిణ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఈనాడు, మరికొన్ని పత్రికల్లో రాస్తున్నట్లు మన రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో విద్యుత్ కోతలు, చీకటి రాజ్యం పరిస్థితులు లేవు. సామాన్య గృహ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తకూడదని ముందుగా పరిశ్రమలు వాడే విద్యుత్‌కు నియంత్రణ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు సూచనలిచ్చారు. మరోవైపు.. నిత్యం విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్ ఎక్స్చేంజీల్లోనే కాకుండా వారం ముందస్తు ద్వైపాక్షిక కొనుగోళ్ల ద్వారా కూడా విద్యుత్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
ఏపీలో అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆమోదం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో భారీ వ్యయంతో నెలకొల్పే గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రూ.4,070.04 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులకు పవర్ గ్రిడ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,546 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో విండ్ ఎనర్జీ జోన్, సోలార్ ఎనర్జీ జోన్ కోసం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్ల ప్రాజెక్టు మొదటిది. ఇది 2025 నవంబర్‌కి ప్రారంభమవుతుంది. మరో ప్రాజెక్టు కొలిమిగుండ్ల వద్ద రూ.524.04 కోట్ల అంచనా వ్యయంతో వస్తుంది. ఇది 2024 నవంబర్‌కు ప్రారంభిస్తారు. బీవోటీ విధానంలో.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దేశమంతటా ట్రాన్స్మిషన్ లైన్లు నిర్వహిస్తోంది. విద్యుదుత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. అయితే, కొత్తగా నిరి్మంచే లైన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) విధానంలో నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ప్రాజెక్టులు కూడా ఈ విధానంలోనే నిరి్మస్తారు. దీనివల్ల కొంతకాలం తరువాత ఈ లైన్లు ప్రభుత్వ ఆ«దీనంలోకి వస్తాయి. తద్వారా ట్రాన్స్‌కో, డిస్కంలపై ఆర్ధిక భారం తప్పుతుంది. గతంలో కంపెనీలు ఈ అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం లాంగ్ టర్మ్ యాక్సెస్ విధానంలో పవర్ గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకునేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) విధానాన్ని తెచి్చంది. దీంతో అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ లైన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరుల నుంచి వాడుకోవడం వంటివి స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా చేయొచ్చు. -
భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్య!
న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడ్డ విషయం వెలుగు చూసింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ బయటపెట్టింది. లడఖ్ రీజియన్‌లోని పవర్ గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. ఇటీవలి నెలల్లో.. గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం నిజ-సమయ(రియల్ టైం) కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్లను (SLDC) లక్ష్యంగా చైనా నెట్వర్క్ చొరబాట్లను గమనించాము. ముఖ్యంగా, ఈ లక్ష్యం లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న SLDCతో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని గుర్తించాం. ఆ హ్యాకింగ్ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్ సెంటర్ల నుంచి వచ్చినవే’ అంటూ బుధవారం ఒక ప్రకటన చేసింది రికార్డెడ్ ఫ్యూచర్ కంపెనీ. పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు.. జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను సైతం హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు గుర్తించామని రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించింది. ఈ లెక్కన ప్రభుత్వ సహకారంతోనే హ్యాకర్లు ఈ దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక నివేదికను పబ్లిష్ చేసే ముందు.. ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించినట్లు సదరు గ్రూప్ వెల్లడించింది. ఈ అంశంపై కేంద్రం స్పందించాల్సి ఉంది. -
దేశానికే రోల్ మోడల్‌గా ఏపీ ‘జీఐఎస్’
సాక్షి, అమరావతి: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ క్రమంలోనే ఇంధన శాఖలో అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. దీనివల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం సులభతరమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్.. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ల పర్యవేక్షణకు మన జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సమగ్ర వివరాలు మరుసటి రోజు విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్)ను ఉపయోగిస్తోంది. ప్రతి 15 నిమిషాలకు వివరాలు తెలుసుకుంటోంది. దీని వల్ల విద్యుత్ డిమాండ్, సరఫరా, గ్రిడ్ నిర్వహణ, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుకలుగుతోంది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న ఏపీ ట్రాన్స్‌కో.. నెట్వర్క్ నిర్వహణ కోసం మాత్రం సొంతంగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ఇంధన శాఖ మ్యాపింగ్ పవర్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. వినియోగదారుల నుంచి ఉత్పాదక స్టేషన్ల వరకూ మొత్తం ఏపీ నెట్వర్క్ గ్రిడ్ మ్యాప్‌ను రూపొందించడంలో జీఐఎస్ సాయపడుతోంది. రియల్ టైమ్ ఓవర్ లోడింగ్, లైన్ల అండర్ లోడింగ్ గురించి తెలుసుకోవడం, అన్ని పవర్ కంపెనీల మొత్తం ఆస్తుల సరిహద్దుల మ్యాప్‌ను రూపొందించడం, ఖాళీగా ఉన్న భూమిని గుర్తించడం వంటి పనులు జీఐఎస్‌తో సాధ్యమవుతున్నాయి. ఇది ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు సాయపడుతోందని ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా.. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్.. ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలిపే మొత్తం దక్షిణ గ్రిడ్ సమగ్ర వ్యవస్థ వివరాలు తెలుసుకునేందుకు జీఐఎస్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, లోడ్ షెడ్యూలింగ్ చేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించడం, లైన్ల పెట్రోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి ప్రయోజనాలు జీఐఎస్ సిస్టమ్ ద్వారా పొందాలనుకుంటోంది. గ్రిడ్ మ్యాపింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 400 కేవీ, 220 కేవీ సబ్ స్టేషన్ల అన్ని టవర్ స్థానాల వివరాలను అందించాల్సిందిగా ఏపీ ట్రాన్స్‌కోను ఎల్‌ఆర్‌ఎల్‌డీసీ కోరడంతో అధికారులు ఆ వివరాలను ఇప్పటికే అందజేశారు. -
భూమికి తప్పిన భారీ సౌర తుపాను ముప్పు!
బుధవారం భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల పరిధిలో సాంకేతిక ఇబ్బందులను కలిగిస్తుందని భావించిన 16 లక్షల కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన సౌర తుపాను ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం భూమిపైకి వచ్చిన సౌర తుఫాను కొన్ని గంటల పాటు ఉండి వెళ్లిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎలాంటి గుర్తించదగిన మార్పులు చోటు చేసుకోలేదన్నారు. భూ అయస్కాంత క్షేత్రంలో మాత్రం కొద్దిగా మార్పులు సంభవించాయని అమెరికన్ ఏజెన్సీ తెలిపింది. నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరిక ప్రకారం.. 16:41 యుటీసీ(22:11 ఐఎస్ టీ) సమయం వద్ద భూమికి సమీపంగా వచ్చిన సౌర తుపాను భూ అయస్కాంత కె-ఇండెక్స్ 4తో ప్రయాణించింది. భూ అయస్కాంత తుఫానుల పరిమాణాన్ని వర్ణించడానికి కె-ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. కె-ఇండెక్స్ 4లో 4 అనేది చిన్న అంతరాయాన్ని సూచిస్తుంది. సౌర తుఫాను కారణంగా పవర్ గ్రిడ్, ఇంటర్ నెట్ లో సమస్యలు తలెత్తుతాయని, కెనడా, అలాస్కా వంటి అధిక అక్షాంశాల వద్ద అరోరాలు కనిపిస్తాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే, స్థానిక యుఎస్ మీడియా అటువంటి ఏవి కనబడినట్లు పేర్కొనలేదు. అంతరిక్ష వాతావరణ తుఫాను సూర్యుడిని విడిచిపెట్టినప్పుడు, అది కరోనా గుండా సౌర గాలిలోకి వెళుతుంది. ఇది భూమికి చేరుకున్నప్పుడు, అది గ్రహం మాగ్నెటోస్పియర్ ను శక్తివంతం చేస్తుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను భూమి అయస్కాంత క్షేత్ర రేఖల వరకు వేగవంతం చేస్తుంది. అక్కడ అవి వాతావరణం, అయోనోస్పియర్ తో ముఖ్యంగా అధిక అక్షాంశాల వద్ద ఢీకొంటాయి. అంతరిక్ష వాతావరణం ప్రతి విభిన్న టెక్నాలజీపై ప్రభావం చూపుతుంది. 2015లో వచ్చిన సౌర తుపాను ఆమెరికాకు ఈశాన్యంలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను దెబ్బ తీసింది. -
అంధకారంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్‌లోని గుడ్డు పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్‌ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు. -
కరెంట్‌కూ సైబర్ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యవస్థకూ సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్రం సూచనలివీ... ► విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రొజన్స్/సైబర్ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ► కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. ► చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ► ఈ దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో ఏవైనా పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటిని సర్టిఫైడ్ ల్యాబ్‌లలో పరీక్షించాలి. ► విదేశాల నుంచి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నా, ఇతర వస్తువుల తయారీ/అసెంబ్లింగ్‌కు వాటిని వినియోగించినా, విద్యుత్ సరఫరా వ్యవస్థలో వాడినా ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలి. ► కేంద్ర జాబితాలోని దేశాల నుంచి గత జూలై 7కి ముందు విద్యుత్ పరికరాలు, విడిభాగాల దిగుమతి కోసం వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే ఆ పరికరాలు వచి్చన వెంటనే పరీక్షలు నిర్వహించాలి. ► విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై ఈ పరికరాలు సైబర్ భద్రతతోపాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ముప్పు కలిగించే అవకాశం లేదని ధ్రువీకరించుకోవాలి. చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుంచి దిగుమతులపై నియంత్రణ విధించింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ల తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతి నిలిచిపోయి రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కొరత ఏర్పడింది. రైతులతోపాటు కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయలేక డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల, గ్రిడ్ నిర్వహణ ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కం ప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుం టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ఏవైనా మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి వ్యవస్థలను ముష్కరులు హైజాక్ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రించే అవకాశాలుంటాయి. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వ్యూహాత్మకమైన దేశ భద్రతావ్యవస్థలు పనిచేయకుండా హైజాకర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. -
ప్రమాదపుటంచున విద్యుత్ గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పతనమై గ్రిడ్ ప్రమాదపుటంచుల్లో మిణుకు మిణుకుమంటోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పతనమైంది. మంగళవారం అర్ధరాత్రి (11.30 గంటలకు) అత్యల్పస్థాయికి పడిపోయి 2,809 మెగావాట్లుగా రికార్డయింది. తెలంగాణలో అత్యల్ప విద్యుత్ డిమాండ్ ఇదే కావడం గమనార్హం. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పడిపోతున్న ఇలాంటి పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతూకాన్ని పరిరక్షించకపోతే విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) కుప్పకూలే ప్రమాదముంటుంది. అయితే, డిమాండ్ ఎంతగా పడిపోయినా గ్రిడ్‌ను పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వాస్తవానికి సోమవారం రాత్రి 4,300 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ మంగళవారం పగటి వేళల్లో 5,803 మెగావాట్లకు పెరిగింది. అయితే, రాత్రి వేళల్లో 3,132 మెగావాట్లకు.. అర్ధరాత్రి మరింత తగ్గి 2,809 మెగావాట్లకు పడిపోయింది. వ్యవసాయ విద్యుత్ వినియోగం లేకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు వాడకపోవడంతో డిమాండ్ అనూహ్యంగా తగ్గింది. యాసంగి పంటలతో పాటు రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం 12 వేల నుంచి 13 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసుకోగా, నాలుగో వంతుకు డిమాండ్ పడిపోవడం విశేషం. రిజర్వు షట్‌డౌన్.. బ్యాకింగ్ డౌన్: విద్యుదుత్పత్తి, సరఫరా మధ్య సమతౌల్యాన్ని కాపాడి గ్రిడ్‌ను పరిరక్షించడానికి కొన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలను రిజర్వు షట్ చేయడంతో పాటు మరికొన్నింటిలో ఉత్పత్తిని నిలిపివేసి బ్యాకింగ్ డౌన్ చేశారు. 2,442 మెగావాట్ల జల విద్యుత్ లభ్యత ఉండగా, ప్రస్తుతం జూరాల, పులిచింతల, సాగర్ జల విద్యుత్ కేంద్రాల నుంచి 1,150 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. కేటీపీపీలో ఒక యూనిట్, కేటీపీఎస్‌లో 2 యూనిట్లు, బీటీపీఎస్‌లో ఒక యూనిట్‌ను రిజర్వు షట్డౌన్లో ఉంచా రు. మిగిలిన థర్మల్ ప్లాంట్లలో పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి బ్యాకింగ్ డౌన్ చేశారు. ఒక వేళ అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ పెరిగితే మరుక్షణమే థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసుకునేలా అందుబాటులో ఉంచడాన్ని రిజర్వు షట్‌డౌన్ లో ఉంచడం అంటారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను పూర్తిగా మూసివేస్తే మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించి పూర్తి సామర్థ్యం పెంచడానికి కనీసం 12 గంటల సమయం పడుతుంది. అందుకే ఈ షట్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. -
ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్ కట్!
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో ఈ రోజు జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగస్తుల జూమ్ మీటింగ్, రైలు ప్రయాణాలు అన్ని పనులు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే సంగతి అలా ఉంచితే.. ముంబైలో మాత్రం చాలా అరుదుగా విద్యుత్ వ్యవస్థ వైఫల్యం సంభవిస్తుంది. చాలా కాలం తర్వాత ముంబైలో విద్యుత్ స్థంబించిపోవడంతో నెటిజన్లు తమదైన ఫన్నీ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేయడంతో పాటు, ముఖ్యనేతల ఫోటోలను మార్పింగ్ చేస్తూ.. ప్రస్తుత పరిస్థితిపై జోకులు పేలుస్తున్నారు. పవర్ కట్ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. (చదవండి : అంధకారంలో ‘మహా’నగరం) ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌లను పవర్ కట్‌తో పోలుస్తూ చేసిన మీమ్స్ నవ్వులు పూయిస్తోంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిని ముంబైలో పవర్ కట్కు ముడిపెడుతూ చేసిన మీమ్స్.. నవ్వులు పూయిస్తోంది. ఢిల్లీ ఓడిపోవడం భరించలేక ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముంబై పవర్ కట్ చేస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు పోల్ ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నట్లు ఉన్న ఫోటో కూడా నవ్వులు పూయిస్తోంది. (చదవండి : ‘ముంబై పవర్ కట్’ టాప్‌లో ట్రెండింగ్) అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేసే మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతోంది. పవర్ కట్ కావడంతో ‘ఇంత మజా ఎక్కడ ఉంటుంది.. కాసేపు పడుకుంటాను.. వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాచ్ రోజంతా పవర్‌కట్ డిమాండ్ చేస్తున్నారు’ అంటూ క్రియేట్ చేసిన మీమ్స్ తెగ నవ్విస్తున్నాయి. మరి కొందరు బాహుబలి సినిమాలోని ప్రభాస్, సత్యరాజ్‌ల సన్నివేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. నగరంలో దండోరా వేయించు మామ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Mumbai power line trips. Humour lines on the Internet are intact & moving at the speed of light... pic.twitter.com/qi7phM2OKp — anand mahindra (@anandmahindra) October 12, 2020 Angry Power department of Delhi has stopped the power supply in Mumbai, when Mumbai defeated Delhi in #IPL2020 #PowerCut pic.twitter.com/ZCDkEpBYpB — Anurag Srivastava (@theanuragkts) October 12, 2020 Uddhav Thackeray trying to restore power in Mumbai 😹😹@mybmc @OfficeofUT pic.twitter.com/WAxwsKUByY — Vikas Sanwal🇮🇳 (@iamvikuu) October 12, 2020 Delhi reacts to Mumbai citizens having a meltdown over the power cut pic.twitter.com/2bb5oH90fh — Nidhi Razdan (@Nidhi) October 12, 2020 #PowerCut all over Mumbai pic.twitter.com/iCizc1CQ1r — Godman Chikna (@Madan_Chikna) October 12, 2020 Dombivli people to Mumbai people who made fun of Dombivli's power cuts:#powercut pic.twitter.com/Kr4CiAL94y — Varun Shetti (@ShettiVarun) October 12, 2020 #powercut all over Mumbai *Le Mumbaikars pic.twitter.com/GGxVtLSeq1 — Godman Chikna (@Madan_Chikna) October 12, 2020 -
‘ముంబై పవర్ కట్’ టాప్‌లో ట్రెండింగ్
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో సోమవారం అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో మెట్రో, సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. నగరానికి విద్యుత్ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్) ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ సందడి చేస్తున్నాయి. పవర్‌కట్, ముంబై అనే హాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక పవర్‌కట్ ఇన్ ముంబై అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేసే మీమ్స్ సూపర్‌గా ఉన్నాయి. పవర్ కట్ కావడంతో ‘ఇంత మజా ఎక్కడ ఉంటుంది.. కాసేపు పడుకుంటాను.. వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాచ్ రోజంతా పవర్‌కట్ డిమాండ్ చేస్తున్నారు’ అంటూ క్రియేట్ చేసిన మీమ్స్ తెగ నవ్విస్తున్నాయి. (చదవండి: అంధకారంలో ‘మహా’నగరం) WFH people wishing and demanding for whole day power cut. Meanwhile Tata Power:#powercut pic.twitter.com/TQ2F0H4Rwx — Parth Mehta (@ParthMe87167211) October 12, 2020 ఇక టాటా ఇన్కమింగ్ విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని బెస్ట్ ఎలక్ట్రిక్ సప్లై తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:05 గంటలకు విద్యుత్తు అంతరాయం ప్రారంభమైంది.. 45 నిమిషాల్లో పునరుద్ధరించబడుతుంది అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల సెంట్రల్ లైన్, వెస్ట్రన్ లైన్‌లోని అనేక సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయడం మానేశాయి. ముంబై వ్యవస్థకు విద్యుత్తును సరఫరా చేస్తున్న గ్రిడ్స్, ట్రాన్స్ఫార్మర్ (కల్వా-పాడ్గే, ఖార్గర్ ఐసీటీలు) లో మల్టిపుల్ ట్రిప్పింగ్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయయి. 400 కేవీ లైన్ పడిపోయిందని నివేదికలు సూచించాయి. -
అంధకారంలో ముంబై మహానగరం
-
అంధకారంలో ‘మహా’నగరం
ముంబై : విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ముంబై మహానగరంలో సోమవారం అంధకారం అలుముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో మెట్రో, సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. నగరానికి విద్యుత్ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ వైఫల్యంతో ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొంది. ముంబైతో పాటు పరిసర థానే, పాల్ఘడ్,రాయ్‌గఢ్ జిల్లాల్లోను విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు విద్యుత్ వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక నగరంలో చీకట్లు అలుముకోవడంతో ముంబై వాసులు సోషల్ మీడియాలో సంబంధిత అధికారుల తీరును ఎండగట్టారు. విద్యుత్ సరఫరా అందరికీ నిలిచిపోయిందా..? అసలు ముంబైలో ఏం జరుగుతోందని అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ముంబై నగరం అంతటా విద్యుత్ సరఫరా లేదు..దీన్ని ఎవరూ భరించలేరంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. చదవండి : మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం #MumbaiPowerCut | Commuters seen waiting at Mulund Station as train services are disrupted due to power outage after a grid failure. (ANI) pic.twitter.com/n10dOY4kOw — HTMumbai (@HTMumbai) October 12, 2020 (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
దీప యజ్ఞం సక్సెస్
న్యూఢిల్లీ: దీప కాంతిలో భారతావని వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై అలుపెరగని పోరుకు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘దీప యజ్ఞం’ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారు. కోట్లాది భారతీయులు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి 9 నిమిషాల పాటు తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో దీపాల వెలుగులను విరజిమ్మి, మహమ్మారిపై పోరులో విజయమే లక్ష్యమని ప్రతిన బూనారు. ప్రధాని మోదీ కూడా తన ఇంటిముందు దీప స్థంభాన్ని వెలిగించి, కరోనాపై కదనంలో ముందుంటానని దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ దీప యజ్ఞంలో మమేకమయ్యారు. తమ నివాసాల్లో దీపాలను వెలిగించి, ప్రధాని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాణాసంచా కాల్చడం, హిందూ ప్రార్థనా గీతాలను, మంత్రాలను వినిపించడం కూడా కనిపించింది. మరికొన్ని చోట్ల జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, తమ ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పేసి, ఇంటి ముందు దీపాలు, కొవ్వొత్తులు, లేదా మొబైల్ టార్చ్‌లు వెలిగించి కరోనాను తరిమికొట్టే తమ ఉమ్మడి సంకల్పాన్ని ఘనంగా ప్రకటించాలని శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ సేఫ్ దేశవ్యాప్తంగా ఇళ్లల్లో విద్యుద్దీపాలను ఒకేసారి 9 నిమిషాల పాటు ఆర్పేసే కార్యక్రమం జరిగినప్పటికీ.. విద్యుత్ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. డిమాండ్‌లో ఒకేసారి భారీగా తగ్గుదల, 9 నిమిషాల అనంతరం ఒకేసారి అదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధమై, అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నేను, మా శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాం. సమర్ధవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎన్ఎల్డీసీ, ఆర్ఎల్డీసీ, ఎస్‌ఎల్‌డీసీల్లోని ఇంజినీర్లందరికి అభినందనలు’ అని సింగ్ పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు తగ్గిపోయింది. అంటే 30 గిగావాట్లకు పైగా డిమాండ్ తగ్గింది. ఇది మేం తగ్గుతుందని ఊహించిన 12 గిగావాట్ల కన్నా చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. దీప యజ్ఞం సందర్భంగా ఒకేసారి విద్యుత్ వినియోగం తగ్గితే గ్రిడ్ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. సరుకుల రవాణాకు సహకరించండి నిత్యావసరాల రవాణాలో కీలకమైన ట్రక్ డ్రైవర్లు, ఇతర కూలీలు తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు సహకరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అప్పుడే నిత్యావసరాల సరఫరా సజావుగా సాగుతుందని పేర్కొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలందరూ విద్యుత్ బల్బులను ఆర్పివేసినా పవర్ గ్రిడ్ ఏమీ కూలిపోదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, డిమాండ్‌లో వచ్చే తేడాలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతీయులందరి సామూహిక సంకల్ప బలాన్ని ప్రదర్శించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలను తొమ్మిది నిమిషాలపాటు ఆర్పివేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేస్తే అకస్మాత్తుగా వినియోగం తగ్గి విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీపాలన్నీ ఆర్పితే దాదాపు 13 గిగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గిస్తామని విద్యుత్ గ్రిడ్ నిర్వహణను చూస్తున్న పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను తగు విధంగా పనిచేయించడం ద్వారా అత్యధిక స్థాయి డిమాండ్‌ను అందుకునేందుకు ఏర్పాట్లు చేశామని పవర్ సిస్టమ్ కార్పొరేషన్ తెలిపింది. దేశీ విద్యుత్తు వ్యవస్థ పటిష్టంగా ఉందని, వోల్టేజీలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు తగిన పద్ధతులు పాటిస్తామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు. ఇళ్లల్లో దీపాలను మాత్రమే ఆర్పివేయాల్సిందిగా మోదీ కోరారని, వీధి దీపాలు, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఫ్రిజ్ వంటివి నడుస్తూనే ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులు, ఇతర ప్రజా సంబంధిత వ్యవస్థల్లోనూ విద్యుత్తు వినియోగం ఉంటుందని గుర్తు చేశారు. ఆదివారం రాత్రి నాటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య లోడ్ షెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆదివారం రాత్రి విద్యుత్తు డిమాండ్ పది నుంచి పన్నెండు గిగావాట్ల మేర తగ్గే అవకాశముందని ఇది గ్రిడ్ కూలిపోయేంత స్థాయిదేమీ కాదని అధికారులు కొందరు తెలిపారు. -
తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితం..
సాక్షి, హైదరాబాద్: కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా పిలుపుపై విపక్షనేతలు, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పవర్ గ్రిడ్ వైఫల్యానికి దారితీయనున్నట్లు విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు శనివారం స్పందించారు. (లైట్లన్నీ ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో లైట్లు ఒకేసారి ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఎటువంటి అవాంతరాలు జగరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పవర్ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి.. ప్రధాని మోదీ పలుపును విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ ప్రవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలని ప్రభాకర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు) -
మీరూ కరెంట్ అమ్మొచ్చు!
విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఎ.సత్యగంగాధర్ ఇంటికి నెలకు రూ.1,200 కరెంటు బిల్లు వచ్చేది. దీంతో ఇటీవల తన ఇంటికి సోలార్ రూఫ్ టాప్ యూనిట్‌ను అమర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన అవసరాలకు వాడుకోగా మిగులు విద్యుత్‌ను డిస్కంకు ఇస్తున్నారు. ఇలా ఆయన నెలకు 100–150 యూనిట్ల మేర విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రూ.600 నుంచి రూ.1000 వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ఇన్నాళ్లూ వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించడమే వినియోగదారుడికి తెలుసు. కానీ, కొద్ది రోజులుగా వినియోగదారుడే కరెంట్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), నెడ్‌క్యాప్‌లు ఈ వెసులుబాటు కల్పించాయి. పర్యావరణహిత సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వినియోగదారుల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను రాయితీపై ఏర్పాటు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ సంస్థలు మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం 648 మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 631 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 444 గృహాలకు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చారు. మరో 138 కనెక్షన్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం 444 కనెక్షన్లలో 147 సూర్యశక్తి పథకం కింద మంజూరయ్యాయి. విద్యుత్ విక్రయం ఇలా.. సోలార్ రూఫ్ టాప్ వినియోగదారులు ఉత్పత్తయిన సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్ విద్యుత్ యూనిట్‌కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి చెల్లిస్తుంది. యూనిట్ల నమోదుకు వీలుగా నెట్ మీటర్లు అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్ విద్యుత్‌ను విక్రయిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.58 చొప్పున పవర్ గ్రిడ్ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలా ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. ‘సూర్యశక్తి’ ఇలా.. - రూఫ్‌పై 100 (10 గీ 10) చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. - మీటర్ తమ పేరుపై ఉన్న వారెవరైనా నెడ్‌క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్యానెల్స్ నిర్వహణకు ప్రత్యేక సంస్థలున్నాయి. సర్వీస్ కోసం తక్కువ ఖర్చుతో సేవలందుతాయి. - ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షం కురిసేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. మిగతా సమయాల్లో నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. - ఈ పథకం కింద ఒక కిలోవాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ అమరుస్తారు. - యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ.60 వేలు ఖర్చవుతుంది. అయితే ఇందులో రూ.50 వేలు రాయితీ ఉంటుంది. వినియోగదారుడు భరించాల్సింది కేవలం రూ.10 వేలు మాత్రమే. విజయవాడలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ -
రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. -
న్యాక్‌తో పవర్ గ్రిడ్ ఎంవోయూ
పవర్ గ్రిడ్‌కు చెందిన సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–1 (ఎస్‌ఆర్‌టీఎస్–1) తాజాగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)తో ఒక ఎంవోయూ కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలంగాణలోని 390 మంది యువతకు ఉపాధి కల్పనే ఈ ఎంవోయూ లక్ష్యం. ఇందులో భాగంగా పవర్ గ్రిడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.1.1 కోట్లను అందిస్తే.. న్యాక్ తనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 కేంద్రాలలో ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, వెల్డింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, టైలరింగ్ వంటి పలు విభాగాల్లో శిక్షణనిస్తుంది. ఎస్‌ఆర్‌టీఎస్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.శేఖర్, న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.బిక్షపతి ఎంవోయూను మార్చుకున్నారు. న్యాక్ డైరెక్టర్లు, పవర్ గ్రిడ్ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్టాక్స్ వ్యూ
పవర్ గ్రిడ్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్; ప్రస్తుత ధర: రూ.206; టార్గెట్ ధర: రూ.287 ఎందుకంటే: పవర్ గ్రిడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.2,000 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు, రూ.83 కోట్ల మేర కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) వ్యయాలు, రూ.66 కోట్ల మేర తుది టారిఫ్‌ల అడ్జెస్ట్మెంట్స్.. ఈ అంశాలన్నీ నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.8,230 కోట్లకు పెరిగింది. సర్‌చార్జీ ఆదాయం తక్కువగా ఉండటం, రూ.230 కోట్ల వేతన సవరణ భారం, తుది టారిఫ్‌ల అడ్జెస్ట్మెంట్ భారం రూ.200 కోట్ల మేర ఉండటంతో నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభంలో 17 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశాం. గత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. అంతే కాకుండా రూ.6,000–7,000 కోట్ల విలువైన 13 ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేసింది. ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీయే వేగంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తోంది. టవర్లను టెలికం సర్వీస్‌లకు వినియోగించే ప్రయోగం విజయవంతమైంది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. సిగ్నలింగ్ వర్క్ కోసం భారత రైల్వేలతో చర్చలు జరుపుతోంది. ఈ రంగంలో రూ.80,000 కోట్ల మేర వ్యాపార అవకాశాలను ఈ కంపెనీ అందిపుచ్చుకోగలదని అంచనా. ఈ కంపెనీ 3–4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల విలువ రూ.90,000 కోట్ల మేర ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే, రెండేళ్లలో కంపెనీ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 13 శాతం మేర చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం పుస్తక విలువకు ఒకటిన్నర రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఇది ఆకర్షణీయమైన ధర. అపోలో హాస్పిటల్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; ప్రస్తుత ధర: రూ.935; టార్గెట్ ధర: రూ.1,700 ఎందుకంటే: భారత్‌లో తొలి కార్పొరేట్ హాస్పిటల్ ఇది. 150 పడకల ఆసుపత్రిగా 1983లో ఆరంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 6,800 పడకలతో 61 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఈ రంగానికే సంబంధించిన ఫార్మసీ, కన్సల్టెన్సీ, బీమా, డయాగ్నస్టిక్ క్లినిక్స్, టెలీ మెడిసిన్ సెంటర్స్, మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్, రీసెర్చ్ తదితర రంగాలకూ కూడా విస్తరించింది. కొత్త హాస్పిటళ్ల ఏర్పాటు, ఉన్న హాస్పిటళ్ల విస్తరణ కారణంగా ఆరోగ్య సంరక్షణ విభాగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 10% వృద్దిని సాధించింది. అపోలో ఫార్మసీ విభాగం 20% వృద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ రుణ భారం రూ.2,700 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించినప్పటికీ, ఫలితాలు వెల్లడైన రోజు ఈ షేర్ 4% వరకూ పతనమైంది. గత మూడు నెలల్లో 20% క్షీణించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, స్టెంట్లు, కీళ్ల మార్పిడికి సంబంధించిన ఇంప్లాంట్ల ధరలపై నియంత్రణ, కొన్ని రాష్ట్రాల్లో నర్సుల కనీస వేతనాలు పెంచడం.... ఈ అంశాలన్నీ హాస్పిటల్ రంగ షేర్లపై ప్రతికూల ఫ్రభావం చూపుతున్నాయి. హాస్పిటల్ రంగంలోని సంస్థాగత సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు పాప్యులిస్ట్ చర్యలు తీసుకుంటుండటంతో ఈ రంగంలోని కంపెనీలు కుదేలవుతున్నాయి. ప్రస్తుతం 8%గా ఉన్న ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ఓసీఈ)మూడేళ్లలో 15%కి పెరుగుతుందని అంచనా. మూడేళ్లలో నిర్వహణ లాభం 21%, మార్జిన్లు 2.5% చొప్పున వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. గత మూడేళ్లలో రూ. 2,590 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల ఫలాలు అందనున్నాయి. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్(ఏహెచ్‌ఎల్‌ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. హాస్పిటల్స్ విస్తరణపైననే ఈ కంపెనీ విజయం అధారపడి ఉంది. విస్తరణలో సమస్యలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, పెరుగుతున్న వ్యయాలు.. ఇవి ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
కోటి కాంతులు!
♦ రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ‘పవర్‌గ్రిడ్’ ♦ ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా ♦ సామర్థ్యం : 4,800 మెగావాట్లు ♦ నిర్మాణ వ్యయం : రూ.600 కోట్లు ♦ 470 కిలోమీటర్ల లైన్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు ♦ 6 సర్క్యూట్ల ద్వారా 3000మెగావాట్ల సరఫరా సామర్థ్యం ♦ 765/400 కేవీ జీఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్ రాష్ట్రంలో రెండోది పూర్తిగా గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ (జీఐఎస్) సాంకేతికతతో నిర్మిస్తున్న రెండో అతిపెద్ద సబ్ స్టేషన్ ఇదే కావడం విశేషం. తెలంగాణ కాంతులీననుంది. విద్యుత్ వెలుగు జిలుగులతో చిమ్మచీకటిని పారదోలనుంది. కరెంట్ కోతలను అధిగమించిన రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించే దిశగా ముందడుగు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌తో రాష్ట్రంలో నిరాటంకంగా కరెంట్ సరఫరా కానుంది. ఇక్కడ నిర్మిస్తున్న 765/400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రానికి తెచ్చుకోవడానికి సులువు అవుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి డోకూరి వెంకటేశ్వరరెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ చేరువలో నిర్మిస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. చత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న పవర్‌గ్రిడ్ సంస్థ.. ఈ 765/400 కేవీ సబ్‌స్టేషన్ సామర్థ్యంతో పొరుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీర్చనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి.. ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు, అక్కడి నుంచి నిజామాబాద్ మిట్టపల్లి వరకు, అక్కడి నుంచి మీర్ఖాన్ పేటలో నిర్మిస్తున్న 765/400 కేవీ సబ్‌స్టేషన్ వరకు రెండు లైన్లద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. మొత్తం 470 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న కారిడార్‌కు సుమారు రూ.2,400 కోట్లు ఖర్చయింది. ఇక్కడి నుంచి ఆరు సర్క్యూట్ల ద్వారా విద్యుత్‌ను పంపిణీ చేయనున్నా రు. ఒకటి హైదరాబాద్ వైపు, మరొకటి కర్నూల్ వైపు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా స్థానికంగా ట్రాన్స్‌కో పరిధిలోని 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా వెల్టూరుకు విద్యుత్ సరఫరా చేయనున్నా రు. ఒక్కో సర్క్యూట్లో 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రతిపాదిత రెండు ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి అందుబాటులోకి రావడంతో కర్నూలు సర్క్యూట్‌కు విద్యుత్ సరఫరా మొదలైంది. మహబూబ్‌నగర్ వైపు లైన్ల నిర్మాణం పూర్తి కాక అటు వైపు మినహా మిగతా మూడు సర్క్యూట్లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సర్క్యూట్కూ కరెంట్ సరఫరా చేయాలని పవర్‌గ్రిడ్ సంస్థ భావిస్తోంది. రూ.600 కోట్ల వ్యయంతో.. మీర్ఖాన్పేట సర్వేనంబర్ 120లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 62.5 ఎకరాలు సేకరించి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. దీంట్లో రూ.600 కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్‌కు అంకురార్పణ చేసింది. గ్రిడ్ కుప్పకూలడం, ఇతరత్రా నిర్వహణా వైఫ ల్యాలను నివారించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిర్మాణాలు చేప ట్టిన పవర్‌గ్రిడ్.. రెండు రియాక్టర్లు, రెండు బస్ రియాక్టర్లు, రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 4800 మెగావాట్ల సామర్థ్యంతో సబ్ స్టేషన్‌ను నిర్మించారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు...
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రంగాల్లో చైనా కంపెనీల ప్రవేశానికి చెక్ పెట్టేందుకు విద్యుత్, టెలికం నిబంధనలను భారత్ కఠినతరం చేయనుంది. వైరస్‌లను వ్యాప్తి చేసే మాల్వేర్కు అడ్డుకట్ట వేసేందుకూ ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. దేశీయ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్లు వెల్లువెత్తిన క్రమంలో స్మార్ట్ ఫోన్ తయారీదారులను భద్రతా ప్రమాణాలు, ఆర్కిటెక్చర్ ఫ్రేమ్ వర్క్‌లపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరింది. కీలక రంగాల్లో చైనా ఉత్పత్తుల దూకుడుకు కళ్లెం వేయాలని పరిశ్రమ వర్గాలూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యుత్ పంపిణీ నిర్వహణ, పరికరాల సరఫరాలో పలు చైనా కంపెనీలు సేవలందింస్తుండగా, భారత కంపెనీలను చైనాలో ఈ తరహా వ్యాపారానికి అనుమతించడం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దీంతో స్థానిక కంపెనీలకు ప్రాదాన్యత ఇచ్చేలా విద్యుత్ సరఫరా, పంపిణీ కాంట్రాక్టుల బిడ్డింగ్‌కు నూతన నిబంధనలను సూచిస్తూ సెంట్రల్ విద్యుత్ అథారిటీ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది.