గ్రిడ్‌కు ముప్పు? | power grid in danger zone? | Sakshi
Sakshi News home page

గ్రిడ్‌కు ముప్పు?

Published Sat, Jun 21 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

గ్రిడ్‌కు ముప్పు?

గ్రిడ్‌కు ముప్పు?

నిర్ణీత కోటాను మించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగం
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో కీలకమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. నిర్ణీత కోటాను మించి విద్యుత్‌ను వినియోగించరాదని దక్షిణాది గ్రిడ్ ఇస్తున్న ఆదేశాలను ఏపీ సంస్థలు ధిక్కరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని తామే పూర్తిగా వినియోగించుకుంటామని తేల్చి చెబుతూ.. ఆ నిర్ణయాన్ని అమలు కూడా చేస్తున్నాయి. దీంతో దక్షిణాది ఫ్రీక్వెన్సీలో హెచ్చుతగ్గులతో ఏకంగా గ్రిడ్‌కే ముప్పు ముంచుకొస్తోంది. కోటాను మించుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ)ను దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) శుక్రవారం పదే పదే హెచ్చరించింది. అయినప్పటికీ ఎస్‌ఎల్‌డీసీ దాన్ని ఖాతరు చేయలేదు. శుక్రవారం ఒక్క రోజే కోటాను మించి సుమారు 5-6 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఎక్కువగా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్లాంట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్‌ని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి రోజూ అందివ్వాల్సిన ఏపీ విద్యుత్ సంస్థలు ఇప్పుడు ససేమిరా అంటున్నాయి. ఇకపై ఆ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే తెగేసి చెప్పాయి. తద్వారా తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ కోటాను అడ్డుకునే యత్నం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ కూడా చురుగ్గా స్పందించింది.
 
 సూపర్‌వైజరీ కంట్రోల్ డేటా అక్విజిషన్(స్కాడా) వ్యవస్థ ద్వారా ప్రతీ 15 నిమిషాలకోసారి ఏయే విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్న సమాచారాన్ని సేకరించింది. దాన్ని బట్టి రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న కోటా మేరకు ఇరు రాష్ట్రాలకు విద్యుత్‌ను కేటాయించింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎల్‌డీసీకి, ఇటు తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీకి ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ బేఖాతరు చేస్తూ తమ ప్లాంట్ల ద్వారా లభిస్తున్న మొత్తం విద్యుత్‌ను వినియోగించుకుంటోంది. అయితే ఇందుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ హెచ్చరించినా ఏపీఎస్‌ఎల్‌డీసీ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. మరోవైపు ఏపీ విద్యుత్ సంస్థల తీరుతో దక్షిణాది గ్రిడ్‌కు ముప్పు వాటిల్లే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 దక్షిణాది గ్రిడ్‌కు ముప్పు!
 
 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, సబ్‌స్టేషన్లు, సరఫరా లైన్లు మొదలైన వాటన్నింటినీ కలిపి గ్రిడ్‌గా వ్యవహరిస్తారు. విద్యుత్‌ను నిల్వ చేయుడం సాధ్యం కాదు. ఉత్పత్తి అరుున వెంటనే వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సవుతూకం ఉండాలి. ఈ సవుతూకం దెబ్బతింటే విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. విద్యుత్ సరఫరా పౌనఃపున్యం 50 హెడ్జ్‌గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఉత్పత్తి, వినియోగం సవూనంగా ఉన్నట్టు లెక్క. అరుుతే 49.5 హెడ్జ్ నుంచి 50.2 హెడ్జ్ వరకూ హెచ్చుతగ్గులు ఏర్పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ దృష్ట్యా అన్ని రాష్ట్రాలూ విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య సమతూకాన్ని పాటించాలి. లేదంటే గ్రిడ్‌కు ఇబ్బందులు తప్పవు. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండి, వినియోగం తక్కువగా ఉంటే ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండి, వినియోగం ఎక్కువగా ఉంటే సమతూకం తేవడానికి కోతలు విధించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే విద్యుత్ ప్లాంట్లపై ప్రభావం పడి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం, సరఫరా లైన్లు ట్రిప్ కావడం వంటివి చోటుచేసుకుంటాయి. దీంతో గ్రిడ్ పూర్తిగా విఫలమై అంధకారం నెలకొంటుంది. అందుకే గ్రిడ్ ఫ్రీక్వెన్సీని కచ్చితంగా పాటించేందుకు రాష్ట్ర స్థారుులో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ), ప్రాంతాలవారీగా దేశవ్యాప్తంగా ఐదు ఆర్‌ఎల్‌డీసీలు(ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు) ఉన్నారుు. గ్రిడ్ ఫ్రీక్వెన్సీలో సమతూకం పాటించే విధంగా ఆర్‌ఎల్‌డీసీలు ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తారుు. దీన్ని పాటించకపోతే గ్రిడ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు దక్షిణాది గ్రిడ్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ పాటించడం లేదు. దీనివల్ల గ్రిడ్ కుప్పకూలితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
 
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement