Power system
-
కరెంటుకు కవచం
మన దేశంలో పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. కొంత కాలం క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాయాలను గుర్తించిన నిపుణులు.. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్ట బద్ధత కల్పిస్తూ సీఈఏ తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్ నివేదికను తయారు చేసింది. సెపె్టంబర్ 10 వరకూ ఈ ‘డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్’పై దేశవ్యాప్తంగా ఎవరైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించింది. –సాక్షి, అమరావతిఇవీ నిబంధనలు..మన దేశంలో నార్త్రన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ‘ఒన్ నేషన్.. ఒన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐల్యాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐల్యాండ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదే విధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కచి్చతంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఐఎస్ఓ)ను నియమించాలి. ఆ ఆఫీసర్ భారత పౌరసత్వం కలిగి ఉండాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ (సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్ (డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్ (పీఎస్)ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.అప్పట్లోనే ఏపీ చేయూత..కేవలం పవర్ గ్రిడ్లే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ).. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
శరవేగంగా ‘విద్యుత్’ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేని వర్షాలు, వేగంగా వీచిన ఈదురు గాలులకు వందలాది గ్రామాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల కొద్దీ విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్‌శాఖ యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను స్థానిక ఎనర్జీ అసిస్టెంట్లతో ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల పెనుప్రమాదాలు జరగకుండా అడ్డుకోగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల సేవలు ఇప్పుడు ఎంతో మేలు చేశాయి. భారీనష్టం జరిగిన చోట కూడా రికార్డు సమయంలో.. 4 నుంచి 18 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ, తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వినియోగదారుల నుంచి టోల్ ఫ్రీ నంబరు 1912కి, కంట్రోల్ రూమ్ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది త్వరితగతిన క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయటం ద్వారా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలుగుతున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో వందశాతం సర్విసులను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి బుధవారం చెప్పారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనూ వేగంగా పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు సీఎండీ ఐ.పృథీ్వతేజ్ తెలిపారు. -
పూర్తవని ఈ–టెండర్‌పై.. ఈ తప్పుడు రాతలేంటి.!
సాక్షి, అమరావతి: వెన్నంటి ఉండేవారిని సన్నిహితులంటారు. వదిలేసి వెళ్లిపోయిన వారిని సన్నిహితులని ఈనాడు రామోజీరావు మాత్రమే అనగలరు. న్యాయ సమీక్షను తప్పుబట్టగలరు. రివర్స్ టెండరింగ్ చెడ్డదని రాయగలరు. ఆయన అనుకున్నది సాధించడానికి ఏదైనా అచ్చేయగలరు. నిస్సిగ్గుగా అబద్ధాలను జనంపై రుద్దేయగలరు. అంతమాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటే. అసలు ఈనాడు రామోజీరావు దృష్టిలో అవినీతి అంటే ఏమిటి? ఎక్కడా లేని రీతిలో రూ.2.28 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అవినీతా? లేక గత ప్రభుత్వంలా దోచుకోవడం పంచుకోవడం అవినీతా? సీఎం స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టాలనే ఆరాటంలో పత్రిక విలువలను దిగజార్చి, జర్నలిజం నియమాలను తుంగలో తొక్కి, సొంత అజెండాతో కథనాలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైంది. ఇదే ధోరణితో ఇంకా పూర్తి కాని భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్లపై ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఆ రాతల వెనుక అసలు నిజాలు ఇలా ఉన్నాయి.. ఆరోపణ: అది జగన్‌కు అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వాస్తవం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు అయితే వైఎస్సార్సీపీని ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? జగన్ మీద రాజకీయ ప్రతీకారంగా కేసులు పెట్టి, జైల్లోకి పంపిన కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా సన్నిహితుడని చెప్తారు? అసలు ఎవరు ఎవరికి సన్నిహితులో ఈనాడుకు తెలియంది కాదు. రామోజీ వియ్యంకుడు నవయుగ వారికి చెందిన సంస్థ కాదా? ఆర్వీఆర్ అనే సంస్థ వారికి చెందిన వారిది కాదా? సుధాకర్ యాదవ్ యనమలకు వియ్యంకుడు కాదా? అందుకే పోలవరంలో నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టు దక్కలేదా? సీఎం రమేష్ మీవాడు కాదా? వారి సంస్థ రిత్విక్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టలేదా? నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్‌రావు మీ వాళ్లు కాదా? రామోజీరావు ఓన్ చేసుకోవాలంటే వీళ్లని ఓన్ చేసుకోవాలి. ఆరోపణ: ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంస్థల్లో దేనికి ఏ కాంట్రాక్టు వెళ్లాలో ముందే ఖరారైపోతుంది. వాస్తవం: రాష్ట్రంలోని జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందుగా టెండర్లు తీసుకుని 2 వారాల సమయం ఇచ్చి పబ్లిక్ డొమైన్లో వాటిని పెట్టి అభ్యంతరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి స్వీకరిస్తారు. ఆ మేరకు మార్పులు చేస్తారు. మళ్లీ టెండర్లు పిలుస్తారు. టెండర్లు ఖరారు చేశాక రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ దేశంలో ఎక్కడాలేదు. మరి భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల టెండర్ల ప్రక్రియలో రామోజీరావు ఎందుకు పాల్గొనలేదు? ఆరోపణ: టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో అధికారులకు ఆయనే నిర్దేశిస్తారు. వాస్తవం: ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుళ్లు అమర్చాలని ప్రణాళిక రూపొందించారు. రూ..1,165.41 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నివేదికను 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.699.25 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ పీఎఫ్సీ ఆమోదించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌కి అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దీని నిబంధనలను ఎవరో ఒకరు మార్చేసే అవకాశం లేదు. ఆరోపణ: పనులు అవే.. అంచనాలు పెంచేయడం వల్ల అదనంగా ఖర్చు వాస్తవం: భూగర్భ విద్యుత్ పనుల్లో అధికంగా వినియోగించే కేబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా టెండర్ ధర అధికంగా వచ్చింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2021లో తయారు చేశారు. ఆ సమయంలో కేబుల్ ధరలు 2018–19 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్కం కొనుగోలు చేసిన ధరలకు అనుగుణంగా తీసుకున్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తెచ్చిన సంక్షోభం, విధించిన ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ముడిసరుకులైన అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి వాటి ధరలు బాగా పెరిగాయి. కవర్ కండక్టర్, ఎక్స్ఎల్పీఈ కేబుల్స్, 33 కేవీ, 11 కేవీ ఆర్‌ఎంయూలు మొదలైనవి, అలాగే లేబర్ రేట్లు కూడా పెరిగాయి. వీటి ఆధారంగా మంజూరైన ధరతో పోలిస్తే బిడ్డర్లు కోట్ చేసిన రేట్లలో సహజంగానే పెరుగుదల ఉండవచ్చు. ఆరోపణ: పోటీలో ఆ రెండు కంపెనీలే వాస్తవం: రింగ్ మెయిన్ యూనిట్లు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో బీహెచ్ఎల్, ఏబీబీ, సీమెన్స్, స్పైడర్ వంటి తయారీ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఆసక్తి కలిగిన గుత్తేదారులందరూ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ సాధారణ ప్రక్రియలో కనీస ధర ప్రతిపాదించి ఎల్ 1గా అర్హత పొందిన గుత్తేదారుకు మాత్రమే పనులు దక్కించుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటును పొందడానికి టెండర్‌ను నిర్ణీత వ్యవధిలో ఖరారు చేయవలసి ఉంది. ఈ కారణంగా టెండర్ వివరాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పరిశీలనకు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్డగోలుగా కట్టబెట్టేశారని రామోజీ గగ్గోలు దేనికో..!! ఆరోపణ: రివర్స్ టెండరింగ్ ఓ బూటకం వాస్తవం: 2022 డిసెంబర్ 9న జ్యుడిషియల్ ప్రివ్యూ ఇచ్చిన ఆమోదం మేరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 2022 డిసెంబర్ 12న మొదటి టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ బిడ్ నెం.09/2022–23లో ఇద్దరు గుత్తేదార్లు పాల్గొన్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం షిర్డీ సాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీల బిడ్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రైస్ బిడ్స్‌లో ఎల్ 1 బిడ్డర్‌గా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్సీఐఎల్ అర్హత సాధించింది. గుత్తేదార్లు కోట్ చేసిన రేటు అధికంగా ఉండటం వల్ల రివర్స్ టెండర్ ప్రక్రియ కొనసాగించారు. గుత్తేదార్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. తిరిగి ఏప్రిల్‌లో రెండోసారి టెండర్ ఆహ్వానించారు. ఈ రీ టెండరీంగ్ సమయంలో రింగ్ మెయిన్ యూనిట్ల పరికరాలను టెండర్ నుంచి మినహాయించారు. ఈ పరికరాల నాణ్యత, దీర్ఘకాల గ్యారెంటీ సౌకర్యం కోసం వాటిని డిస్కం ప్రత్యేకంగా కొనాలని నిర్ణయించింది. రింగ్ యూనిట్లు మినహాయించిన ఈ టెండర్లలో నలుగురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అర్హత సాధించగా సంబంధిత ధర నిర్ణయం కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ధరల ప్రకారం 2022–23 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ఆధారిత అంచనాలకు మించి 8 శాతం అధికంగా ఎల్1 బిడ్డర్ ఆర్సీఐఎల్ దాఖలు చేసింది. ఇంత పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో బూటకం ఏముంది? -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
విద్యుత్ వ్యవస్థకు పునరుత్పాదక‘శక్తి’ కావాలి!
న్యూఢిల్లీ: భారత్ వాతావరణ (పర్యావరణ పరిరక్షణ) లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ వ్యవస్థలో మరింత పునరుత్పాదక శక్తిని అనుసంధానం చేయడం చాలా కీలకమని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) తెలిపింది. దేశ విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచడానికి వివిధ చర్యలను కూడా సూచించింది. 2030 నాటికి ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ పునరుత్పాదక ఇంధనంపై అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా తన విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్ఏ ఎనర్జీ అనలిస్ట్, నివేదిక రచయిత చరిత్ కొండా తెలిపారు. 2030 నాటికి నాన్–ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ వాటాను 50 శాతానికి పెంచడం ఎంతో ముఖ్యమని కొండా పేర్కొన్నారు. 2005 స్థాయిల నుండి 2030 నాటికి దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో వేరియబుల్ పునరుత్పాదక శక్తిని పెంచడం అవసరమన్నారు. స్థిరమైన టారిఫ్‌లకు బదులుగా ఎఫెక్టివ్ టైమ్–ఆఫ్–యూజ్ (టీఓయూ) విద్యుత్ టారిఫ్‌లను ప్రవేశపెట్టడం, విద్యుత్ రంగానికి మరింత పునరుత్పాదక ఇంధన అనుసంధానం వల్ల భారీ ప్రయోజనాలు ఒనగూరుతాయని, ముఖ్యంగా వినియోగ విధానాల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది. టీఓయూ ప్రైసింగ్ వల్ల పీక్ డిమాండ్ (కీలక సమాయాల్లో విద్యుత్ వినియోగం) 5 నుంచి 15 శాతం తగ్గుతుందని నివేదిక అభిప్రాయడింది. -
నిరంతరం సలహాలు, సూచనల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. 365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్), టారిఫ్‌లపై ఆన్లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. -
కరెంట్‌కూ సైబర్ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యవస్థకూ సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్రం సూచనలివీ... ► విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రొజన్స్/సైబర్ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ► కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. ► చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ► ఈ దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో ఏవైనా పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటిని సర్టిఫైడ్ ల్యాబ్‌లలో పరీక్షించాలి. ► విదేశాల నుంచి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నా, ఇతర వస్తువుల తయారీ/అసెంబ్లింగ్‌కు వాటిని వినియోగించినా, విద్యుత్ సరఫరా వ్యవస్థలో వాడినా ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలి. ► కేంద్ర జాబితాలోని దేశాల నుంచి గత జూలై 7కి ముందు విద్యుత్ పరికరాలు, విడిభాగాల దిగుమతి కోసం వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే ఆ పరికరాలు వచి్చన వెంటనే పరీక్షలు నిర్వహించాలి. ► విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై ఈ పరికరాలు సైబర్ భద్రతతోపాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ముప్పు కలిగించే అవకాశం లేదని ధ్రువీకరించుకోవాలి. చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుంచి దిగుమతులపై నియంత్రణ విధించింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ల తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతి నిలిచిపోయి రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కొరత ఏర్పడింది. రైతులతోపాటు కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయలేక డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల, గ్రిడ్ నిర్వహణ ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కం ప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుం టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ఏవైనా మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి వ్యవస్థలను ముష్కరులు హైజాక్ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రించే అవకాశాలుంటాయి. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వ్యూహాత్మకమైన దేశ భద్రతావ్యవస్థలు పనిచేయకుండా హైజాకర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. -
గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలందరూ విద్యుత్ బల్బులను ఆర్పివేసినా పవర్ గ్రిడ్ ఏమీ కూలిపోదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, డిమాండ్‌లో వచ్చే తేడాలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతీయులందరి సామూహిక సంకల్ప బలాన్ని ప్రదర్శించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలను తొమ్మిది నిమిషాలపాటు ఆర్పివేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేస్తే అకస్మాత్తుగా వినియోగం తగ్గి విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీపాలన్నీ ఆర్పితే దాదాపు 13 గిగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గిస్తామని విద్యుత్ గ్రిడ్ నిర్వహణను చూస్తున్న పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను తగు విధంగా పనిచేయించడం ద్వారా అత్యధిక స్థాయి డిమాండ్‌ను అందుకునేందుకు ఏర్పాట్లు చేశామని పవర్ సిస్టమ్ కార్పొరేషన్ తెలిపింది. దేశీ విద్యుత్తు వ్యవస్థ పటిష్టంగా ఉందని, వోల్టేజీలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు తగిన పద్ధతులు పాటిస్తామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు. ఇళ్లల్లో దీపాలను మాత్రమే ఆర్పివేయాల్సిందిగా మోదీ కోరారని, వీధి దీపాలు, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఫ్రిజ్ వంటివి నడుస్తూనే ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులు, ఇతర ప్రజా సంబంధిత వ్యవస్థల్లోనూ విద్యుత్తు వినియోగం ఉంటుందని గుర్తు చేశారు. ఆదివారం రాత్రి నాటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య లోడ్ షెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆదివారం రాత్రి విద్యుత్తు డిమాండ్ పది నుంచి పన్నెండు గిగావాట్ల మేర తగ్గే అవకాశముందని ఇది గ్రిడ్ కూలిపోయేంత స్థాయిదేమీ కాదని అధికారులు కొందరు తెలిపారు. -
‘డబుల్’ కాలనీల్లో సదుపాయాలు కరువు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం... అవి పూర్తయ్యేలోగా ‘డబుల్’ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, సీసీ టీవీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగర్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు తదితర ఏర్పాటు చేయాలని భావించింది. అయితే జీహెచ్ఎంసీకి ఇళ్ల నిర్మాణ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులపై స్పష్టత లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖలఅధికారులతో ఏడాది క్రితం సమావేశం నిర్వహించారు. ఆయా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు వివరాలు అందజేయగా, జీహెచ్ఎంసీ వాటిని క్రోడీకరించి ఆయా పనులకు దాదాపు రూ.616 కోట్లు ఖర్చువుతుందని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన అనుమతులతో పాటు సంబంధిత శాఖలకు నిధులు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి ఏడెనిమిది నెలల క్రితమే నివేదిక అందజేసింది. అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. నిధులకు సంబంధించి ఆయా శాఖలకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయనిదే తాము పనులు చేపట్టలేమని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేనిదే లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం త్వరిత్వగతిన నిర్ణయం తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు... ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఆయా శాఖలు మొత్తం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తకాగా... మరో 35 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. కనీసం ఇళ్లు పూర్తయిన కాలనీల్లోనైనా మౌలిక సదుపాయాలు కల్పించనిదే ప్రభుత్వ ప్రయోజనం నెరవేరదని అధికారులు పేర్కొంటున్నారు. వృథాగా మారిన జేఎన్ఎన్యూఆర్ఎం తదితర ఇళ్ల పరిస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇవీ ప్రతిపాదనలు... ♦ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 109 ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయా శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ♦ టీఎస్ఏపీడీసీఎల్: విద్యుత్ ఏర్పాట్లకు రూ.235.40 కోట్లు. ♦ జలమండలి: ఓఆర్ఆర్ లోపల తాగునీటి సరఫరాకు రూ.158.65 కోట్లు. ♦ ఆర్డబ్ల్యూఎస్అండ్ఎస్: ఓఆర్ఆర్ వెలుపలి కాలనీలకు తాగునీటి ఏర్పాట్లకు రూ.77.40 కోట్లు. ♦ హెచ్ఎండీఏ: జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లోని కాలనీలకు అప్రోచ్ రోడ్లకు రూ.94.30 కోట్లు. ♦ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్: 10 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.26.16 కోట్లు. ♦ రాచకొండ పోలీస్ కమిషనరేట్: 7 పోలీస్ అవుట్ పోస్టులు, 36 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.11.26 కోట్లు. ♦ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 32 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.7.34 కోట్లు. ♦ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 19 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు. ♦ అన్నీ కలిపి మొత్తం వ్యయం: రూ.616.01 కోట్లు. ♦ ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. -
చీకట్లో ‘సిక్కోలు’!
శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/అరసవల్లి(శ్రీకాకుళం): టిట్లీ తుపాను సిక్కోలు జిల్లాను అంధకారంలోకి నెట్టేసింది. గంటకు 100 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల సంఖ్యలో కనెక్షన్లు తెగిపోయాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతినడంతో వందలాది గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఈపీడీసీఎల్ వర్గాల సమాచారం ప్రకారమే 4,319 గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పాక్షికంగా పునరుద్ధరణ.. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) వర్గాల సమాచారం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల వరకు 2,160 గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించగలిగారు. 101 సబ్స్టేషన్లు దెబ్బతినగా 38 స్టేషన్లు, 11 కేవీ సబ్స్టేషన్లు 350కిగాను 93 సబ్స్టేషన్లను సరిచేశారు. 33 కేవీ స్తంభాలు 58, ఎల్టీ స్తంభాలు 2,036, 11 కేవీ స్తంభాలు 1,055 దెబ్బతిన్నాయి. కాగా, 33 కేవీ ఫీడర్లు 50 దెబ్బతినగా 22 ఫీడర్లను, 33 కేవీ ఫీడర్లు 380కిగాను 27 సరిచేశారు. జిల్లావ్యాప్తంగా 7,76,706 విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇందులో గురువారం రాత్రికి కేవలం 6,200 కనెక్షన్లకు మాత్రమే సరఫరాను పునరుద్ధరించగలిగారు. జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి, సోంపేట, నర్సన్నపేట, ఇచ్ఛాపురం పట్టణాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. గురువారం రాత్రికి శ్రీకాకుళంలో విద్యుత్‌ను పునరుద్ధరించగా నర్సన్నపేటలో శుక్రవారం నాటికి ఇవ్వనున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి పట్టణాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో చిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను సరిచేసేందుకు ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన 111 బృందాలను వినియోగిస్తున్నారు. 872 మంది కార్మికులు, 51 మంది ఏఈలు, 60 మంది ఏడీఈలు, డీఈలను నియమించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని విజయవాడ నుంచి మరో పదిమంది ఏఈలు, 200 మంది లేబర్‌ను శ్రీకాకుళం జిల్లాకు పంపుతున్నారు. టిట్లీ తుపాను వల్ల ఈపీడీసీఎల్‌కు ఎంత నష్టం వాటిల్లిందో లెక్క తేల్చే పనిలో అధికారులున్నారు. అనధికార సమాచారం ప్రకారం రూ. 25 కోట్లకుపైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోపరిస్థితిని సమీక్షించడానికి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు. టెక్కలి డివిజన్‌ను పరిశీలించిన హెచ్‌వై దొర ఇదిలా ఉండగా, టిట్లీ తుపాను వల్ల విద్యుత్ నష్టాల్ని అంచనా వేసేందుకు విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర నేతృత్వంలోని అధికారుల బృందం టెక్కలి డివిజన్లో పరిశీలించింది. అయితే టెక్కలి సమీపంలో రోడ్డు దెబ్బతినడం వల్ల దొర వెనుదిరిగి జిల్లా కేంద్రంలోనే మకాం వేసి నష్టాలపై సమీక్షించారు. -
ఏపీలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దాదాపు 3 లక్షల ఇళ్ళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 162 ఫీడర్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల స్తంభాలు వంగిపోవడం, కూలిపోవడం జరిగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 280 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్తగా మరో 200 ఫీడర్ల పరిధిలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈదురుగాలులు లేకపోవడం వల్ల నష్టం పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, వర్షాలకు నీరు చేరి సబ్ స్టేషన్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని జిల్లా అధికారులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో వీలైనంత తొందరలోనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు క్షేత్రస్థాయి సిబ్బంది తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సిబ్బంది వెళ్ళడం, అవసరమైన విద్యుత్ ఉపకరణలు తీసుకెళ్ళడం కష్టంగా ఉందంటున్నారు. పల్నాడు ప్రాంతంలో అన్ని రకాల వాగులు, వంకలు, కాల్వలు పొంగుతున్నాయి. రవాణా కూడా కష్టంగా ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సేవలు పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 62 ఫీడర్ల పరిధిలోని దాదాపు 1.50 లక్షల విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలిగింది. కృష్ణలో 6 వేలు, చిత్తూరులో 24 వేలు, గుంటూరులో 60 వేల విద్యుత్ కనెక్షన్లకు తరచూ అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, యుద్ధప్రాతిపదిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నామని పంపిణీ సంస్థల సీఎండీలు తెలిపారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
సోలార్ విద్యుత్తుకు ప్రోత్సాహం
మంత్రి గంటా వెల్లడి డెయిరీ ఆధ్వర్యంలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవస్థ ప్రారంభం వ్యయం రూ. 7.5 కోట్లు; ఉత్పత్తి శక్తి 1.15 మెగావాట్లు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణహిత సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఓడరేవుల, మౌలిక వసతుల కల్పన మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.విశాఖడెయిరీలో సౌరశక్తి వ్యవస్థను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెయిరీ చైర్మన్ తులసీరావు వినూత్న ప్రయోగానికి నాంది పలికారని ప్రశంసించారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సోలర్ విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడానికి చొరవ తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. విశాఖడెయిరీలో ఏ క్షణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అటువంటి సమస్యను సౌర విద్యుత్తుతో అధిగమించవచ్చని చెప్పారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన రెనిన్ సోలర్ సంస్థ సౌజన్యంతో సుమారు ఏడున్నర కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మించినట్టు తెలిపారు. 1.15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పొందవచ్చని చెప్పారు. మరో రెండు చోట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌ప్లాంట్ వల్ల ఎలాంటి కాలుష్య వాతావరణం చోటుచేసుకోదని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను వినియోగించే దిశగా ఆలోచించాలన్నారు.