జపాన్‌లో భారీ భూకంపం | Earthquake of magnitude 7.0 hits Fukushima Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భారీ భూకంపం

Feb 14 2021 4:51 AM | Updated on Feb 14 2021 12:35 PM

Earthquake of magnitude 7.0 hits Fukushima Japan - Sakshi

హిరోనోమచి పట్టణంలో ఓ ఆఫీస్‌లో చిందరవందరగా పడిన ఫైల్స్‌

తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు.

టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్‌ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది.

ఫుకుషిమాలోని న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్‌ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement