
‘పవర్‌గ్రిడ్' క్వార్టర్స్‌లో దొంగలు పడ్డారు
మనుబోలు: చుట్టూ ఎత్తై ప్రహరీ..ప్రధాన గేటు వద్ద పకడ్బందీ భద్రత ఉండే పవర్‌గ్రిడ్ ఆవరణలోనే దొంగలు హల్‌చల్ చేశారు. ఉన్నతోద్యోగులు నివాసం ఉంటున్న ఐదు ఇళ్లలో భారీ చోరీకి తెగబడ్డారు.
మనుబోలు: చుట్టూ ఎత్తై ప్రహరీ..ప్రధాన గేటు వద్ద పకడ్బందీ భద్రత ఉండే పవర్‌గ్రిడ్ ఆవరణలోనే దొంగలు హల్‌చల్ చేశారు. ఉన్నతోద్యోగులు నివాసం ఉంటున్న ఐదు ఇళ్లలో భారీ చోరీకి తెగబడ్డారు. సుమారు రూ.75 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, ఖరీదైన పట్టుచీరలు అపహరించారు. హైదరాబాద్‌కు వెళ్లివున్న అకౌంట్స్ మేనేజర్ ఎస్‌ఆర్ సురేష్ శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకోవడం తో చోరీల విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం మేరకు.. మనుబోలు సమీపంలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డులో ఉన్న పవర్‌గ్రిడ్ ఆవరణలోని ఉద్యోగుల క్వార్టర్స్‌లో 37 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీటిలోనే అకౌంట్స్ మేనేజర్ ఎస్‌ఆర్ సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కోదండరాం, జేఈ శ్రీకాంత్ గోవింద్, డిప్యూటీ మేనేజర్ సత్యవర్ధన్, జేఈ శివరామకృష్ణారెడ్డి కుటుంబాలు ఉన్నాయి.
ఎస్‌ఆర్ సురేష్, శివరామకృష్ణారెడ్డి, కోదండరాం కుటుంబసభ్యులకు సంబంధించిన పెళ్లిళ్లు ఉండటంతో ఇటీవలే భారీగా ఆభరణాలు, పట్టుచీరలు కొనుగోలు చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా ఎస్‌ఆర్ సురేష్, కోదండరాం, శ్రీకాంత్ గోవింద్ కుటంబసభ్యులతో కలిసి వారం రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. సత్యవర్ధన్, శివరామకృష్ణారెడ్డి వ్యక్తిగత పనుల మీద వెళ్లారు. ఇది గమనించిన దొంగలు వీరి ఇళ్లలో చోరీకి తెగబడ్డారు.
ఎస్‌ఆర్ సురేష్ శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకోగానే ప్రధాన తలుపు తెరిచివుంది. లోపలకెళ్లి చూడగా బీరువాలు తెరిచివుండటంతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయి. చోరీ జరిగిందని నిర్ధారించుకుని ఆయన వెంటనే మనుబోలు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగరాజు సిబ్బందితో వచ్చి క్వార్టర్స్‌ను పరిశీలించగా ఐదు ఇళ్లలో చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని శివరామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ గోవింద్ హుటాహుటిన వచ్చేశారు.
ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రెడ్డి గంగాధర్, గూడూరు డీఎస్పీ శ్రీని వాస్, సీఐ మధుసూదన్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాబీజాన్‌సైదా, క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరిం చారు. తన ఇంట్లో 150 సవర్ల బంగారు నగలు, 6 కిలోల వెండి, ఖరీదైన పట్టుచీరలు, రూ.3 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శివరామకృష్ణారెడ్డి, తన నివాసంలో 105 సవర్ల బంగారు నగ లు, 7 కిలోల వెండి, ఖరీదైన పట్టుచీ రలు, రూ.10 వేలు నగదు అపహరణకు గురైనట్లు ఎస్‌ఆర్ సురేష్ తెలి పారు.
వీటి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవని శ్రీకాంత్ గోవింద్ వెల్లడించారు. సత్యవర్ధన్, కోదండరాం ఇంకా ఇక్కడకు చేరుకోకపోవడంతో వారి ఇళ్లలోని సొత్తు వివరాలు వెల్లడికాలేదు. వారు వస్తే చోరీకి గురైన సొత్తు విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో వేలిముద్రలను క్లూస్‌టీం సేకరించింది.
పోలీసు జాగిలం క్వార్టర్స్ నుంచి ప్రహరీ వరకు వెళ్లి వెనుదిరిగింది. వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఉద్యోగుల ఇళ్లలోనే చోరీలు జరగడం, పెళ్లిళ్ల సందర్భంగా కొనుగోలు చేసిన విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడంతో ఓ పథకం ప్రకారమే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మనుబోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.