
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరెంట్ కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటల పాటు కరెంట్ లేక కరోనా పేషెంట్లు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ వెంటనే జనరేటర్ పంపాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక కోవిడ్ ఆస్పత్రుల్లో జనరేటర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. అంతేకాక కోవిడ్ ఆస్పత్రుల్లో జనరేటర్ల పనితీరును పరీక్షించాలని అవసరమైన చోట అదనపు జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. (జ్వరం వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు : ఈటల)