Backlog
-
ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్లాగ్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►మొత్తం ఖాళీల సంఖ్య: 34 ► డి.ఎస్.సి. పరిధిలోని ఉద్యోగాలు: –జూనియర్ అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–08, జూనియర్ ఆడిటర్–01, జూనియర్ స్టెనో–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఎలక్ట్రీషియన్–01, ఎం.పి.హెచ్.ఎ–02. ► డి.ఎస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలు: ఆఫీసు సబార్డినేట్/ అటెండర్–07, పబ్లిక్ హెల్త్ మేస్త్రి–01, పబ్లిక్ హెల్త్ వర్కర్–08, కుక్–02, చౌకిదార్–01. ► అర్హతలు: ఎ జూనియర్ అకౌంటెంట్: డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీటెక్/బీఈ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ ఆడిటర్: కంప్యూటర్ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ స్టెనో: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ టైపింగ్‌లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: డీఎంఎల్టీ/ఎంఎల్టీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రికల్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపీహెచ్ఏ(స్త్రీలు): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఆఫీసు సబార్డినేట్(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► పబ్లిక్ హెల్త్ మేస్త్రి(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► పబ్లిక్ హెల్త్ వర్కర్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► కుక్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► చౌకిదార్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, స్క్రీనింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. దరఖాస్తును జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 22.03.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు -
సోదరా... బ్యాక్లాగ్ వద్దురా
గుదిబండలా మారే ప్రమాదం ప్రథమ సంవత్సరం నుంచీ కష్టపడితేనే ఫలితం ఇంజినీరింగ్ విద్యార్థులూ తస్మాత్ జాగ్రత్త బాలాజీచెరువు(కాకినాడ) : ఎంసెట్ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్‌లతో పాటు విద్యార్థులకు సీట్ ఎలాట్మెంట్ ప్రథమ దశ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ విద్య నుంచి ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణాల్లోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థి తనకి తాను ఓ సువిశాల స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు భావిస్తాడు. కొత్త స్నేహితులు, సరికొత్త పరిచయాలు, అధునాతన తరగతి గదులు, పరిశోధనశాలలు వంటివి తన చదువు స్థాయిని గుర్తు చేస్తుంటే... బట్టీ చదువులకు విభిన్నంగా సాగే బోధన ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్తగా అనిపిస్తుంది. ఈ ఒరవడిలో... హడావుడిలో... తాను మొదటి రోజు నుంచి శ్రమించి చదవాలన్న అంశం మరుగున పడుతుంది. దీంతో మొదటి సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌లోనే కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌లా మిగిలి భయపెడుతుంటాయి. రానురాను అవి భారంగా మారి భవిష్యత్‌ను తలకిందులు చేస్తాయన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. జిల్లాలో 32 ఇంజినీరింగ్ కళాశాలలు జిల్లా వ్యాప్తంగా 32 ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఎంసెట్ ప్రథమ కౌన్సెలింగ్‌లో చేరారు. వీరందరికీ ఎలా చదవాలి, పరీక్ష విధానం ఏవిధంగా ఉంటుంది, ఎలా నడుచుకోవాలి అనేది తెలియదు. ఇదే సమయంలో వీరు పూర్తిగా స్వేచ్ఛను కోరుకోవడంతో మొదటి సంవత్సర పరీక్షల్లో ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారు బోల్తా పడతారు. రెండో సంవత్సరంలో ఆ సెమిస్టర్ పరీక్షలతో పాటు బ్యాక్లాగ్ (ప్రథమ సంవత్సరం) సబెక్టుల భారం ఏడాదికేడాది పెరిగి చివరికు గుడిబండగా మారిపోతాయి. బట్టీ చదువులకు స్వస్తి ఇంటర్మీడియెట్‌లో మాదిరిగా బట్టీ చదువులు ఉండవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆంగ్లభాషపై పెద్దగా అవగాహన, పట్టు ఉండకపోవడంతో ఇంజినీరింగ్‌లో రాణించలేకపోతున్నారు. విషయ పరిజ్ఞానం లేని చదువుల కారణంగానే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యా నిపుణులు చెబుతున్నారు. పర్యవేక్షణ ఉండదు పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. కానీ ఇంజినీరింగ్ విద్యలో అధ్యాపకుల పర్యవేక్షణ ఉండదు. ఎవరూ అడ్డు ఉండరు కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరిస్తూ చదువుపై నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రింద స్థాయి చదువులో ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు డైలీ హోంవర్క్‌లు వంటివి ఉంటాయి. ఇంజినీరింగ్‌లో అలాంటి పరిస్ధితి ఉండదు. అధ్యాపకులు తరగతి గదిలోనే చదువు చెబుతారు. తరువాత దాన్ని అర్థం చేసుకుని, రివైజ్ చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థిదే. మంచి మార్కులు వస్తేనే... ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు ఉంటేనే క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్టయి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. లేకుంటే కష్టం. అలాంటిది మొదటి సెమిస్టర్‌లోనే బ్యాక్లాగ్ ఉండిపోయి చివరకు ఏదో అత్తెసరు మార్కులతో గట్టెక్కితే నెలకు కనీసం రూ.10 వేల వేతనంతో కూడిన ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతుంది. ఇలా చేస్తే మేలు - ఇంజినీరింగ్ విద్యలోకి ప్రవేశించగానే సీనియర్ల సలహాతో పాటు తోటి విద్యార్థులతో స్నేహబంధాన్ని బలపరచుకోవాలి. - అధ్యాపకులు చేప్పేది శ్రద్ధగా వినాలి. అర్థం కాకపోతే మళ్లీ అడిగి తెలుసుకోవాలి. - హాజరు 85 నుంచి 90 శాతం వరకూ ఉండి అసెన్‌మెంట్లు, స్లిప్‌టెస్టులు, మిడ్ఎగ్జామ్స్ తప్పకుండా రాయాలి. - టెస్టుబుక్స్ చదవడంతో పాటు కళాశాల లైబ్రరీలోని ఆయా సబ్జెక్టుల్లోని వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాలి. డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి కనుక వాటికి అప్డేట్ అవుతూ ఉండాలి. - కళాశాలలో జరిగే సదస్సులకు హాజరవడం ద్వారా భయంపోయి భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. - ఏ సంవత్సరం పరీక్షలను ఆ సంవత్సరమే పూర్తి చేసుకోవాలి. దీని వల్ల 70 శాతం మార్కులు సాధించవచ్చు. చాలా ప్రముఖ కంపెనీలు బీటెక్‌లో 60 శాతం మార్కులు ఉంటేనేగానీ ఇంటర్వ్యూకు పిలవడం లేదు. కొత్తదనంతో ఇబ్బందులు విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్మీడియెట్ వరకూ వార్షిక పరీక్షలు బట్టీపట్టి చదివి రాయడం అలవాటై ఉంటుంది. కానీ ఇంజినీరింగ్‌లో సెమిస్టర్ విధానం వారికి కొత్తగా ఉంటుంది. దీంతో పాటు బ్యాక్లాగ్ ఉంటే ఇంకా మూడేళ్ల సమయం ఉంది కదా అనే ధీమా వస్తుంది. సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కానీ దీన్ని ఎవరూ గ్రహించరు. అలాగే ఇంటర్ పరీక్షలు రాసిన దగ్గర నుంచి ఇంజినీరింగ్ ప్రవేశం వరకూ దాదాపు నాలుగు నెలల విరామం ఉంటుంది. ఈ సమయంలో తము ఎంచుకునే గ్రూపుపై అవగాహన పెంచుకోవాలి. - పరుచూరి కృష్ణారావు, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ -
‘బకాయిలు చెల్లించడం లేదు’
న్యూఢిల్లీ: తనకు రావాల్సిన బకాయిలపై న్యాయపోరాటానికి దిగేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాడు మార్సెలో పెరీరా సిద్ధమవుతున్నాడు. ఐఎస్ఎల్ మూడో సీజన్లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఈ ఆటగాడికి ఢిల్లీ ఫ్రాంచైజీ 2500 డాలర్లను చెల్లించాల్సి ఉంది. లీగ్ సందర్భంగా పెరీరా చేసే ఒక్కో గోల్‌కు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేందుకు ఢిల్లీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. తను మొత్తం పది గోల్స్ చేయడంతో పాటు గోల్డెన్ బూట్ గెలుచుకున్నందుకు 15వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంది. -
పాడి రైతుకు ప్రోత్సాహకమేది?
తొమ్మిది నెలలుగా అందని డబ్బులు 14 వేల రైతులకు రూ. 5 కోట్లపైగా బకాయిలు నాగిరెడ్డిపేట : పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రతి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తామన్న సర్కారు.. నెలల తరబడి ఆ మొత్తాన్ని అందించడం లేదు. తొమ్మిది నెలల తర్వాత ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన బకాయిలను మంజూరు చేసినా.. అవి ఇప్పటికీ రైతుల ఖాతాల్లో చేరలేదు. ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో 14వేల మంది పాడిరైతులు విజయడెయిరీ కేంద్రాల్లో పాలు పోస్తున్నారు. రైతులు రోజూ 70 వేల లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. పాలను విక్రయించే రైతులకు వెన్నశాతం ఆధారంగా ధర చెల్లిస్తారు. విజయ డెయిరీ కనీసం 5 శాతం వెన్న ఉంటేనే పాలను కొనుగోలు చేస్తుంది. వెన్న శాతం ఆధారంగా ఒక్కో రైతుకు లీటర్ పాలకు రూ. 27 నుంచి రూ. 55 వరకు ధర చెల్లిస్తోంది. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాల ధరకు అదనంగా లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీనివల్ల చాలామంది పాలను ప్రైవేట్ డెయిరీలలో కాకుండా విజయ డెయిరీలోనే విక్రయిస్తున్నారు. అయితే రైతులకు గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ప్రోత్సాహకం అందడం లేదు. ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని మంజూరైందని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 2.31 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఇంకా సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. ప్రోత్సాహకాన్ని వెంటనే మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా బిల్లులతో కలిపి ప్రోత్సాహకాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తాం విజయ డెయిరీలో పాలను విక్రయించే రైతులకు ప్రభుత్వం లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రోత్సాహకం మంజూరైంది. వీటిని రెండు, మూడురోజుల్లో పాడిరైతుల ఖాతాల్లో జమ చేస్తాం. మిగిలిన నిధులు ప్రభుత్వం నుంచి రాగానే రైతుల ఖాతాల్లో వేస్తాం. – ప్రదీప్, మేనేజర్, విజయ డెయిరీ, కామారెడ్డి -
ఇది దా‘రుణం’
రుణాలందక ఇక్కట్లలో అన్నదాత చుట్టుముట్టిన కరువు రబీలో పెట్టుబడిలేక అగచాట్లు కరువు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఖరీఫ్‌లో వరుణుడు ముఖం చాటేశాడు. పంట చేతికి రాకపోగా అప్పుల కుప్ప మిగిలింది. రబీ ప్రారంభమయినా ఇప్పటివరకు చినుకు జాడలేదు. మరోపక్క చేతిలో పైసా లేదు. అప్పు పుట్టే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు. రుణపరపతి అంతంతమాత్రమే. బ్యాంకులు కూడా బకాయిల పేరిట రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. చిత్తూరు: రబీ సీజన్ ప్రారంభమై 40 రోజు లు కావస్తోంది. ఈశాన్య రుతుపవనం పై ఆశలు పెట్టుకుని రైతులు విత్తనాలు, ఎరువుల సేకరణలో బిజీగా ఉన్నారు. పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. రబీ సీజన్‌కు రూ.1,835 కోట్ల రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటివరకు బ్యాంకులు రూ.425 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఖరీఫ్‌లో కూడా అన్నదాతను ఆదుకోలేకపోయాయి. రుణ లక్ష్యాన్ని పూర్తిచేయలేదు. రబీలోనైనా లక్ష్యాన్ని అందుకుని అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తాయా? అనేది సందేహమే. ఆర్థికంగా అన్ని విధాలా సహకారం అందించేందుకు నెలకొల్పిన సహకార బ్యాంకు కూడా రబీలో రైతులను గాలికొదిలేసింది. ఈ సీజన్‌కు రూ.120 కోట్ల రుణ మంజూరు లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు కేవలం రూ.23 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఖరీఫ్ సీజన్లో కూడా 43,734 మంది రైతులకు రూ.280 కోట్లు మాత్రమే రుణం మంజూరు చేసింది. ఖరీఫ్ గతి తప్పింది ముఖ్యమైన సీజన్లో బ్యాంకర్లు రైతులకు అంతంత మాత్రమే సహకారం అందించారు. సుమారు రూ.2,200 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించుకోగా.. సగం మేర మాత్రమే రుణాలు అందించారు. వీటిని సెప్టెంబర్‌లో అందించడం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితంగా అప్పటికేచాలామంది ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. కొన్ని బ్యాంకులైతే రుణాలే మంజూరు చేయకపోవడం గమనార్హం. రుణమాఫీ హామీనే కొంప ముంచింది ఎన్నికల సమయంలో అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తాం.. అన్నదాతలెవరూ రుణాలు చెల్లించకండంటూ టీడీపీ ప్రకటించడంతో రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించలేదు. ఎన్నికల అనంతరం రుణమాఫీ ప్రకటనను రుణ ఉపశమనం గా పేరు మార్పు చేయడం.. కొద్దిమందికే ఉపశమనమని ప్రకటించడంతో రైతులు ఖంగుతిన్నారు. చాలామంది బకాయిదారులుగా ముద్రపడ్డారు. వడ్డీ 14 శాతం పడటంతో బకాయిలు చెల్లించలేకపోయారు. దీంతో బకాయిదారులుగా రికార్డులకెక్కిన రెతులకు రుణాలు ఇవ్వడాని కి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. అందరికీ రుణాలిస్తాం.. అడిగిన రైతులందరికీ రుణాలిస్తాం. రుణ లక్ష్యం చేరుకుంటాం. ఇప్పుడిప్పుడే రైతులు వస్తున్నారు. కచ్చితంగా రుణ లక్ష్యం చేరుకోవాలని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. -రామ్మోహన్ రావు. ఎల్డీఎం, చిత్తూరు. -
మున్సిపల్ కు పవర్ కట్
♦ అంధకారంలో కార్యాలయం ♦ పౌర సేవలకు అంతరాయం ♦ జిల్లా కేంద్రంలో దుస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం.. రూ.20 వేల బకాయి కూడా చెల్లించలేని ధైన్యం. కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా కార్యాలయంలో సేవలన్నీ నిలిచిపోయాయి. ఆన్లైన్, టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల అప్లోడ్, జనన, మరణ ధృవపత్రాల జారీకి అంతరాయం కలిగింది. జూన్ మాసానికి చెల్లించాల్సిన రూ. 20 వేల బకాయిలను మున్సిపల్ అధికారులు చెల్లించలేకపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది కుర్చీల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. -
ఆర్టీసీలో బ్యాక్లాగ్ నియామక సందడి
విజయనగరం అర్బన్:ఆర్టీసీలో బ్యాక్లాగ్, కారుణ్యనియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్ ఈస్ట్‌కోస్టు (నెక్) రీజియన్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లో తొలిదశలో బ్యాక్లాగ్లోని ఎస్టీ కేటగిరీ డ్రైవర్ పోస్టులు 54 భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో 22 ఎస్టీ పోస్టులు శ్రీకాకుళం జిల్లాలోని 5 డిపోల పరిధిలో పురుషులకు, మిగిలిన 32 పోస్టులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మహిళలకు కేటాయించారు. అభ్యర్థులు భారీవాహన డ్రైవింగ్ లెసైన్స్ ఉండి కనీసం18 సంవత్సరాల అనుభవం కలిగి, వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలనీ సమీప డిపో కార్యాలయంలో ధరఖాస్తులను రూ.100లకు కొనుగోలు చేసుకొని ఈ నెల 25వ తేదీ లోగా పూర్తి చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. ‘కారుణ్య’నియామక అభ్యర్థులకు ముందస్తు శిక్షణ ఆర్టీసీలో పనిచేసి సర్వీసులో ఉండగా చనిపోయిన కార్మిక, ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య పోస్టుల భర్తీలో ఈ సారి ముందస్తు శిక్షణ ఇవ్వాలని సంస్థ భావిస్తోంది. సాంకేతిక విద్యార్హత ఉన్న వారసులను మాత్రమే ఎంపిక చేసి నేరుగా పోస్టులను ఇచ్చే విధానం ఇంతవరకు ఉండేది. అర్హుతగలవారు లేని కుటుంబాలు అధికంగా ఉండడం వల్ల ఆ విధానానికి సంస్థ స్వస్తి చెప్పింది. కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్న వారసులను ఎంపిక చేసి వారికి సాంకేతిక పరిజ్ఞానంపై 6 నెలల శిక్షణ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి నెల స్టైఫండ్ ఇచ్చి సంస్థకు కావలసిన పరిజ్ఞానాన్ని నేర్పించి సంస్థలోని శ్రామికపోస్టులో నియమిస్తారు. తాజాగా నెక్ పరిధిలోని శ్రామిక కార్మిక పోస్టులను ఈ విధానంలోని కారుణ్య నియామక ప్రక్రియను చేపట్టడానికి సిద్ధమయింది. ఇందుకోసం తాజాగా ఆర్టీసీ నెక్ ఆర్ఎం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలను నెక్ పీఓ ఎం.సన్యాసిరావు శనివారం విలేకరులకు తెలిపారు. 1998 జనవరి ఒకటి నుంచి ఇంతవరకు మరణించిన కార్మిక, ఉద్యోగుల వారసులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ పోస్టుకు అర్హులు కారని తెలిపారు. సంబంధిత వారసులు ఈ నెల 30వ తేదీలోగా తమ దరఖాస్తులను నెక్ రీజయన్ కార్యాలయానికి పంపుకోవాలని తెలిపారు. -
పన్నుబాధ
ప్రభుత్వ భవనాల నుంచి వసూలుకాని పన్ను పేరుకుపోతున్న బకాయి రూ.43.77కోట్లు వసూలు మాతరం కాదంటున్న అధికారులు ఆర్థిక సంక్షోభంలో పురపాలక సంఘాలు చిత్తూరు: ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే మున్సిపాలిటీ అధికారులు.. ప్రభుత్వశాఖల నుంచి బకాయిలు వసూలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ ఏడాది పన్ను కట్టలేకపోతే ప్రజల ఇంటి ముందు దండోరా వేయించడం, కొళాయి కనెక్షన్ తీసి ముక్కు పిండి వసూలు చేసే మున్సిపల్ అధికారులు సర్కారు చెల్లించాల్సిన పన్నులు ఏళ్ల తరబడి పెం డింగ్‌లో ఉన్నా చేష్టలుడిగి చూస్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలతో అధికారులకు పెద్ద పని లేకుండా పోయింది. వీటికి భవన యజమానులు పక్కాగా పన్నులు చెల్లిస్తున్నారు. కాబట్టి దర్జాగా వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలైతే.. బకాయిల వసూలుకు చుక్కలు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నామమాత్రంగా వస్తున్న నిధులతో మున్సిపాలిటీలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. సిబ్బందికి వేతనాలు చెల్లించడమే గగనంగా మారిం ది. జిల్లావ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ భవనాల అద్దె సుమారు రూ.26 కోట్లు వసూలు కా వాల్సి ఉంది. దా దాపుఅన్ని శాఖలు అంతో ఇంతో బకాయిలు ఉన్నాయి. టీటీడీ అయి తే శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసంల పన్ను రూ. 17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ అతిథి గృహాల్లో ఉండాలంటే రూ.200 నుంచి రూ.1000 వరకు భక్తుల నుం చి వసూలు చేస్తున్నారు. అయినా తిరుపతి కార్పొరేషన్‌కు పన్ను కట్టడానికి టీటీడీకి చేతులు రావడం లేదు. దండిగా ఆదాయం ఉన్నా... ప్రభుత్వానికి వివిధ రూపాల్లో దండిగా ఆదాయం ఉన్నా ప్రభుత్వ భవనాల పన్నులు మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. వివిధ పురపాల సంఘాల నుంచి పన్ను బకాయిలు రూ.25.47 కోట్లు ఉంటే తిరుపతి కార్పొరేషన్‌కు టీటీడీ చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే రూ.17 కోట్లుగా ఉంది. మిగతా పురపాలక సంఘాల్లో వాటి స్థాయిని బట్టి భారీగానే బకాయిలు ఉన్నాయి. అధికారులు పలుమార్లు కమిషనర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ శాఖలకు అనేక రకాలుగా నిధులు వస్తున్నాయి. వాటినంన్నిటినీ అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనుల పేరుతో దిగమింగుతున్నారు. అంతే తప్ప పన్నుల చెల్లింపులో కార్యాచరణ శూన్యం. టీటీడీకి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే ఒక్కరోజుకు సుమారు రూ.3 కోట్లు వస్తుంది. వీటిని అనేక ధార్మిక పనులకు ఖర్చు చేయడం సరైన పనే. అయితే ఇంత ఆదాయం వస్తున్నా చిన్నపాటి మొత్తం చెల్లించకుండా మొండికేయడం విమర్శలకు దారితీస్తోంది. మున్సిపాలిటీలు వీధిదీపాల విద్యుత్ బిల్లులు నిధుల కొరతతో చెల్లించలేకపోతుండటంతో ఆ రెండు శాఖల మధ్య వివాదం రాజు కుంటోంది. ‘మీరు పన్ను చెల్లిస్తే విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం.. వారు ససేమీరా అంటుండంతో రగడ రాజుకుంటోంది. టీటీడీ చెల్లించాల్సింది రూ.33 కోట్లు.. తిరుపతి కార్పొరేషన్‌కు వడ్డీతో కలిపి సుమారు.33 కోట్ల ఆస్తి పన్నును టీటీడీ చెల్లించాలి. ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మాధవం, విష్ణునివాసం, శ్రీనివాసానికి పన్నులు చెల్లించబోమని టీటీడీ కోర్టుకు వెళ్లింది. భక్తులకు ఉచితంగా వసతి కల్పించలేదు కాబట్టి కచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందేనని తిరుపతి కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్తి పన్ను బకాయితో నామినేషన్ తిరస్కరణ
♦ రిటర్నింగ్ అధికారిపై కోర్టుకెక్కిన అభ్యర్థి ♦ జోక్యానికి హైకోర్టు నిరాకరణ ♦ సివిల్ కోర్టుకెళ్లాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను రూ. 536 బకాయి ఉన్న కారణంగా ఓ అభ్యర్థి సమర్పించిన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సివిల్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన జె.రవీందర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్, వార్డ్ నెంబర్ 65 నుంచి పోటీ చేసేందుకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రూ. 536 ఆస్తి పన్ను బకాయి ఉందని, అలాగే ఎన్నికల అఫిడవిట్లో 3, 5 కాలమ్‌లను పూరించలేదంటూ అభ్యంతరం లేవనెత్తారు. అంతేకాకుండా రవీందర్ నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రవీందర్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.ప్రతాప్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రవీందర్ ఈ నెల 18నే ఆస్తి పన్ను చెల్లించేశారని, అందుకు సంబంధించిన రసీదును కూడా చూపినా కూడా రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదని కోర్టుకు నివేదించారు. ఇక అఫిడవిట్లో 3, 5 కాలమ్‌లను పూరించాలన్న విషయం తెలియక ఖాళీగా వదిలేశారని తెలిపారు. వీటన్నింటినీ వివరిస్తూ రిటర్నింగ్ అధికారికి పిటిషనర్ వినతిపత్రం సమర్పించారని, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రతాప్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. -
ఎయిర్ఇండియాకు 600 కోట్ల ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: అత్యంత ప్రముఖుల(వీవీఐపీ) ప్రయాణ ఖర్చులకు సంబంధించి దాదాపు రూ. 600 కోట్లను ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు చెల్లించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా సేవలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు.. తదితరులు పొందుతుంటారు. కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ శాఖలు పెద్ద మొత్తాల్లో ఎయిర్ఇండియాకు బకాయి పడ్డాయని గురువారం అధికార వర్గాలు తెలిపాయి. -
బాబు వస్తారు.. భారం వేస్తారు !
సీఎం సభల ఖర్చుపై అధికారుల అంతర్మథనం నేడు మళ్లీ చంద్రబాబు రాక అభివృద్ధి పనులకు పైసా ఇవ్వని ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనలకు భారీగా ఖర్చు రవాణాశాఖకే * 50 లక్షల బకాయిలు ఆర్అండ్బీ, పౌరసరఫరాల విభాగాలదీ అదే పరిస్థితి ముఖ్యమంత్రి సభల భోజన ఏర్పాట్లకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. చేతి నుంచి డబ్బులు పెట్టాం. ఎప్పుడిస్తారో తెలియదు.. మళ్లీ సీఎం సభ అట.. అసలు ముఖ్యమంత్రి సభలంటేనే భయమేస్తోంది. మీకు చెబితే పేపర్లో రాస్తారు.. ఆ కలెక్టర్‌తో మాకే చీవాట్లు.. ఓ అధికారి ఆవేదన ఇది. పాత బకాయిలు రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి సభకు 1200 బస్సులు పెట్టమంటున్నారు... రావాల్సిన బిల్లుల సంగతి అడిగితే మాత్రం పలకడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిధులు లేనప్పుడు * కోట్లు ఖర్చు పెట్టి సభలెందుకో..? ..ఇది మరో అధికారి మనోవేదన. గత సభలకు వేసిన షామియానాలు, కుర్చీల డబ్బులే ఇంతవరకు అందలేదు. డబ్బులివ్వలేదని కాంట్రాక్టర్లు పలకడం లేదు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి సభ అట. బిల్లులివ్వమంటే కలెక్టర్ పలకడం లేదు. ముఖ్యమంత్రి సభకు కేటాయించే నిధులతో జిల్లా ప్రజల దాహార్తి తీర్చవచ్చు.. ఇంకో అధికారి అసంతృప్తివాదమిదీ.. సీఎం చంద్రబాబునాయుడు పర్యటనలు, సభలకు భారీగా ఖర్చవుతోందని, ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతోందని జిల్లా అధికారులు మధనపడుతున్నారు. ఖర్చులకు సంబంధించి బకాయిలు కూడా చాలా పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాకు దాదాపు పదిసార్లు వచ్చారు. ఎనిమిది సభల్లో పాల్గొన్నారు. ఒక్కో సభ నిర్వహణకు దాదాపు *కోటి రూపాయలపైనే ఖర్చయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలో భోజనం సదుపాయాలను పౌరసరఫరాల విభాగం చూస్తుండగా, సభకు అవసరమైన షామియానాలు, కుర్చీలు,హెలిపాడ్ ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ చూస్తోంది. జనం తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను రవాణాశాఖ చూస్తోంది. ఒక్కో సభకు 500 నుంచి వెయ్యి వాహనాలను ఆ శాఖ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక కాన్వాయ్, పోలీసు వాహనాలు, వాటి డీజిల్ ఖర్చు సరేసరి. మొత్తంగా ఒక్కో సభకు ఖర్చు *కోటికి పైనే ఖర్చవుతోంది. ఈ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేదు. ఒక్క రవాణాశాఖకు చెల్లించాల్సిన బకాయిలే రూ.50లక్షలకు పైగా ఉన్నాయి. పౌరసరఫరాల విభాగానిదీ అదే పరిస్థితి. సీఎం సభలకు భోజనాలు సరఫరా చేసిన ఆ శాఖ నిధుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తోంది. వీరికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇక రోడ్లు, భవనాల శాఖదీ మరో దుస్థితి. షామియాలు, కుర్చీలు తెచ్చిన కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టకుంటున్నారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో కుప్పం సభలకు షామియానాలు, కుర్చీలు సరఫరా చేసేందుకు పాత కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో రోడ్లు, భవనాల శాఖవారు కొత్తవారిని బతిమలాడుకోవాల్సి వచ్చింది. కాన్వాయ్‌కు సంబంధించిన బకాయిలు సైతం పెండింగ్ ఉన్నట్లు సమాచారం. పోలీసు శాఖకు ప్రభుత్వం డీజిల్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇలా చెప్పుకుంటూపోతే ముఖ్యమంత్రి పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం వివిధ శాఖలకు చెల్లించాల్సిన బకాయిల జాబితా చాంతాడంత. సభలకు డబ్బులు వెచ్చించిన అధికారులు బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. సీఎం సభకు 1200 బస్సులు ఏర్పేడు మండలం గంగాలపల్లె (శ్రీనివాసపురం) వద్ద శనివారం జరిగే ముఖ్యమంత్రి సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని ఉత్తర్వులు అందడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 1200 బస్సులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖను అధికారులు ఆదేశించినట్లు సమాచారం. జిల్లా పరిధిలోని పలు బస్సులతోపాటు, జిల్లా పరిధిలో తిరిగే కర్ణాటక, తమిళనాడు బస్సులు సైతం సీఎం సభకు జనాలను తరలించేందుకు రవాణా శాఖాధికారులు సిద్ధమయ్యారు. అయితే వీటికి సంబంధించిన డీజిల్, డ్రైవర్ భత్యాలు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియక ఆ శాఖాధికారులు లబోదిబోమంటున్నారు. అభివృద్ధి పనులకు పైసా విదల్చేరేమి ? అభివృద్ధి పనులకు పైసా నిధులివ్వని ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనలకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి సభలకు కోట్లు కుమ్మరిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టి పది నెలలు గడిచిపోయాయి. జిల్లాలో అభివృద్ధి పనులకు మాత్రం నామమాత్రంగా కూడా నిధులు విదల్చలేదు. బాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎన్ని కోట్లడిగినా ఇస్తానంటూ మాటలతో సరిపెట్టడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి సభలకు పెడుతున్న ఖర్చు జిల్లా ప్రజలకు వేసవి మొత్తం తాగునీటి సరఫరాకు సరిపోయేంత పెద్ద మొత్తంలో ఉందని కొందరు ఉన్నతాధికారులే పేర్కొనడం విశేషం.