పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం | parigi MLA rammohan reddy abuses lineman | Sakshi
Sakshi News home page

పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం

Published Thu, Mar 2 2017 12:00 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం - Sakshi

పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం

వికారాబాద్‌ : తన నివాసంలో కరెంట్‌ సరఫరా నిలిపివేయడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. బిల్లు కట్టకపోవడంతో ఆయన ఇంటికి లైన్‌మెన్‌ గతరాత్రి విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు. సుమారు రూ.50వేలు బకాయిలు ఉండటంతో కరెంట్‌ కట్‌ చేయాలని విద్యుత్‌ అధికారులు ఆదేశాలతో లైన్‌మెన్‌ సరఫరా ఆపివేశాడు. దీంతో లైన్‌మెన్‌తో ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ఫోన్‌లో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే... లైన్‌మెన్‌ను తీవ్రంగా దూషించారు. ఎమ్మెల్యే ఇంటికే కరెంట్ కట్ చేస్తావా? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

నువ్వెంత? నీ బతుకెంత? అంటూ విరుచుకుపడ్డారు.  లైన్‌మెన్‌తో ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌ సంభాషణలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే పీఏ అశోక్‌ రెడ్డి తనపై చేయి చేసుకున్నట్లు లైన్‌మెన్‌ ఆరోపించాడు. ఈ మేరకు ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement