Electricity Regulatory Commission
-
బహిరంగ విచారణ దేనికి.!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, రైతులకు ఉచిత విద్యుత్‌పై రానున్న 30 ఏళ్ల పాటు హక్కు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. విద్యుత్ చట్టాలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాయి. తక్కువ రేటుకే విద్యుత్ కొని 30 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించే మంచి కార్యక్రమం ఈనాడుకు నచ్చలేదు. రామోజీ ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)నే తప్పుబడుతూ ఈనాడులో కథనాలు ఇస్తున్నారు. సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలపైనే అడ్డగోలుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండు రోజులుగా ఈనాడు పత్రికలో వస్తున్న అసత్య కథనాలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. కనీస అవగాహన లేకుండా, చట్టం గురించి తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయడంపై తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ‘సాక్షి’కి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈనాడు ఆరోపణ: సెకీతో 2021లో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవం: విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ. మండలి తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు. మండలి నిర్ణయాలపై ఎలాంటి గోప్యతకు తావులేదు. బహిరంగ విచారణ విషయానికొస్తే మండలి అనుసరించే విచారణ ప్రక్రియ విద్యుత్ సరఫరా చట్టం, అందుకు అనుగుణంగా మండలి జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 62 – 64 ప్రకారం పంపిణీ సంస్థల టారిఫ్‌ను నిర్దేశించే క్రమంలో డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను పత్రికాముఖంగా తెలియజేయాలి. ఆ ప్రతిపాదనలపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించి, మండలి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. ఐదో నియంత్రిత కాలం లోడ్ ఫోర్కాస్ట్ రిసోర్స్ ప్లాన్ ప్రకారం ఉన్న విద్యుత్ అవసరాల రీత్యా 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని మండలి భావించింది. ఇందుకు సహేతుక కారణాలు తెలుపుతూ 2021 నవంబర్ 11న డిస్కంల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు మండలి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. విద్యుత్ టారిఫ్ విషయానికి వస్తే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే టారిఫ్ని నిర్ధారిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. 2022లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ)లో దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్ రూ.2.49 పైసలుగా టారిఫ్‌ను నిర్ధారించింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అభ్యంతరదారులు పిల్ దాఖలు చేశారు. ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆరోపణ: విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో చేసుకున్న ఒప్పందం ఆమోదం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను మండలి వెబ్సైట్లో ఉంచలేదు. వాస్తవం: ఈ విమర్శల్లో ఎటువంటి వాస్తవికత గాని, హేతుబద్ధత గాని లేదు. ఏదైనా ప్రతిపాదనపై విచారణ ప్రక్రియ చట్టానికి అనుగుణంగా జరుగుతుంది. వినియోగదారుల విద్యుత్ చార్జీల సవరణ, ట్రూఅప్ చార్జీలపై మాత్రమే కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుంది. వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే వెబ్సైట్లో ఉంచుతుంది. ఇతర ఏ ప్రతిపాదనలకు బహిరంగ విచారణ జరపాలని గానీ, వెబ్సైట్లో పెట్టాలని గానీ చట్టంలో నిబంధన లేదు. అందువల్ల పత్రికలో మండలిపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారాలు. ఇటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా మండలి లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించడం వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేయదు. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు
తిరుపతి రూరల్: వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 18వ రాష్ట్రస్థాయి సలహామండలి(ఎస్ఏసీ) సమావేశం జరిగింది. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రైతుల నుంచి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెప్పారు. రానున్న 30ఏళ్ల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ‘సెకీ’ ద్వారా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల నుంచి వినియోగదారులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారని వివరించారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్ఈసీఎస్ ఎండీపై క్రిమినల్ కేసు పెట్టండి
సాక్షి, అమరావతి: రూరల్ ఎలక్ట్రిక్ కో–ఆపరేటివ్ సొసైటీ (ఆర్ఈసీఎస్)ల్లో అధికార దుర్వినియోగం, అనధికారికంగా బిల్లుల వసూలు తదితర ఆరోపణలపై విచారణకు హాజరు కాని అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఈమేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఈసీఎస్‌లలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, అనధికారికంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి ఆర్ఈసీఎస్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న వైనాన్ని సూమోటోగా స్వీకరించిన ఏపీఈఆర్సీ.. ఈ నెల 13న విచారణకు రావాలని ఎండీ రామకృష్ణంరాజుకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన బుధవారం విచారణకు హాజరు కాలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్లు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, విచారణకు హాజరు కాలేనని తెలుపుతూ డాక్టర్ సర్టిఫికెట్తో పాటు లేఖను మెయిల్ ద్వారా కమిషన్‌కు పంపారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకే వెన్నునొప్పిని సాకుగా చూపించారని ఏపీఈఆర్సీ భావించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టాలని బుధవారం విచారణకు హాజరైన ఈపీడీసీఎల్ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై పూర్తి స్థాయి నివేదికలతో ఈ నెల 20న మరోసారి హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విచారణకు రావాలని ఎస్ఈని ఆదేశించింది. అదే రోజు ఎండీ కూడా వ్యక్తిగతంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. మేం ఆదేశించినా ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎస్ఈ సురేష్‌కుమార్ వెంటనే అఫిడవిట్ దాఖలు చేశారు. అనకాపల్లి ఆర్ఈసీఎస్కు లైసెన్స్ మినహాయింపు గడువు ముగియగా, గతేడాది మార్చి 25న దానిని స్వాధీనం చేసుకోవాలని ఈపీడీసీఎల్‌కు ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని ఎస్ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలోనే బిల్లింగ్ జరుగుతుతోందని తెలిపారు. కానీ జూన్ మొదటి వారంలో ఆర్ఈసీఎస్ మే నెల బిల్లులు జారీ చేసి దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసిందన్నారు. బిల్లులు వసూలు చేయవద్దని తాము జూన్ 1న, 3న నోటీసులు జారీ చేశామని వివరించారు. అయినప్పటికీ ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదన్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను వెంటనే ఈపీడీసీఎల్‌కు పంపాలని కోరుతూ జూన్19న, 22న, 23న లేఖలు పంపినప్పటికీ స్పందన లేదన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.9 కోట్లను వెంటనే రికవరీ చేస్తామని, అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఈ అఫిడవిట్లో తెలిపినట్లు విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు! ఏప్రిల్ 1 నుంచే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ఖరారైంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ Electricity Regulatory Commission గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్(గృహోపయోగ విద్యుత్తు వాడకం) పై 40-50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పెరగనుంది. అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇచ్చింది. డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్ నెలలోనే నివేదికలు సమర్పించకగా.. ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు ఆ టైంలోనే అందించాయి. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా విద్యుత్ నియంత్రణ మండలి టీఎస్ ఈఆర్సీ అంగీకరించినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచే వర్తింపు డిస్కంల ప్రతిపాదనలతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పెంపు నిర్ణయం తీసుకుందని ఈఆర్సీ చైర్మన్ టి. శ్రీరంగారావు మీడియా సమావేశంలో తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ 16 వేల కోట్ల రూపాయలు. కానీ, 14, 237 కోట్ల రూపాయల గ్యాప్‌ను మాత్రమే కమిషన్ ఆమోదించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలులోకి రానున్నాయి అని చైర్మన్ రంగారావు వెల్లడించారు. గతంలో కంటే 38.38 శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్న ఆయన.. వ్యవసాయానికి విద్యుత్ టారిఫ్ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కంలు నవంబర్ 30లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందు ఉంచాలని ఆదేశించినట్లు వెల్లడించారు. -
అక్కడి నుంచే చెప్పండి
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల(టారిఫ్)పై ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) ప్రజాభిప్రాయాన్ని బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించనుంది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. సదస్సుల్లో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పి.రాజగోపాల్‌తో పాటు రాష్ట్ర ఇంధన శాఖ, మూడు డిస్కంల అధికారులు పాల్గొంటారు. 2022–23 సంవత్సరానికి ‘ఏఆర్ఆర్’ సమర్పణ తక్కువ విద్యుత్ వినియోగించే వారిపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022–23 ఆర్థిక సంవత్సర రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ), అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గత ఏడాది డిసెంబర్ 13న ఏపీ ఈఆర్సీకి సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులను చేయాల్సిన అవసరాన్ని ఇందులో వివరించాయి. వివిధ మార్గాల ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించాయి. మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేశాయి. పరిశ్రమలకు నాన్ పీక్ అవర్స్‌లో టైం ఆఫ్ ది డే (టీఓడీ) పేరుతో యూనిట్‌కు 50 పైసల చొప్పున రాయితీ ఇచ్చేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. అవసరమైతే ఇదే విధానాన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని తెలిపాయి. కాగా, ఏపీ ఈఆర్సీ నిలిపివేసిన 2014–2019 ట్రూ అప్ చార్జీలను తిరిగి వసూలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా.. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుంచే జరుపనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను నియంత్రణ మండలి స్వీకరిస్తుంది. విశాఖ వెళ్లక్కర్లేదు ఏపీఈఆర్సీకి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారు విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ (ఎస్ఈ ఆఫీస్), డివిజన్ కార్యాలయం (డీఈ ఆఫీస్) ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిరోజు ముందుగానే నమోదు చేసుకున్న వారి నుంచి అభ్యంతరాలు విన్న తరువాత, నమోదు చేసుకోని వారు మాట్లాడేందుకు ఏపీ ఈఆర్సీ అనుమతిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ‘సాక్షి’కి చెప్పారు. -
‘సౌర విద్యుత్’లో ఏపీ మరో ఘనత
సాక్షి, అమరావతి: సోలార్ పార్కుల అభివృద్ధికి రూ.580.80 కోట్లు కేటాయించి దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సౌర విద్యుత్ స్థాపిత సామర్ధ్యంలో దేశంలోనే మూడో అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మెర్కామ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 2021 డిసెంబర్ చివరి నాటికి క్యుములేటివ్ యుటిలిటీ స్కేల్ సోలార్ ఇన్స్టలేషన్లు 41.5 గిగావాట్లుగా ఉన్నాయి. డిసెంబరు 2021 నాటికి 8.9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో యుటిలిటీ స్కేల్ సోలార్ ప్రాజెక్ట్‌లలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక 7.5 గిగావాట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 4.3 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో ఏపీ మూడో స్థానంలో ఉంది. 4 గిగావాట్ల సామర్థ్యంతో తమిళనాడు 4వ స్థానంలో, 3.9 గిగావాట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అయిదో స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం స్థాపిత సౌర విద్యుత్ సామర్ధ్యంలో 10 శాతానికి పైగా వాటాను రాష్ట్రం దక్కించుకుంది. అయితే అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులను రక్షించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజస్థాన్‌లో రాబోయే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. ఈ పక్షి కొన్ని పవర్ ప్రాజెక్టుల ప్రాంతాలలో నివాసం ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రాజెక్టులు ఆలస్యమైతే ఏపీలో ఇటువంటి ప్రాజెక్టులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సౌర విద్యుత్‌కు ఏపీ ప్రాధాన్యం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నాణ్యమైన సౌర విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి పొందాయి. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్ యూనిట్ రూ.2.49 పైసలు చొప్పున ఇచ్చేందుకు ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్తును పాతికేళ్ళపాటు కొనుగోలు చేయనుంది. ఈ చర్యతో భవిష్యత్తులో ఏపీ స్థానం మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
-
తెలంగాణలో ‘విద్యుత్’ షాక్.. ఛార్జీల పెంపు!
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీElectricity Regulatory Commissionకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్‌తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు,బొగ్గు,బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు. -
దేశంలోనే మొదటిసారిగా..
రాయ్‌పూర్: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఎస్ఈఆర్సీ) ప్రకటించింది. మితిమీరిన కరెంటు కోతలతో ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే పరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించింది. విద్యుత్ చట్ట–2003 ప్రకారం ‘విద్యుత్ కోతకు పరిహారం’ విధానాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. (బిల్లు మోత.. విద్యుత్ వాత!) ‘విద్యుత్ చట్టం, 2003 ప్రకారం, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని ప్రకారం, విద్యుత్ సరఫరా యొక్క నాణ్యతా పారామితులను పరిష్కరించే బాధ్యత సీఎస్ఈఆర్సీకి ఇవ్వబడింద’ని సీఎస్ఈఆర్సీ కార్యదర్శి ఎస్పీ శుక్లా అన్నారు. దీని ప్రకారం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరంలో, ఏప్రిల్ నుండి జూన్ వరకు ఒక నెలలో మొత్తం 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పంపిణీ సంస్థ పరిహారం చెల్లిస్తుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఈ కాలంలో నెలకు 20 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయ పరిమితిని నిర్దేశించారు. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి గరిష్ట సమయ పరిమితిని నాలుగు గంటలు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. సాధారణ లైన్ లోపాలను సరిదిద్దడానికి పట్టణ ప్రాంతాల్లో ఆరు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల సమయాన్ని నిర్దేశించారు. ట్రాన్స్ఫార్మర్లను బాగుచేయడానికి పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 5 రోజుల సమయం తీసుకోవచ్చు. దెబ్బతిన్న డొమెస్టిక్ మీటర్లను పట్టణాల్లో 8 గంటలు, గ్రామాల్లో రెండు రోజుల్లోగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీన్ని పాటించడంలో విద్యుత్ పంపిణీ సంస్థ విఫలమైతే, అది రోజుకు 50 రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా ఇంట్లో కొత్త మీటర్ బిగించకపోయినా రోజుకు 50 రూపాయల చొప్పున వినియోగదారుడికి పరిహారం ఇవ్వాల్సివుంటుంది. (కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..) -
విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపండి: మోదీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలకు తగు పరిష్కారం చూపి, పనితీరు మెరుగు పరుచుకునేందుకు సాయపడాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా విద్యుత్ పంపిణీ విధానం వేర్వేరుగా ఉండటం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన టారిఫ్ విధానం, విద్యుత్(సవరణ)బిల్లు–2020లోని అంశాలపై సమీక్ష జరిపారు. విద్యుత్ వినియోగదారుకు సంతృప్తి కలిగించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని..నిర్వహణ సామర్థ్యం పెంపు, ఆర్థిక సమృద్ధి సాధించాలన్నారు. డిస్కమ్ లు తమ పనితీరును ఎప్పటికప్పుడు వెల్లడించడం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, చెల్లిస్తున్న రుసుములను బేరీజు వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నవీన, పునరుత్పాద ఇం ధన వనరుల వినియోగం వ్యవసాయ రంగంలో పెరగాలన్నారు. పూర్తిగా రూఫ్‌టాప్ సౌరశక్తి విని యోగించుకునేలా ప్రతి రాష్ట్రం కనీసం ఒక నగరా న్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యుత్ పరికరాలను దేశీయంగా తయారు చేసుకోవడంతో ఉద్యోగిత పెంపు వంటి ఉపయోగాలున్నాయన్నారు. -
తాత్కాలిక విద్యుత్ బిల్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసుకోకుండా ప్రత్యామ్నాయ విధానంలో ఎల్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుత ఏప్రిల్ నెలలో బిల్లులు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా అనుమతిచ్చింది. గతేడాది సరిగ్గా ఏప్రిల్ నెలలో లేదా గత మార్చి నెలలో జారీ చేసిన విద్యుత్ బిల్లులు ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఏప్రిల్ నెలలో వినియోగదారులకు తాత్కాలిక బిల్లులు జారీ చేస్తామని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. రాష్ట ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే తదుపరి నెలకు సంబంధించిన మీటర్ రీడింగ్‌ను తీసి వినియోగదారుల వాస్తవ విద్యుత్ వినియోగం ఆధారంగా తాత్కాలిక విధానంలో జారీ చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దాలని ఆదేశించింది. ఏప్రిల్‌లో ఎల్టీ వినియోగదారులకు ఈ కింది పద్ధతిలో విద్యుత్ బిల్లులు జారీ చేయనున్నారు. విద్యుత్ బిల్లు జారీ ఇలా.. ► 2019 మార్చి నాటికి ఉనికిలో ఉన్న గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు 2019 ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమాన బిల్లులను ప్రస్తుత ఏప్రిల్ నెలలో జారీ చేయనున్నారు. అంటే మార్చి 2019లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 2019 ఏప్రిల్‌లో చెల్లించాలి. 2020 మార్చిలో వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సైతం తాత్కాలికంగా 2019 మార్చిలో వాడిన విద్యుత్ గణాంకాల ప్రాతిపదిక వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా, ఈఆర్సీ ఆమోదించింది. ► 2019 ఏప్రిల్ 1– 2020 ఫిబ్రవరి 29 మధ్య కాలంలో జారీ చేసిన గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు 2020 మార్చిలో జారీ చేసిన బిల్లుకు సమాన బిల్లును ప్రస్తుత నెలలో జారీ చేయనున్నారు. ► మార్చి 2020లో జారీ చేసిన కొత్త గృహ (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), నీటి సరఫరా పథకాల (ఎల్టీ–6బీ) విద్యుత్ కనెక్షన్ల వినియోగదారులకు కనీస డిమాండ్ ప్రాతిపదికన ఏప్రిల్ 2020లో బిల్లులు జారీ చేయనున్నారు. ► మార్చి 2019 నాటికి ఉనికిలో ఉన్న ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు ఏప్రిల్ 2019లో జారీ చేసిన బిల్లుకు 50 శాతం సమాన బిల్లును 2020 ఏప్రిల్‌లో జారీ చేయనున్నారు. ► 2019 ఏప్రిల్ 1– 2020 ఫిబ్రవరి 29 మధ్యకాలంలో జారీ చేసిన ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు 2020 మార్చిలో జారీ చేసిన బిల్లుకు 50 శాతం సమాన బిల్లును ఏప్రిల్ 2020లో జారీ చేస్తారు. ఇతర ఎల్టీ కేటగిరీలో కమర్షియల్ (ఎల్టీ–2ఏ/2బీ), అడ్వర్టయిజ్ మెంట్ హోర్డింగ్స్ (ఎల్టీ–2సీ), హెయిర్కట్టింగ్ సెలూన్స్ (ఎల్టీ–3డీ), పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4ఏ), వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు (ఎల్టీ–4బీ) కేటగిరీల వినియోగదారులు వస్తారు. ► మార్చి 2020లో జారీ చేసిన ఇతర అన్ని రకాల ఎల్టీ కేటగిరీల (ఎల్టీ–5 వ్యవసాయ కేటగిరీ మినహాయించి) కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులకు కనీస డిమాండ్ లెక్కల ప్రాతిపదికన 2020 ఏప్రిల్‌లో బిల్లులు జారీ చేస్తారు. ► ఎస్ఎంఎస్లు/మొబైల్ యాప్స్/వెబ్సైట్ల ద్వారా వినియోగదారులకు వారి బిల్లుల వివరాలు తెలియజేయనున్నారు. -
ఈఆర్సీ చైర్మన్‌గా శ్రీరంగారావు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సభ్యులుగా ఎండీ మనోహర్ రాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య (ఫైనాన్స్) ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫ్యాప్సీ భవన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా వీరితో ప్రమాణం చేయించారు. హైద్రాబాద్:నాంపల్లిలోని లక్డ్డికాపుల్,ఫ్యాబ్సిలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్సిటీ రేగులటోరి కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన టి.శ్రీరంగరావు, టెక్నికల్ మెంబెర్ గా ఎం.డి.మనోహర్ రాజు,ఫైనాన్స్ మెంబెర్‌గా బి.కృష్ణయ్య,హాజరైన ఛీఫ్ సెక్రటరీ ఎస్. కె.జోషి,స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా ప్రమాణం చేయించారు. -
ఏపీ ఈఆర్సీ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్సీ) చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. -
విద్యుత్ ‘షాక్’
చార్జీల మోతకు రంగం సిద్ధం ఏటా రూ.70.8 కోట్ల భారం 4లక్షల మంది వినియోగదారులపై ప్రభావం తిరుపతి రూరల్: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఆయన కొత్తగా విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుతో జిల్లాలో నాలుగు లక్షల మంది వినియోగదారులపై ప్రతియేటా రూ.70.7 కోట్ల భారం పడనుంది. ఆ మేరకు సోమవారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ ప్రకటించారు. జిల్లాలో 14,76,748 కనెక్షన్లు జిల్లాలో 14,76,748 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహాలకు 10,74,508, వాణిజ్యం 92,340, పరిశ్రమలకు 11,062, చేతివృత్తుల పరిశ్రమలు 6,903, వ్యవసాయ కనెక్షన్లు 1,42,863, స్ట్రీట్ లైట్స్ 18,091, తాగునీరు 8,919, దేవాలయాలు 51, 1,062 హై టెన్షన్ విద్యుత్ కనె క్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ 11.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. నెలకు 354 మి.యూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రూ.72 కోట్ల భారం విద్యుత్ చార్జీల భారం అత్యధికంగా పారిశ్రామిక వర్గాలపైనే పడనుంది. జిల్లాలో ఈ కేటగిరీ కింద 1,062 మంది ఉన్నారు. ప్రతి నెలా 11.80 కోట్ల యూనిట్ల వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం యూనిట్‌పై 31 నుంచి 60 పైసల వరకూ పెరగనుంది. దీని ప్రకారం 45 పైసలు పెరిగినా నెలకు రూ.5.31 కోట్లు, ఏటా రూ.63.72 కోట్ల భారం పడనుంది. వాణిజ్య అవసరాల విభాగంలో 92,340 మంది వినియోగదారులున్నారు. ఈ విభాగంలో గత నెల 73.88 లక్షల యూనిట్లు వినియోగించారు. యూనిట్‌కు ప్రస్తుతం 46పైసల చొప్పున నెలకు రూ.33.98 లక్షలు, ఏటా రూ.4.08కోట్లు భారం పడనుంది. జిల్లాలో 200 యూనిట్లు వరకూ విద్యుత్‌ని వినియోగించే గృహ అవసరాల కనెక్షన్లు 12,163 ఉన్నాయి. ప్రతినెలా దాదాపు 71.54 లక్షల యూనిట్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీపై 19 పైసలు మేర భారం మోపనున్నారు. అంటే నెలకు రూ.13.6 లక్షల చొప్పున ఏటా రూ.1.63 కోట్లు అదనపు భారం పడనుంది. కాటేజీ ఇండస్ట్రీస్ విభాగంలో జిల్లాలో 6,903 కనెక్షన్లు ఉన్నాయి. ఈ విభాగంలో గత నెల 21.78 లక్షల యూనిట్ల వినియోగం జరిగింది. ప్రస్తుతం 16 నుంచి 50 పైసల వరకూ భారం పడనుంది. అంటే నెలకు రూ.8.71 లక్షలు, ఏటా రూ. 1.04 కోట్లు వాత పడనుంది. మరో కేటగిరీ కింద జిల్లాలో 2.63 లక్షల మంది వినియోగదారులున్నారు. నెలకు 62,345 యూనిట్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రూ.5.4 చొప్పున వసూలు చే స్తుండగా తాజాగా రూ.5.72కు పెరగనుంది. యూనిట్‌కు 32పైసలు పెరిగితే ఏటా రూ.2.39 లక్షలు భారం పడనుంది. అంటే పారిశ్రామిక, వాణిజ్య, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులపై ఏటా రూ.70.7 కోట్ల భారం పడుతుంది. -
స్విచ్చేస్తే షాక్
సాక్షి, మంచిర్యాల : మరోసారి వినియోగదారులపై కరెంటు చార్జీల మోత మోగనుంది. సంస్థ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచేలా ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలు చేసింది. దీంతో విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి కానుంది. ఫలితంగా ఏటా రూ.30 కోట్ల వరకు భారం పడనుంది. ఇప్పటికే వస్తున్న కరెంటు చార్జీలను భరించలేకుండా ఉన్న వినియోగదారులు.. మరోమారు పెంచనుండడంతో లబోదిబోమంటున్నారు. కమిషన్‌కు పెంపు ప్రతిపాదనలు.. : విద్యుత్ చార్జీల పెంపు టారిఫ్ రేట్లను రూపొందించిన ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలను ఇటీవల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. కమిషన్ కూడా చార్జీల పెంపుపై సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. చార్జీల పెంపుపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ గురువారం ఈ విషయమై వరంగల్‌లో సమావేశమైంది. ఇందులో జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు టారిఫ్ రేట్లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇందులో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినా సభ్యులు మాత్రం మౌనంగా ఉండి .. చార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. చార్జీలు పెరిగితే జిల్లా ప్రజలపై సుమారుగా ఏటా రూ.30 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. చార్జీల పెంపు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు.. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో రానున్న రోజుల్లో కరెంట్ కోతల ముప్పూ ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా 6,44,151 విద్యుత్ కనెక్షన్లు.. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలకు సంబంధించి 6,44,151 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో.. 5,10,695 గృహ సంబంధిత కనె క్షన్లు ఉండగా, పరిశ్రమలు 3,420, వ్యవసాయ కనెక్షన్లు 1,30,036 ఉన్నాయి. ప్రతినెలా 124 మిలియన్ యూనిట్ల నుంచి 140 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు సగటున నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకంలో ఉంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో డిస్కంల ఖర్చులు.. విద్యుత్ చార్జీల ఆదాయం మధ్య రూ.2.5 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు లోటు ఉంటోంది. అందుకే.. ఈ లోటును చార్జీల రూపేణా పూడ్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. చార్జీల పెంపు స్వల్పమే.. ప్రస్తుతం కొంత మేరకే చార్జీలు పెంచాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. అదే ప్రతిపాదన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. 100-200 యూనిట్లు వాడితే 4 శాతం, 200 ఆ పైనా విద్యుత్ వాడితే 5.57 శాతం మేరకు బిల్లులు పెంచాలని నిర్ణయించింది. గృహేతర, వాణిజ్య, పరిశ్రమలు, వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలు, పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ వినియోగంపై ప్రస్తుతమున్న చార్జీల కన్నా 5.75 శాతం హెచ్చిస్తూ ప్రతిపాదనలు పంపింది. దీంతోపాటు హెచ్‌టీ వినియోగం కింద సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వాడిన పరిశ్రమలకు అదనంగా ఒక రూపాయి చొప్పున టీవోడీ చార్జీని వినియోగించాలని విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఇదిలావుంటే.. జిల్లాలో గృహావసరాలకు సంబంధించి చాలా మంది 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. ఇతర కేటగిరిల్లోనూ వాడకం ఎక్కువే. ఈ లెక్కన చూసుకుంటే.. జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై రూ. 30 కోట్ల మేరకు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
విన్నారు.. వెళ్లారు..
విద్యుత్ చార్జీల పెంపుపై వైఖరి వెల్లడించని ఈఆర్సీ పలు సమస్యలపై గళమెత్తిన వినియోగదారులు, సంఘాల నేతలు హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, సభ్యులు విద్యుత్ వినియోగదారుల వాదనలు విన్నారు.. వారి వైఖరి, తీసుకోబోయే చర్యల గురించి మాట మాత్రమైన చెప్పకుండానే వెళ్లారు. విద్యుత్ చార్జీల పెంపు, టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ అవసరాలు, ఆదాయం, వ్యయం, వినియోగదారుల సమస్యలపై హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇస్తామయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, మనోహర్‌రెడ్డితో కూడిన బెంచ్ గురువారం బహిరంగ విచారణ జరిపింది. అరుుతే... ఈఆర్సీ చార్జీల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ప్రతిపాదించిన ట్లు విద్యుత్ వినియోగదారులపై భారం మోప డం ఖాయంగా కనపడుతోంది. ముందుగా ఎన్పీడీసీఎల్ పరిధిలోఎంత విద్యుత్ వినియో గం అవసరం, నిర్వహణ, ఆదాయ, వ్యయా లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ వివరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది... విద్యుత్ ఎవరి సొత్తు కాదని, అందరికి సమానంగా అందాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము అన్నారు. వ్యాపార ప్రకటనలకు పీక్ సమయంలో విద్యుత్‌ను నిలిపివేయాలన్నారు.. వ్యాపార సంస్థలకు తక్కువ మొత్తలో చార్జీలు పెంచి గృహ వినియోగదారులకు ఎక్కువ శాతం పెంచడం తగదు. వ్యవసాయదారుల నుంచి సర్వీస్ చార్జి వసూలు చేస్తూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామంటూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు భారీ గా జీతాలు తీసుకుంటూనే రైతులను పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని మండిప డ్డారు. సర్వీస్ చార్జీలు సంవత్సరానికి రూ. 360వసూలు చేయాలి.. కానీ, రూ.600 వసూ లు చేసి రశీదు ఇచ్చారని చెప్పారు. ఇది అసలుదా.. నకిలీదా అని ప్రశ్నించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది.. సీజీఎఫ్ చైర్మన్ గా కంపెనీ అధికారిని కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చినా.. విద్యుత్ అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి పెచ్చరిల్లిందని భారతీయ కిసాన్ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకుడు ఇంజిరెడ్డి అన్నారు. ఓ రైతు రూ.10 వేలు లంచమిచ్చినా ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని వివరించారు. నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే సరిపోతుంది నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే బిల్లులు పెంచే అవసరముండదని వినియోగదారుల మండలి జిల్లా ప్రతినిధి చక్రపాణి సూచించారు. అధికారులు, ఈఆర్సీ ఈ దిశగా ఆలోచించాలన్నా రు. రాత్రి కరెంట్‌తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా వ్యవసాయానికి పగలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యా యం జరిగిందని ఫోరానికి వెళితే 3 నెలలు పడుతోందని, ఫోరం నిర్ణయం వెలువడకముందే కనెక్షన్ తొలగిస్తున్నారని వివరించారు. వర్కర్‌ను కేటారుుంచాలి వినియోగదారులకు అవగాహన కల్పించేం దుకు కనీసం కరపత్రాలు కూడా ముద్రించడం లేదని విద్యుత్వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యుడు సాయిరెడ్డి అన్నారు. రూ. లక్షల్లో బకాయిల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పైసా అపరాధ రుసుం విధించని ఎన్పీడీసీఎల్ మామూలు వినియోగదారులు ఒక్క రూపాయి బకాయి ఉన్న రూ.75 అపరాధ రుసుం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్‌కు వర్కర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపును విరమించుకోవాలి.. ఖమ్మం జిల్లాలో 500 గ్రానైట్ పరిశ్రమలుం డగా 300 మూతపడ్డారుు... మరో వంద పరిశ్రమలు మూతపడే పరిస్థితులో ఉన్నాయని, ఖ మ్మం గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు రాజేష్ వివరించారు. పరిశ్రమలపై భారం మోపద్దని కోరారు. చార్జీల భారం మోపద్దు.. హెచ్‌టీ వినియోగదారులపై అధిక చార్జీల భారం మోపుతున్నారని తెలంగాణ కాటన్ ట్రే డర్స్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. పరిశ్రమలు న ష్టా ల్లో ఉన్నారయని, చార్జీల భారం వేయొద్దని సూచిం చారు. చిరు వ్యాపారులకు గృహ కనెక్షన్లు ఇవ్వాలని కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంజయ్య కోరారు. చివరకు సీఎండీ మాట్లాడుతూ తమదృష్టికి తీసుకొచ్చి న లోపాలు సవరించుకుంటామని, అవినీతికి ఆస్కారం లేకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పి సమావే శాన్ని ముగించారు. విచారణలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, పలు సంఘాల నేతలు, ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. -
పెంపునకు బ్రేక్
విద్యుత్ చార్జీలు పెంచే యోచనకు బ్రేక్ పడినట్లు విశ్వసనీయ సమాచారం. కోర్టులో పిటిషన్లు, ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వెనకడుగు వేసింది. శనివారం నుంచి అమలు కావాల్సిన పెంపును నిలిపివేసినట్లు తెలిసింది. చె న్నై, సాక్షి ప్రతినిధి:విద్యుత్ చార్జీలను పెంచబోతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 23న ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఏ మేరకు పెంచబోతున్నారో అంచనాల పట్టికను సైతం విడుదల చేసింది. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణకు చెన్నై, తిరునెల్వేలీ ఈరోడ్లలో రెగ్యులేటరీ కమిషన్ సమావేశాలను నిర్వహించింది. ఉత్తరాలు, ఆన్లైన్ ద్వారా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమై తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున విద్యుత్ చార్జీల పెంపుకే మొగ్గుచూపారు. ఈ నిర్ణయం మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు ఈనెల 15వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణరుుంచుకున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ చార్జీ ల పెంపుపై సీనియర్ న్యాయవాది గాంధీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, విద్యుత్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో విద్యుత్ చార్జీల పెంపును రెగ్యులేటరీ కమిషన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక విద్యుత్ అధికారి వివరణ ఇస్తూ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వ సలహా మేరకే చార్జీల పెంపును తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయన స్పష్టం చేశారు. శ్రీరంగం నేపథ్యం అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ జైలు శిక్షతో కోల్పోయిన శ్రీరంగం శాసనసభా స్థానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నికలు రానున్నాయి. ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ స్థానంలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక కసరత్తుతో పోటీకి సిద్ధమవుతున్నాయి. కోల్పోయిన స్థానాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సహజంగానే పట్టుదలతో ఉంది. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను మూటకట్టుకుంటే దాని ప్రభావం శ్రీరంగం ఎన్నికలపై పడగలదని అధికార అన్నాడీఎంకే భయపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే విద్యుత్ చార్జీల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
టీనగర్: విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచనున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించిందని, ఇందుకోసం గత నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందన్నారు. ఇందులో విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అయినప్పటికీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. రూ.3.50కు కొనుగోలు చేయాల్సిన విద్యుత్‌ను 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, అందుచేత విద్యుత్ చార్జీలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అయితే ఇంతవరకు ఆ నియామకం జరగలేదని తెలిపారు. ఉన్నతాధికారులే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లో కూర్చుని విద్యుత్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారని తెలిపారు. అందుచేత విద్యుత్ చార్జీల పెంపుపై స్టే విధించాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ సమక్షంలో విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు, దీనికి సంబంధించి మరో నాలుగు వారాల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, రాష్ట్ర విద్యుత్ బోర్డు, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు పంపుతూ ఉత్తర్వులిచ్చారు. -
వడ్డనకు రెడీ
సాక్షి, చెన్నై: ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విద్యుత్ చార్జీల వడ్డనకు ఆ శాఖ సిద్ధం అయింది. చార్జీల పెంపు జాబితాను సిద్ధం చేసిన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదంతో ఈ నెలలోనే కొత్త చార్జీలను వడ్డించేందుకు విద్యుత్ శాఖ పరుగులు తీస్తోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, చతికిలబడ్డ విద్యుత్‌రంగ సంస్థల బలోపేతం, విద్యుత్ సంక్షోభానికి పరిష్కారం నినాదంతో ప్రజల నడ్డి విరిచే పనిలో పడింది. ఇప్పటికే ఓ మారు చార్జీల్ని వడ్డించింది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత బయలుదేరినా, చివరకు అది నీరుగారింది. అయినా, విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని ప్రకటిస్తూ, విద్యుత్ సంక్షోభం నుంచి పూర్తిగా గట్టెక్కే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నామన్న నినాదంతో మళ్లీ చార్జీల వడ్డనకు సిద్ధం అయింది. ప్రతి ఏటా రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ రంగ సంస్థల్లో లాభ నష్టాలను పరిశీలించడం సహజం. అయితే, ఈ ఏడాది రూ.39,818 కోట్ల మేరకు అదనపు భారం పడనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని చార్జీల మోతకు నిర్ణయించింది. చెన్నై, తిరునల్వేలి, ఈరోడ్ వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అన్ని చోట్ల ప్రజలందరూ మూకుమ్మడిగా చార్జీల వడ్డనను వ్యతిరేకించినా, ఈ అభిప్రాయ సేకరణ కేవలం లాంఛనమేనన్నది మరో మారు రుజువు అయింది. పెంచక తప్పదు: అభిప్రాయ సేకరణలతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, మేధావులు, ప్రజలు చార్జీల వడ్డనను తీవ్రంగానే వ్యతిరేకించారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో, పాల ధర మోత మోగించిన వేళ విద్యుత్ చార్జీల వడ్డన సరైన నిర్ణయం కాదని సూచించాయి. అయితే, వాటితో తమకేమి పని, తమ పని తమది అన్నట్టుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవహరించే పనిలో పడింది. ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి చార్జీల వడ్డనకు సిద్ధం అయింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతికి పంపింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ రాయితీ ఏమేరకు ఉంటుందో, దాన్ని బట్టి కొత్త చార్జీల్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వానికి పంపిన జాబితా మేరకు రెండు నెలలకుగాను వంద యూనిట్ల వరకు యూనిట్కోరూపాయి మేరకు పెరిగింది. ఇక, ఆపై యూనిట్లకు చార్జీల మోత మోగనుంది. అయితే, 500 యూనిట్లకు పైగా వినియోగించే వారికి ప్రభుత్వ రాయితీ వర్తించదు. ఈనెల నుంచి చార్జీల వడ్డన అమలు లక్ష్యంగా విద్యుత్ శాఖ కసరత్తుల్లో పడింది. రెండు నెలలకు గాను విద్యుత్ చార్జీల లెక్కింపు గత నెల పూర్తి అయింది. ఇక కొత్త లెక్కింపు డిసెంబరులో చేస్తారు. ఈ దృష్ట్యా, ఈ నెల నుంచి చార్జీల అమలు ద్వారా లెక్కల్లో తేడా ఉండదన్న నిర్ణయానికి అధికారులు రావడం గమనార్హం. చార్జీల పెంపు జాబితా: యూనిట్ పాత చార్జీ కొత్త చార్జీ ఇళ్లకు 0-100 2.00 3.00 0-200 2.80 3.25 200-500 4.00 4.60 500+ 5.75 6.60 దుకాణాలు: ఒక యూనిట్: 7.00 8.05 పరిశ్రమలు: ఒక యూనిట్ 5.50 7.22 తాత్కాలిక కనెక్షన్ 10.50 12.00 -
కరెంట్ షాక్
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏటా విద్యుత్ వినియోగంపై లాభనష్టాలను సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా 2014-15 నాటికి రూ.39,818 కోట్ల రాబడిని ఆశిస్తోంది. అయితే ప్రస్తుత చార్జీల తీరును బట్టి రూ.32,964 కోట్లు మాత్రమే లభించగలదని గుర్తించారు. అంటే రాబడిలో రూ.6,854 కోట్లను కోల్పోతున్నట్లు కమిషన్ అధికారులు గ్రహించారు. చార్జీలను సవరిస్తే రూ.6,805 కోట్లు లభించగలవని అంచనావేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏడాది విద్యుత్ రెవెన్యూ పరిస్థితిని సమీక్షించి మార్గాలను అన్వేషించే అధికారం ఉన్నందున చార్జీల పెంపునకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈలెక్కన పారిశ్రామిక వాడలకు యూనిట్ రూ.5.50 నుంచి రూ.7.22, ప్రభుత్వ పర్యవేక్షణలోని విద్యాసంస్థలకు యూనిట్ రూ.4.50 నుంచి రూ.7.22లు, ప్రైవేటు విద్యాసంస్థలకు రూ.5.50 నుంచి 7.22కు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.7.00 నుంచి రూ.8.05, తాత్కాలిక వినియోగానికి రూ.9.50 నుండి రూ.11గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గృహ వినియోగంపై (రెండునెలల బిల్లు) రూ.2.60 నుండి రూ.3.00, గుడిసెలకు రూ.1.00 నుంచి రూ.1.20గా పెంచనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగాన్ని బట్టి యూనిట్ చార్జీల్లో పెరుగుదల ఉంటుంది. పెంచక తప్పని పరిస్థితి : సీఎం జయ విద్యుత్ ఉత్పత్తిపై పెరిగిన ఆర్థిక భారం దృష్ట్యా చార్జీలను సవరించిక తప్పడం లేదని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో విద్యుత్ చార్జీలు పెంచబోతున్నట్లు సూత్రప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 2011లో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాజీలేని పోరాటం సాగిస్తోందన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అనేక చర్యలను చేపట్టిందని చెప్పారు. ఈ మూడేళ్లలో 2,783 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను సాధించామని, 500 మెగావాట్ల కొనుగోలు చేశామని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా మొత్తం మీద 4,079 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను పొందగలిగామని చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కోసం రూ.10,575 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికోసం వినియోగించే ముడిపదార్థాల ధరలు పెరుగుదల పెనుభారంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని తెలిపారు.