దిగువ జూరాల పవర్‌హౌజ్ కేంద్రం
మండల పరిధిలోని మూలమళ్ల, జూరాల గ్రామాల శివారులోని దిగువ జూరాలలో 3, 4వ యూనిట్ల ద్వారా గురువారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ యూనిట్లకు ఉదయం 10:15నుంచి మధ్యాహ్నం 1:15వరకు సీఓడీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జెన్‌కో చీఫ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో, డిస్కం, కమర్షియల్ శాఖల అధికారులు ఏకధాటిగా మూడు గంటలపాటు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు.
– 3, 4యూనిట్లలో సీఓడీ పరీక్షలు విజయవంతం
– మొత్తం 4యూనిట్ల ద్వారా 160మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం
ఆత్మకూర్ : మండల పరిధిలోని మూలమళ్ల, జూరాల గ్రామాల శివారులోని దిగువ జూరాలలో 3, 4వ యూనిట్ల ద్వారా గురువారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ యూనిట్లకు ఉదయం 10:15నుంచి మధ్యాహ్నం 1:15వరకు సీఓడీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జెన్‌కో చీఫ్ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో, డిస్కం, కమర్షియల్ శాఖల అధికారులు ఏకధాటిగా మూడు గంటలపాటు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్‌జెన్‌కో డైరెక్టర్ కేఆర్‌కే రెడ్డి మాట్లాడుతూ దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్‌ల ద్వారా ఇదివరకే ఒక్కో యూనిట్ ద్వారా 90లక్షలకుపైగా యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామని తెలిపారు. వారంరోజుల్లో 5వ యూనిట్‌కు బేరింగ్‌రన్, షార్ట్ సర్యూ్కట్ టెస్ట్, బాపన్ సర్యూ్కట్ టెస్ట్, 72గంటలపాటు నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేపట్టిన అనంతరం కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తం తెలంగాణ సొంతమని అన్నారు. రాష్ట్రానికి తొలికానుకగా భావిస్తున్నామని చెప్పారు. ఈవిషయమై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావ్ అభినందనలు తెలిపారని అన్నారు.
జెన్ కోకు ఆదాయం ప్రారంభం
వారంక్రితం ఒకటి, రెండో యూనిట్ ద్వారా చేపడుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా రెవెన్యూ ప్రారంభమైందని ఇక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయాశాఖల అధికారులు సంతకాలు పెట్టారని చెప్పారు. ఒక్కయూనిట్ ద్వారా 40మెగావాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామని, ఒకరోజు విద్యుత్ ఉత్పత్తి చేపడితే సుమారు రూ.40లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తయారయ్యే విద్యుత్ పూర్తిగా తెలంగాణకే సొంతమన్నారు. తమసిబ్బంది కృషి ఫలితంగానే విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టామని అన్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జెన్‌కో చీఫ్ ఇంజనీర్‌లు టీఎస్‌ఎన్ మూర్తి, ఆనందం, సీజీఎన్ మధుసూదన్, ఎస్‌ఈలు సురేష్, ఆంజనేయులు, శ్రీనివాస్, శ్రీధర్, ఈఈలు పవన్‌కుమార్, రామక్రిష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, థర్మల్ డీఈ శ్రీనివాస్, సురేష్‌బాబు ఉన్నారు.