జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపంలో కనీసం 34 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. 600 వందల మంది పైగా గాయపడ్డారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురై.. తమ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
మాముజు నగరంలో ఆస్పత్రి భవనం కూలిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..
Comments
Please login to add a commentAdd a comment