పాక్‌లో భారీ భూకంపం
♦ 89 మందికి గాయాలు
♦ భారత్‌లోనూ ప్రకంపనలు
♦ కశ్మీర్‌లో ఒకరి మృతి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: హిందూకుష్ పర్వతాల్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి పాకి స్తాన్‌లో 89 మంది గాయపడ్డారు. ఒక్క పెషావర్‌లోనే 59 మందికి గాయాలయ్యారు. భారత్, తజికిస్తాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో ఒకరు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కాబూల్‌కు 280 కి.మీ. దూరంలోని భూమికి 203 కి.మీ దిగువన నమోదైంది. కాబూల్, ఇస్లామాబాద్ తదితర చోట్ల భూకంప ప్రభావం కనిపించింది.
హరియాణా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. కశ్మీర్‌లోని మెంధార్‌లో భూకంపంలో ఒకరు మృతిచెందారు. జరీద్ అహ్మద్ అనే యువకుడు కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు తీసుకొస్తూ కుప్పకూలి చనిపోయాడు.