
మున్సిపల్ కు పవర్ కట్
♦ అంధకారంలో కార్యాలయం
♦ పౌర సేవలకు అంతరాయం
♦ జిల్లా కేంద్రంలో దుస్థితి
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం.. రూ.20 వేల బకాయి కూడా చెల్లించలేని ధైన్యం. కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా కార్యాలయంలో సేవలన్నీ నిలిచిపోయాయి. ఆన్‌లైన్, టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల అప్‌లోడ్, జనన, మరణ ధృవపత్రాల జారీకి అంతరాయం కలిగింది. జూన్ మాసానికి చెల్లించాల్సిన రూ. 20 వేల బకాయిలను మున్సిపల్ అధికారులు చెల్లించలేకపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది కుర్చీల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.