massive earthquake
-
ములుగు కేంద్రంగా భారీ భూకంపం
-
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
మెక్సికోలో భారీ భూకంపం
-
భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ
భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి మృతుల సంఖ్య 724 కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. వందల్లో భవనాలు కుప్పకూలగా.. శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Viewer Discretion: First heart-stopping images of children, babies being rescued by caring Good Samaritans, stepping up to save their neighbor. 💔 #Haiti #earthquake pic.twitter.com/1pYiyZ6Bdx — Calvin Hughes (@CalvinWPLG) August 14, 2021 రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెలపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాకే .. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు. Self-organized community brigades in Okay, #Haiti continue to search for survivors in rubble in wake of 7.2 earthquake that struck the region earlier today. pic.twitter.com/i1M6nlUzr5 — HaitiInfoProj (@HaitiInfoProj) August 14, 2021 కాగా, 2010లో హైతీలో సంభవించిన భారీ భూకంపం కారణంగా.. మూడు లక్షల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజా భూకంప పరిణామాల నేపథ్యంలో అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, మరింత సమాచారం అందాల్సి ఉంది. My biggest concern is not just for the country but the safety and well being of my momma and papa. Please keep Aiyti in your thoughts and prayers during these times 🇭🇹❤️💙 #Haiti #Tsunami #Ayiti pic.twitter.com/BCTweHve1h — Hustling & Healing (@HustlinNHealin) August 14, 2021 -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి. -
భారీ భూకంపం
మాముజు: భారీ భూకంపం ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తు న్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు. జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు. -
ఇండోనేషియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపంలో కనీసం 34 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. 600 వందల మంది పైగా గాయపడ్డారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురై.. తమ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మాముజు నగరంలో ఆస్పత్రి భవనం కూలిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో.. -
టర్కీలో భారీ భూకంపం
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. -
సజీవ సమాధుల్లోంచి చిన్నారుల ఘోష
బెర్లిన్: సుమారు 90 వేలకు పైగా పౌరులు. వారిలో 7 వేల మంది స్కూల్ చిన్నారులు. భారీ భూకంపం దాటికి సజీవ సమాధి అయ్యారు. అయితే నాణ్యత లేమి కారణంగానే స్కూల్ భవనాల కారణంగా ఆరోపణలు. పదేళ్లైనా మృతుల జాబితాను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు? మరోవైపు తమ పిల్లలు బతికే ఉన్నారా? అన్న ఆశలో తల్లిదండ్రులు. వెరసి దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో... చైనాలోని సిచువాన్ ప్రొవిన్స్‌లో మే12, 2008న రిక్చర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనాల దాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. 70 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా పోయారు. పెద్ద సంఖ్యలో స్కూల్ భవనాలు కుప్పకూలిపోవటంతో సుమారు 7 వేల మంది చిన్నారులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శరీరాలు భవనాల కిందే ఛిద్రం అయిపోగా తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు అని సామాజిక వేత్త ‘అయి వెయివెయి’ చెబుతున్నారు. భూకంపం తర్వాత సహయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. నాటి పరిస్థితిపై ఓ నివేదిక రూపొందించారు. వెయివెయి నివేదిక ప్రకారం... ‘కనీస ప్రామాణికాలు లేకుండా భవనాలను నిర్మించారు. ఫలితం 7 వేల మంది చిన్నారులు బలయ్యారు. భద్రత ప్రమాణాలు లేని స్కూళ్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఆ మరుసటి ఏడాది సంభవించిన భూకంపాల్లో మరో 5 వేల మంది విద్యార్థులు చనిపోయారని ప్రభుత్వం అంటోంది. మరి మృతుల పేర్ల జాబితాను పదేళ్లు గడిచినా ఎందుకు విడుదల చేయలేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావట్లేదు. చారిత్రక ఘటనకు సంబంధించిన నిజాలను ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం బయటకు రానీవ్వట్లేదు. పోరాటంలో తల్లిదండ్రులు అలసిపోయారు. విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో నాపై పోలీసులు దాడి చేశారు. నా ప్రాణాలు పోయినా చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆపను’ అని వెయివెయి చెబుతున్నారు. పోలీసుల దాడిలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో వెయివెయికి జర్మనీలో శస్త్రచికిత్స జరగ్గా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. భూకంపం జరిగి పదేళ్లు పూర్తి కావటంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. భారీ కుంభ కోణం... కాగా, నాటి భూకంపం దాటికి 6.5 మిలియన్ భవనాలు కప్పకూలిపోయాయి. మరో 23 మిలియన్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా భూకంపం అధికారిక విభాగం, జియాలజిస్టులు నాణ్యత లేని భవనాల మూలంగానే పెను నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొందరు ఇంజనీర్లు భవన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలుస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో భారీ కుంభకోణం చైనా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే అవినీతి ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. భారీ భూకంపం జోన్లో ఆయా భవనాలు ఉండటంతోనే కుప్పకూలిపోయానని నివేదికను వక్రీకరించింది. కానీ, సామాజిక వేత్త వెయి వెయి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం స్వతంత్ర్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ తర్వాత అంశాన్ని పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో వెయివెయి పోరాటాన్ని ఉదృతం చేయగా.. ఆయనపై దాడి చోటు చేసుకుంది. -
అర్ధరాత్రి భారీ భూకంపం
జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. రిక్చర్ స్కేల్ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్, తసిక్‌మలయా, కియామిస్, బంజర్, గౌరత్, కెబుమెన్, బన్యుమస్ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జావాకు పశ్చిమాన ఉన్న తసిక్‌మాల్యాకు నైరుతి ప్రాంతంలో భూమికి 92 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు నిమిషానికి పైగా భూమి కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం దాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చేశాయ్. అలల తీవ్రతతో తీర ప్రాంత ఇళ్లలోకి నీళ్లు రావటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి.. కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. ఘటనలో 40 ఇళ్లులు కుప్పకూలిపోగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. కుప్పకూలిన ఇంటిలో సహాయక చర్యల్లో భద్రతా సిబ్బంది భూకంపం అనంతరం బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు -
జపాన్‌లో భారీ భూకంపం.
-
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం
మనీలా: ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మరణించగా 90 మందికి పైగా గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం సురిగావ్ డెల్ నోర్టె ప్రావిన్సు రాజధానికి వాయవ్యంలో 14 కి.మీ దూరంలో, 11 కి.మీ.ల లోతులో కేంద్రీకృతమైంది. ఆ సమయంలో నిద్రిస్తున్న ప్రజలు భూకంపం ధాటికి ఇళ్లు వదిలి పరుగులుపెట్టారు. శిథిలాలు, ఇతర వస్తువులు మీద పడటంతో సురిగావ్ పట్టణంలో కనీసం 15 మంది చనిపోయి ఉంటారని ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ ప్రావిన్స్ విపత్తు నిర్వహణ అధికారి ఒకరు వెల్లడించారు. -
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
-
భారీ భూకంపం.. ముంచెత్తిన సునామి
టోక్యో: తూర్పుఆసియాలోని ద్వీపదేశం జపాన్ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపానికి కొనసాగింపుగా సునామీ చెలరేగడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:38కి జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున్న రాకాసి అలలు ఎగిసి ప్రఖ్యాత పుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. పుకుషిమా నగరానికి 37 కిలోమీటర్ల దూరంలో 11.4 కిలోమీటర్ల లోతులో(ఫసిపిక్ సముద్రంలో) భూకంపకేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను జారీచేసిన ప్రభుత్వం.. అణుశక్తి కేంద్రంతోపాటు ఈశాన్య తీరంలోని గ్రామాలను త్వరితగతిన ఖాళీచేయించ ప్రయత్నం చేసింది. దేశ రాజధాని టోక్యోలో సైతం భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. నేటి సునామీతో నీటమునిగిన పుకుషిమా అణుశక్తి కేంద్రం.. 2011లోనూ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి భూకంప విలయంలో 20 వేలమందికిపైగా మరణించారు. అణుకేంద్రాన్ని పునరుద్ధరించడానికి ఏళ్లు పట్టింది. కాగా, మంగళవారంనాటి భూకంపం, సునామీల కారణంగా ఎంత మంది చనిపోయారు, ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సిఉంది. -
9.0 తీవ్రతతో భూకంపం రావొచ్చు!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో భారీ భూకంపానికి అవకాశం ఉందని, దీని ప్రభావం తూర్పు భారతంలోని పట్టణ ప్రాంతాలపై ఉంటుందని అధ్యయనంలో తేలింది. గంగ, బ్రహ్మపుత్ర నదుల పరిధిలో భూమి లోపలి రెండు ఫలకాలపై ఒత్తిడి పెరిగిపోవడమే దీనికి కారణమట. భూకంపం వస్తే తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 కన్నా ఎక్కువగా ఉండొచ్చని, 9.0కీ చేరొచ్చని.. 14 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని కొలంబియా యూనివర్సిటీకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త మైఖెల్ స్టెక్లర్ తెలిపారు. భూమి కంపించడం వల్లే ఇంతమందిపై ప్రభావం పడుతుందని, సునామీలు వస్తే మరింత మందిపై ప్రభావం పడే అవకాశముందన్నారు. సముద్రంలో భూకంపనాలు సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు నేచుర్ జియోసైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ 2,30,000 మందిని బలితీసుకుంది. 2011లో జపాన్ లో వచ్చిన విలయంతో 20 వేల మందిపైగా మృతి చెందారు. గతేడాది నేపాల్ లో భూకంపం సంభవించడంతో 9 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
పాక్‌లో భారీ భూకంపం
♦ 89 మందికి గాయాలు ♦ భారత్‌లోనూ ప్రకంపనలు ♦ కశ్మీర్లో ఒకరి మృతి ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: హిందూకుష్ పర్వతాల్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి పాకి స్తాన్‌లో 89 మంది గాయపడ్డారు. ఒక్క పెషావర్‌లోనే 59 మందికి గాయాలయ్యారు. భారత్, తజికిస్తాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో ఒకరు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కాబూల్‌కు 280 కి.మీ. దూరంలోని భూమికి 203 కి.మీ దిగువన నమోదైంది. కాబూల్, ఇస్లామాబాద్ తదితర చోట్ల భూకంప ప్రభావం కనిపించింది. హరియాణా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. కశ్మీర్‌లోని మెంధార్‌లో భూకంపంలో ఒకరు మృతిచెందారు. జరీద్ అహ్మద్ అనే యువకుడు కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు తీసుకొస్తూ కుప్పకూలి చనిపోయాడు. -
280కి చేరిన భూకంప మృతుల సంఖ్య
అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 280 మంది ప్రాణాలను బలిగొంది. వారిలో 12 మంది అఫ్ఘాన్ విద్యార్థినులు కూడా ఉన్నారు. స్కూలు భవనం కూలిపోతుండటంతో అంతా ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో వారు మరణించారు. 8 మంది పిల్లలతో సహా 214 మంది పాకిస్థాన్‌లో మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఉత్తర భారతంపై కూడా భూకంపం ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈశాన్య అఫ్ఘానిస్థాన్‌లో దేశ రాజధాని కాబూల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది భూమికి 213.5 కిలోమీటర్ల లోతున ఉందని అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. 200 అక్టోబర్‌లో కూడా ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా అప్పట్లో దాదాపు 75 వేల మంది మరణించారు. 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జరిగిన దారుణం గురించి తాను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో మాట్లాడి, సానుభూతి తెలియజేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రాథమికంగా లభించిన నష్టం అంచనాలను ఆయన వివరించారని, వీలైనంత సాయం చేస్తామని తాను హామీ ఇచ్చానని ఆయన తెలిపారు. అఫ్ఘాన్, పాకిస్థాన్ దేశాలు రెండింటికీ తమ సాయం అందిస్తామన్నారు. అఫ్ఘాన్‌లో సుమారు 63 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోను, ఫతా ప్రాంతంలోను దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల్లో మరికొంతమంది మరణించారు. -
ఉత్తర భారతానికి పెను భూకంప ముప్పు!
అంతర్జాతీయ శాస్త్రవేత్తల హెచ్చరిక లాస్ఏంజెలిస్: ఉత్తర భారతంతోపాటు పశ్చిమ నేపాల్‌కు భవిష్యత్తులో మరో పెను భూకంప ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపంలో భూమి పొరలో లోపం(ఫాల్ట్) వద్ద కొంత శక్తి మాత్రమే విడుదలైందని, ఆ ఫాల్ట్ వద్ద ప్రస్తుతం ఇంకా చాలా ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. జీపీఎస్ కేంద్రాలు, కఠ్మాండులో నేల కదలికలను పసిగట్టే యాక్సిలరోమీటర్ రాడార్ చిత్రాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని అమెరికాలోని కాల్టెక్, వర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తెలిపారు. నేపాల్‌లో రిక్టర్‌స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంలో 9 వేల మంది మరణించడం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసిన వీరు.. పశ్చిమ నేపాల్‌తో పాటు ఉత్తర భారత్‌లో అనేక చోట్ల జనసమ్మర్ద ప్రాంతాలున్నాయని, గంగా మైదానంలో భూకంపమొస్తే పెను విలయం తప్పదని అన్నారు. యురేసియా భూఫలకంతో ఇండియన్ ప్లేట్ కలిసే చోట ఉన్న హిమాలయన్ ఫాల్ట్ లైన్ వద్దే ఇటీవలి భూకంపం సంభవించిందన్నారు. ఈ ఫాల్ట్ భాగం లాక్ అయిపోయిందని, భవిష్యత్తులో రెండు ప్లేట్ల మధ్య ఒత్తిడి వల్ల సర్దుబాటు జరిగి ఇంతకంటే పెను భూకంపానికి దారి తీయవచ్చన్నారు. -
‘ఆపరేషన్ మైత్రి’ ముమ్మరం
నేపాల్‌లో భారీస్థాయిలో భారత్ సహాయక చర్యలు న్యూఢిల్లీ: భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకోవడానికి ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో చేపట్టిన సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరం చేసింది. ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు. ఢిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. సహాయచర్యల సమన్వయానికి హోం శాఖ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించనుందన్నారు. నేపాల్ నుంచి శనివారం 546, ఆదివారం 504 మందిని భారత్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ప్రమాద ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఇతర దేశస్తులను కూడా మన బృందాలు రక్షిస్తున్నాయన్నారు. భూకంపం తర్వాత వచ్చే చిన్న ప్రకంపనల వల్ల కఠ్మాండు ఎయిర్‌పోర్టును చాలా సేపు మూసివేయడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని చెప్పారు. పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు కఠ్మాండుకు పంపినట్లు వెల్లడించారు. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించామన్నారు. నేపాల్‌లో వర్షాలతో పాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, భారీగా హిమపాతానికి ఆస్కారం ఉందని ఐఎండీ డీజీ ఎల్ఎస్ రాథోర్ తెలిపారు. భూ అంతర్భాగంలోని ప్లేట్ల సర్దుబాట్ల వల్ల మరికొన్ని వారాలు, నెలలు లేదా ఏళ్ల పాటు భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం ప్రధాన భూకంపం అనంతరం 46 ఆఫ్టర్‌షాక్స్ వచ్చాయని తెలిపారు. వీటిలో చాలామటుకు రిక్టర్ స్కేల్‌పై 4 నుంచి 6గా నమోదయ్యాయని, వాటిల్లో ఒకటి 6.9గా, మరోటి 6.6గా స్కేల్‌పై నమోదైందని తెలిపారు. -
అమెరికాలో భారీ భూకంపం
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆదివారం రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున వచ్చిన ఈ భూకంప కేంద్రం అమెరికన్ కాన్యోన్లో భూమికి 10.8 కి.మీ దిగువన నమోదైంది. నార్తర్న్ బే ఏరియాలో ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ 70 మంది గాయపడ్డారు. పలు భవనాలు కూలిపోయాయి. కొన్నిచోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో, డేవిస్లలో భూకంప ప్రభావం కనిపించింది. మరోపక్క.. ఐస్‌ల్యాండ్‌లోని బర్దార్బుంగ అగ్నిపర్వతం కింద రెండు భూకంపాలు వచ్చాయి. -
చైనాలో భారీ భూకంపం
175 మంది మృతి; 1,400 మందికి గాయాలు బీజింగ్: చైనాలో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రతతో నైరుతి చైనాలోని యునాన్ రాష్ట్రాన్ని కుదిపేసింది. లూడియన్ కౌంటీలో జూవోతాంగ్ నగరానికి 23 కి.మీ.ల దూరంలోని లాంగ్తౌషన్ పట్టణం కేంద్రంగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు(బీజింగ్ కాలమానం) సంభవించిన ఈ భారీ భూకంపంలో 175 మంది మరణించగా, దాదాపు 1,400 మంది గాయపడ్డారు. 181 మంది జాడ తెలియడం లేదు. భూకంప తీవ్రతకు 12 వేల గృహాలు కుప్పకూలిపోగా, 30 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికం, రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. భూకంపం ధాటికి క్వివోజియా కౌంటీలో 30 మంది మరణించారు. లాంగ్తౌషన్ సహా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లాంగ్తౌషన్కు వెళ్లే మార్గంలో కొండచరియ విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగి, సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. మరోవైపు జూవోతాంగ్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలు సహాయక చర్యలను ఆటంకపరిచే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూవోతాంగ్ నగరం భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో ఉంది. ఇక్కడే రిక్టర్ స్కేల్‌పై 7.1 పాయింట్ల తీవ్రతతో 1974లో సంభవించిన భూకంపంలో 1,400 మంది చనిపోగా, 2012లో వచ్చిన మరో భూకంపంలో 80 మంది మరణించారు. కాగా, భారత్, నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్ ప్రాంతంలోనూ ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. -
భూకంపం @ బీచువాన్...
2008, మే 12న చైనాలో భారీ భూకంపం వచ్చింది. బీచువాన్ పట్టణం గడగడలాడిపోయింది. దాదాపు 9 వేల మంది చనిపోయారు.. 80 శాతం భవనాలు నేలకూలాయి.. కొన్ని బాగా దెబ్బతిన్నాయి.. ఆరేళ్లు గడిచిపోయాయి. మీరిప్పుడు బీచువాన్‌కు వెళ్లిచూడండి.. కొన్ని నిమిషాల ముందే అక్కడ భూకంపం వచ్చిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం టైం మెషీన్ ఎక్కి.. 2008, మే 12వ తేదీకి వెళ్లిపోయిన ట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. నాటి భూకంపం అనంతరం భవనాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయి.. కాదు.. కాదు.. వాటిని అలాగే ఉంచేశారు. బీచువాన్ను అతి పెద్ద స్మారక ప్రదేశంగా మార్చేశారు. వేలాడుతున్న భవనాలు కింద పడి.. సందర్శకులకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు సపోర్ట్ ఏర్పాటు చేశారు.. కూలిపోయిన భవనాలు.. వాటి కింద చిక్కుకున్న వాహనాలు ఇప్పటికీ అన్నీ అలాగే ఉన్నాయి.. అప్పట్లో భూకంపం వచ్చిన తర్వాత చాలా వరకూ భవనాలు కూలిపోవడం.. ఊరంతా రాళ్లు, రప్పలతో నిండిపోవడంతో ఈ పట్టణాన్ని పున ర్నిర్మించడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయానికొచ్చారు. దీంతో వాటిని అలాగే ఉంచేసి.. బహిరంగ ప్రదేశంలో ఉన్న అతి పెద్ద స్మారక ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడుండేవారంతా బీచువాన్‌కు 12 మైళ్ల దూరంలో నిర్మించిన కొత్త పట్టణానికి వలస పోయారు.