విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరాలోచించాలి
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ భారత దేశంలో కరెంటు కోత ల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో యూనిట్ కరెంటు ధర ప్రస్తుతం రూ.2.2లకే అందుబాటులో ఉందని, దక్షిణాదికి కరెంటు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దేశమంతా ఒకే గ్రిడ్-ఒకే ధర లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 2400 మెగావాట్ల ఉత్పత్తికి ప్లాంట్ల ప్రారంభంపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, కొత్త థర్మల్ ప్లాంట్ల వల్ల రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం పడుతుందని వివరించారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను బట్టి ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.