మనీలా: ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మరణించగా 90 మందికి పైగా గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం సురిగావ్ డెల్ నోర్టె ప్రావిన్సు రాజధానికి వాయవ్యంలో 14 కి.మీ దూరంలో, 11 కి.మీ.ల లోతులో కేంద్రీకృతమైంది.
ఆ సమయంలో నిద్రిస్తున్న ప్రజలు భూకంపం ధాటికి ఇళ్లు వదిలి పరుగులుపెట్టారు. శిథిలాలు, ఇతర వస్తువులు మీద పడటంతో సురిగావ్ పట్టణంలో కనీసం 15 మంది చనిపోయి ఉంటారని ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ ప్రావిన్స్ విపత్తు నిర్వహణ అధికారి ఒకరు వెల్లడించారు.