కరెంటుకు కవచం | Measures to protect power grids and software from cyber attacks | Sakshi
Sakshi News home page

కరెంటుకు కవచం

Published Mon, Sep 23 2024 5:29 AM | Last Updated on Mon, Sep 23 2024 5:29 AM

Measures to protect power grids and software from cyber attacks

పవర్‌ గ్రిడ్‌లు, సాఫ్ట్‌వేర్లను సైబర్‌ దాడుల నుంచి రక్షించేందుకు చర్యలు

సైబర్‌ సెక్యూరిటీపై సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ కొత్త నియమాలు 

విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్‌ రూపకల్పన 

సెప్టెంబర్  10 వరకూ అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం

మన దేశంలో పవర్‌ గ్రిడ్‌లకు సైబర్‌ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. కొంత కాలం క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్‌ గ్రిడ్‌ పనితీరులో అంతరాయాలను గుర్తించిన నిపుణులు.. దీనికి సైబర్‌ దాడి కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో విద్యుత్‌ వ్యవస్థను సైబర్‌ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పవర్‌ ఐలాండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. కంప్యూటర్‌ సెక్యూరిటీ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఎస్‌ఐఆర్‌టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్‌ (ఇంటర్నెట్‌) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. 

ఇటువంటి నిర్ణయాలకు చట్ట బద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్‌ రంగంలో సైబర్‌ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్‌ నివేదికను తయారు చేసింది. సెపె్టంబర్‌ 10 వరకూ ఈ ‘డ్రాఫ్ట్‌ రెగ్యులేషన్స్‌’పై దేశవ్యాప్తంగా ఎవరైనా అభ్యంతరాలు, అభిప్రా­యాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించింది.   –సాక్షి, అమరావతి

ఇవీ నిబంధనలు..
మన దేశంలో నార్త్రన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్‌ ఈస్ట్రన్‌ అనే ఐదు ప్రాంతీయ పవర్‌ గ్రిడ్‌లు ఉన్నాయి. వీటన్నింటినీ ‘ఒన్‌ నేషన్‌.. ఒన్‌ గ్రిడ్‌’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్‌ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌ల కార్యకలాపాలన్నీ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. 

ఈ నేపథ్యంలో పవర్‌ గ్రిడ్‌ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్‌ ఐల్యాండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్‌ ఐల్యాండ్‌ సిస్టమ్‌ అనేది విద్యుత్‌ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్‌ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్‌ ఐల్యాండ్‌ సిస్టమ్‌ అంటారు. దీనివల్ల పవర్‌ గ్రిడ్‌లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. 

అదే విధంగా రాష్ట్ర విద్యుత్‌ రంగంలో కచి్చతంగా చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఐఎస్‌ఓ)ను నియమించాలి. ఆ ఆఫీసర్‌ భారత పౌరసత్వం కలిగి ఉండాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్‌ సంస్థ సైబర్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. 

విద్యుత్‌ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్‌ ఫైర్‌వాల్స్, డిటెక్షన్‌ సిస్టమ్‌ (డీఎస్‌), ప్రివెన్షన్‌ సిస్టమ్‌ (పీఎస్‌)ను తయారు చేయాలి. ట్రస్టెడ్‌ వెండర్‌ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్‌ పార్టీ అప్లికేషన్స్‌ ద్వారా మాల్‌వేర్‌ కంప్యూటర్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.

అప్పట్లోనే ఏపీ చేయూత..
కేవలం పవర్‌ గ్రిడ్‌లే కాకుండా, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్‌మిషన్, డి్రస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్‌ చేయడం తేలికైంది. 

దీంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌లో భాగమైన సదరన్‌ రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ).. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్‌ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్‌ మోడల్‌ను తీసుకుంది. సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌మిషన్, డి్రస్టిబ్యూషన్‌ లైన్‌లు, ఫిజికల్‌ పొజిషన్‌ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్‌ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement