బుధవారం భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల పరిధిలో సాంకేతిక ఇబ్బందులను కలిగిస్తుందని భావించిన 16 లక్షల కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన సౌర తుపాను ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం భూమిపైకి వచ్చిన సౌర తుఫాను కొన్ని గంటల పాటు ఉండి వెళ్లిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎలాంటి గుర్తించదగిన మార్పులు చోటు చేసుకోలేదన్నారు. భూ అయస్కాంత క్షేత్రంలో మాత్రం కొద్దిగా మార్పులు సంభవించాయని అమెరికన్ ఏజెన్సీ తెలిపింది.
నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరిక ప్రకారం.. 16:41 యుటీసీ(22:11 ఐఎస్ టీ) సమయం వద్ద భూమికి సమీపంగా వచ్చిన సౌర తుపాను భూ అయస్కాంత కె-ఇండెక్స్ 4తో ప్రయాణించింది. భూ అయస్కాంత తుఫానుల పరిమాణాన్ని వర్ణించడానికి కె-ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. కె-ఇండెక్స్ 4లో 4 అనేది చిన్న అంతరాయాన్ని సూచిస్తుంది. సౌర తుఫాను కారణంగా పవర్ గ్రిడ్, ఇంటర్ నెట్ లో సమస్యలు తలెత్తుతాయని, కెనడా, అలాస్కా వంటి అధిక అక్షాంశాల వద్ద అరోరాలు కనిపిస్తాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే, స్థానిక యుఎస్ మీడియా అటువంటి ఏవి కనబడినట్లు పేర్కొనలేదు.
అంతరిక్ష వాతావరణ తుఫాను సూర్యుడిని విడిచిపెట్టినప్పుడు, అది కరోనా గుండా సౌర గాలిలోకి వెళుతుంది. ఇది భూమికి చేరుకున్నప్పుడు, అది గ్రహం మాగ్నెటోస్పియర్ ను శక్తివంతం చేస్తుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను భూమి అయస్కాంత క్షేత్ర రేఖల వరకు వేగవంతం చేస్తుంది. అక్కడ అవి వాతావరణం, అయోనోస్పియర్ తో ముఖ్యంగా అధిక అక్షాంశాల వద్ద ఢీకొంటాయి. అంతరిక్ష వాతావరణం ప్రతి విభిన్న టెక్నాలజీపై ప్రభావం చూపుతుంది. 2015లో వచ్చిన సౌర తుపాను ఆమెరికాకు ఈశాన్యంలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను దెబ్బ తీసింది.
Comments
Please login to add a commentAdd a comment