Sulawesi island
-
ఇండోనేసియా చర్చి వద్ద ఆత్మాహుతి దాడి
మకస్సర్: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఆదివారం ఓ చర్చి వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. దక్షిణ సులవేసి ప్రావిన్సు రాజధాని మకస్సర్‌లోని సాక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ కెథెడ్రల్లోకి ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి లోపలికి ప్రవేశించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. సిబ్బందితో వారు వాదులాటకు దిగారు. అదే సమయంలో, అగంతకుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే తునాతునకలయ్యారు. నలుగురు భద్రతా సిబ్బందితోపాటు చర్చిలో పామ్ సండే సామూహిక ప్రార్థనలు ముగించుకుని వస్తున్న భక్తులు గాయాలపాలయ్యారు. అగంతకుల్లో ఒకరు మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారులెవరో తెలియాల్సి ఉంది. ఇండోనేసియా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వాటికన్ సెయింట్ పీటర్స్ బసిలికాలో పామ్ సండే ప్రార్థనల సందర్భంగా బాధితుల కోసం ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!) -
భారీ భూకంపం
మాముజు: భారీ భూకంపం ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తు న్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు. జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు. -
ఇండోనేషియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపంలో కనీసం 34 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. 600 వందల మంది పైగా గాయపడ్డారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురై.. తమ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మాముజు నగరంలో ఆస్పత్రి భవనం కూలిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో.. -
ఇండోనేషియాలో భూకంపం
సులవేసి ద్వీపకల్పంలో ఈ రోజుల తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.7గా నమోదు అయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వాయువ్వ గొరొన్టలో నగరంలో మంగళవారం తెల్లవారుజామున 3.11 నిమిషాలకు ఆ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదని పేర్కొంది. ఇండోనేషియాలో్ ఇటీవల తరుచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో అచీ ప్రావెన్స్లో సంభవించిన భూకంపం వల్ల 35 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.