ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఎస్‌ఈఆర్‌సీ) ప్రకటించింది. మితిమీరిన కరెంటు కోతలతో ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించింది. విద్యుత్ చట్ట–2003 ప్రకారం ‘విద్యుత్ కోతకు పరిహారం’ విధానాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. (బిల్లు మోత.. విద్యుత్ వాత!)
‘విద్యుత్ చట్టం, 2003 ప్రకారం, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని ప్రకారం, విద్యుత్ సరఫరా యొక్క నాణ్యతా పారామితులను పరిష్కరించే బాధ్యత సీఎస్‌ఈఆర్‌సీకి ఇవ్వబడింద’ని సీఎస్‌ఈఆర్‌సీ కార్యదర్శి ఎస్‌పీ శుక్లా అన్నారు. దీని ప్రకారం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరంలో, ఏప్రిల్ నుండి జూన్ వరకు ఒక నెలలో మొత్తం 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పంపిణీ సంస్థ పరిహారం చెల్లిస్తుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఈ కాలంలో నెలకు 20 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయ పరిమితిని నిర్దేశించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి గరిష్ట సమయ పరిమితిని నాలుగు గంటలు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది.
సాధారణ లైన్ లోపాలను సరిదిద్దడానికి పట్టణ ప్రాంతాల్లో ఆరు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల సమయాన్ని నిర్దేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లను బాగుచేయడానికి పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 5 రోజుల సమయం తీసుకోవచ్చు. దెబ్బతిన్న డొమెస్టిక్ మీటర్లను పట్టణాల్లో 8 గంటలు, గ్రామాల్లో రెండు రోజుల్లోగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీన్ని పాటించడంలో విద్యుత్ పంపిణీ సంస్థ విఫలమైతే, అది రోజుకు 50 రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా ఇంట్లో కొత్త మీటర్ బిగించకపోయినా రోజుకు 50 రూపాయల చొప్పున వినియోగదారుడికి పరిహారం ఇవ్వాల్సివుంటుంది. (కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..)
Comments
Please login to add a commentAdd a comment