సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో భారీ వ్యయంతో నెలకొల్పే గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రూ.4,070.04 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులకు పవర్ గ్రిడ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,546 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో విండ్ ఎనర్జీ జోన్, సోలార్ ఎనర్జీ జోన్ కోసం అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ లైన్ల ప్రాజెక్టు మొదటిది. ఇది 2025 నవంబర్‌కి ప్రారంభమవుతుంది. మరో ప్రాజెక్టు కొలిమిగుండ్ల వద్ద రూ.524.04 కోట్ల అంచనా వ్యయంతో వస్తుంది. ఇది 2024 నవంబర్‌కు ప్రారంభిస్తారు.
బీవోటీ విధానంలో..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దేశమంతటా ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్వహిస్తోంది. విద్యుదుత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. అయితే, కొత్తగా నిరి్మంచే లైన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ప్రాజెక్టులు కూడా ఈ విధానంలోనే నిరి్మస్తారు. దీనివల్ల కొంతకాలం తరువాత ఈ లైన్లు ప్రభుత్వ ఆ«దీనంలోకి వస్తాయి. తద్వారా ట్రాన్స్‌కో, డిస్కంలపై ఆర్ధిక భారం తప్పుతుంది. గతంలో కంపెనీలు ఈ అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం లాంగ్ టర్మ్ యాక్సెస్ విధానంలో పవర్ గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకునేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జీఎన్‌ఏ) విధానాన్ని తెచి్చంది. దీంతో అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్‌మిషన్ లైన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరుల నుంచి వాడుకోవడం వంటివి స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment