విజయనగరం అర్బన్:ఆర్టీసీలో బ్యాక్‌లాగ్, కారుణ్యనియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్ ఈస్ట్‌కోస్టు (నెక్) రీజియన్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తొలిదశలో బ్యాక్‌లాగ్‌లోని ఎస్టీ కేటగిరీ డ్రైవర్ పోస్టులు 54 భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో 22 ఎస్టీ పోస్టులు శ్రీకాకుళం జిల్లాలోని 5 డిపోల పరిధిలో పురుషులకు, మిగిలిన 32 పోస్టులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మహిళలకు కేటాయించారు. అభ్యర్థులు భారీవాహన డ్రైవింగ్ లెసైన్స్ ఉండి కనీసం18 సంవత్సరాల అనుభవం కలిగి, వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలనీ సమీప డిపో కార్యాలయంలో ధరఖాస్తులను రూ.100లకు కొనుగోలు చేసుకొని ఈ నెల 25వ తేదీ లోగా పూర్తి చేసి ఇవ్వాలని పేర్కొన్నారు.
‘కారుణ్య’నియామక అభ్యర్థులకు ముందస్తు శిక్షణ
ఆర్టీసీలో పనిచేసి సర్వీసులో ఉండగా చనిపోయిన కార్మిక, ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య పోస్టుల భర్తీలో ఈ సారి ముందస్తు శిక్షణ ఇవ్వాలని సంస్థ భావిస్తోంది. సాంకేతిక విద్యార్హత ఉన్న వారసులను మాత్రమే ఎంపిక చేసి నేరుగా పోస్టులను ఇచ్చే విధానం ఇంతవరకు ఉండేది. అర్హుతగలవారు లేని కుటుంబాలు అధికంగా ఉండడం వల్ల ఆ విధానానికి సంస్థ స్వస్తి చెప్పింది.
కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్న వారసులను ఎంపిక చేసి వారికి సాంకేతిక పరిజ్ఞానంపై 6 నెలల శిక్షణ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి నెల స్టైఫండ్ ఇచ్చి సంస్థకు కావలసిన పరిజ్ఞానాన్ని నేర్పించి సంస్థలోని శ్రామికపోస్టులో నియమిస్తారు. తాజాగా నెక్ పరిధిలోని శ్రామిక కార్మిక పోస్టులను ఈ విధానంలోని కారుణ్య నియామక ప్రక్రియను చేపట్టడానికి సిద్ధమయింది. ఇందుకోసం తాజాగా ఆర్టీసీ నెక్ ఆర్‌ఎం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలను నెక్ పీఓ ఎం.సన్యాసిరావు శనివారం విలేకరులకు తెలిపారు. 1998 జనవరి ఒకటి నుంచి ఇంతవరకు మరణించిన కార్మిక, ఉద్యోగుల వారసులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ పోస్టుకు అర్హులు కారని తెలిపారు. సంబంధిత వారసులు ఈ నెల 30వ తేదీలోగా తమ దరఖాస్తులను నెక్ రీజయన్ కార్యాలయానికి పంపుకోవాలని తెలిపారు.
ఆర్టీసీలో బ్యాక్‌లాగ్ నియామక సందడి
Published Sun, Jul 10 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement