Lineman
-
పెట్రోల్ పోయవా? అయితే కరెంట్ కట్
లక్నో: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలను నివారించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఒక నిబంధన రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను పెట్రోల్‌బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన ఘటన హాపూర్ జిల్లా లోని పార్థాపూర్ రోడ్డులో జరిగింది. హెల్మెట్ ధరి స్తేనే ద్విచక్రవాహనదారులకు పె ట్రోల్‌ను విక్రయించాలనే నిబంధనను అమలుచేయాలని యూపీ సర్కార్ ఆదేశించింది. దీంతో పార్థాపూర్ రోడ్డులోని ఒక పెట్రోల్‌బంక్ సైతం ఇదే నియమాన్ని పాటిస్తోంది. మంగళవారం ఈ పెట్రోల్‌బంక్‌కు వచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ పెట్రోల్ అడగ్గా బంక్ సిబ్బంది నిరాకరించారు. హెల్మెట్ ధరించి వస్తేనే బైక్‌కు పెట్రోల్ కొడతామని కరాఖండీగా చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లైన్మెన్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి బంక్‌కు విద్యుత్‌సరఫరా అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఉన్న కరెంట్‌స్తంభం ఎక్కి వైర్‌ను కత్తిరించాడు. దీంతో బంక్‌లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంధన వినియోగదారుల చాంతడంత క్యూలైన్ ఏర్పడింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే లైన్మెన్ కరెంట్ లైన్‌ను కత్తిరించిన విషయం అక్కడి సీసీటీవీలో రికార్డ్‌కావడంతో అది లైన్మెన్ పని అని తర్వాత తెలిసింది. వెంటనే స్థానికులు ఫిర్యాదుచేయడంతో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. జనాల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూద్దాం.సహాయ పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అదిత్ అరుణ్.. ఆ తర్వాత హీరోగా మారాడు. 24 కిస్సెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, ప్రేమదేశం తదితర చిత్రాలు చేశారు. కాకపోతే హిట్స్ లేకపోవడం వల్ల పెద్దగా ఫేమ్ సంపాదించలేకపోయాడు. 'లైన్ మ్యాన్' అనే సినిమాతో గతనెలలో కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన 'లైన్ మ్యాన్' సినిమా తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైంది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ప్రముఖ ఓటీటీల్లో కాకుండా లోకల్ కన్నడ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఊరంతా కలిసి కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉండాలని ఫిక్సవుతారు. అయితే దీనికి కారణమేంటి? ఏ మంచి పనికోసం అందరూ కరెంట్ లేకపోయినా పర్లేదు అని ఒప్పుకొన్నారు అనే కథాంశంతో 'లైన్ మ్యాన్' తీశారు. -
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్‌మ్యాన్
-
లైన్మెన్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసు: ముగ్గురు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఒప్పందం చేసుకొని పలువురి అభ్యర్థుల నుంచి నిందితులు అడ్వాన్సుగా రూ. లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. సరైన సమయానికి సమాధానాలు పంపించలేకపోవటంతో అభ్యర్థులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. బయటపడిందిలా.. ఈనెల 17న జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరిగింది. ముందుగానే విద్యుత్‌శాఖలోని పలువురు ఉద్యోగులు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తామనేది వాళ్ల ఒప్పందం. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్షా హాల్‌కు సెల్‌ఫోన్‌ను తీసుకెళతారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మెసేజ్ రూపంలో అభ్యర్థులకు సమాధానాలు వస్తాయి. మొదటి ఆన్సర్ ఏ అయితే 1 అని, బీ అయితే 2 అని అంకెల రూపంలో సమాధానాలు పంపిస్తారు. అయితే నిందితులు ఎక్కువ మంది అభ్యర్థులతో ఒప్పందం చేసుకోవటంతో ఒకేసారి అందరికీ సమాధానాలు పంపించలేకపోయారు. దీంతో బయటికి వచి్చన తర్వాత పలువురు అభ్యర్థులు మోసపోయామని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేటలో ముగ్గురి అరెస్ట్.. అంబర్‌పేట పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. డిటెక్టెవ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కథనం ప్రకారం... కాడ్తాల్కు చెందిన లోక్యా నాయక్ జూనియర్ లైన్మెన్ పరీక్ష కోసం సిద్దపడ్డాడు. ఇతనికి నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అభ్యర్థి దశరథ్‌తో పరిచయం ఉంది. డబ్బులు ఖర్చుపెడితే పరీక్షలో పాస్ అయ్యే మార్గం ఉందని దశరథ్ లోక్యానాయక్‌తో చెప్పాడు. దీనికి లోక్యా నాయక్ అంగీకరించాడు. దీంతో కర్మన్‌ఘాట్‌లో నివిసించే లైన్మెన్ శ్రీనివాస్ (42)ను సంప్రదించారు. వీరంత కలిసి అంబర్‌పేటలో నివసించే మలక్‌పేట ఏడీఈ ఫిరోజ్‌ఖాన్(46)ను సంప్రదించారు. రూ.లక్ష ఇస్తే పరీక్షలో పాస్ అయ్యేలా చూస్తానని లోక్యానాయక్ వద్ద డబ్బులు తీసుకున్నారు. కాగా జూనియర్ లైన్ పరీక్షకు లోక్యానాయక్ హజరయ్యాడు. బయటకు వచ్చి మీరు నాకు ఏలాంటి సహాయం చేయలేదని, తిరిగి నా డబ్బులు ఇవ్వాలని కోరాడు. నీవు పరీక్షా సమయంలో మద్యలో ఎందుకు వచ్చావు... పూర్తి సమయంలో పరీక్షా కేంద్రంలో ఉంటే నీకు జవాబులు అందించే వాళ్లమని అతనికి చెప్పాడు. దీంతో లోక్యా నాయక్ విసుగుచెంది శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరు.. ప్రశ్నాపత్రం లీక్ విషయమై ఘట్కేసర్ పీఎస్‌లో కేసు నమోదయింది. ఘట్కేసర్లో నివాసం ఉండే కోదాడ ఈఏ సైదులును అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండలం, ఘనాపూర్ గ్రాలంలోని కేపీఆర్‌ఐటీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షా హాల్లో అభ్యర్థి సీహెచ్ శివప్రసాద్‌ను తనిఖీ చేయగా లోదుస్తుల్లో సెల్ ఫోన్ లభించింది. వెంటనే పరీక్షా నిర్వాహకులు సీఐ చంద్రబాబుకు సమాచారమివ్వగా, అభ్యరి్థని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి, నిజమేనని తేలడంతో కేసు నమోదు చేశారు. అలాగే సుల్తాన్ బజార్లో కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లి మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు చేరవేసుకున్నట్లు తెలిసింది. (చదవండి: టీఎంసీ మంత్రి సన్నిహితుల ఇంట్లో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు) -
పోలీసుకు తన ‘పవర్’ చూపాడు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కే పవర్ కట్
లక్నో: అధికారం ఉంది కదా అని ఎవరితోనైనా ఆటాడుకోవచ్చనుకుంటే ఏమవుతుంది.. ఒక్కోసారి అదే అధికారం రివర్స్ దాడి చేస్తుంది! ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇటీవల భగవాన్ స్వరూప్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మోదీసింగ్ అనే పోలీసు అధికారి అతన్ని ఆపాడు. బండి కాగితాలు చూపాలని అడిగాడు. అయితే అత్యవసర పని మీద వెళ్తున్నందున కాగితాలు వెంట తెచ్చుకోవడం మరచిపోయానని స్వరూప్ బదులిచ్చాడు. కావాలంటే ఇంటికి వెళ్లి కాగితాలు తీసుకొచ్చి చూపుతానని బతిమిలాడాడు. కానీ ఆపింది పోలీసు కదా.. అదేం కుదరదని తేల్చిచెప్పాడు. రూ. 500 జరిమానా కట్టాలంటూ చలాన్ వేశాడు. మోదీసింగ్ చర్యతో స్వరూప్ రగిలిపోయాడు. అసలే ‘కరెంటోడు’ కావడంతో పోలీ'సులకు తన స్టయిల్లో గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఇంకేముంది.. తన సహచర విద్యుత్ సిబ్బందితో కలసి వెళ్లి మోదీసింగ్ పనిచేసే హర్దాస్పూర్ పోలీసుస్టేషన్‌కు పవర్ కట్ చేసి పారేశాడు! ఎందుకిలా చేశావని.. మీడియా ప్రతినిధులు అడిగితే పోలీసుస్టేషన్ సిబ్బంది విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని... అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేశానని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండో రోజు విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు -
గతంలో పట్టు జారితే ప్రాణాలకే ముప్పు.. కానీ ఇప్పుడా భయం లేదు
సాక్షి, కోదాడ: ఒకప్పుడు విద్యుత్ హెల్పర్లు, లైన్మన్లు, కార్మికులు స్తంభం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. కానీ ఇప్పుడు క్లైంబింగ్ షూతో సులువుగా ఎలాంటి భయం లేకుండా విద్యుత్ స్తంభం ఎక్కేస్తున్నారు. పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై విద్యుత్ తీగలు గజిబిజిగా ఉంటాయి. గంటల తరబడి స్తంభాలపై కనెక్షన్లు వెతుక్కోవలసి వస్తుండటంతో శరీరం బరువు కాళ్లు, చేతులపై పడుతోంది. ఆ సమయంలో లైన్మన్లు, హెల్పర్లు, కార్మికులు పట్టు కోల్పోయి జారిపడే ప్రమాదం ఉంది. క్లైంబింగ్ షూతో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడింది. క్లైంబింగ్ షూతో స్తంభంపై ఎక్కడ అంటే అక్కడ తాపీగా నిలబడుతున్నారు. దీంతో రాత్రివేళ కూడా సులువుగా స్తంభాలు ఎక్కి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి క్లైంబింగ్ షూకి రూపకల్పన చేసి ఉపయోగించిన వీడియో యూట్యూబ్, వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనిని చూసి తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ శాఖల హెల్పర్లు, లైన్మన్లు విరివిగా దీని వాడకం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో కేవలం రూ.300 నుంచి రూ.450 ఖర్చుతో క్లైంబింగ్ షూ తయారు చేసుకోవచ్చు. -
ఆర్థిక లావాదేవీల వల్లే లైన్‌మన్ బంగార్రాజు హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి లైన్‌మన్ మొల్లి బంగార్రాజు (45) హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని డీసీపీ–1 గౌతమి సాలి చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఆమె వెల్లడించారు. డీసీపీ–1 తెలిపిన మేరకు.. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బంగార్రాజు మధ్యవర్తిగా రూ.30 లక్షల వరకు వసూలు చేసి కోరాడ గోవిందరావుకు ఇచ్చాడు. రెండేళ్లవుతున్నా ఉద్యోగాలు రాకపోయేసరికి నిరుద్యోగులు నిలదీస్తుండటంతో బంగార్రాజు.. గోవిందరావుపై ఒత్తిడి తెచ్చాడు. బంగార్రాజు అడ్డు తొలగించుకుంటే బాధితులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన గోవిందరావు ఈ హత్య చేశాడు. శవాన్ని మాయం చేసేందుకు ఇద్దరికి రూ.లక్ష వరకు సుపారీ ఇచ్చాడు. ఈ ముగ్గుర్నీ పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగింది ఇలా.. భీమునిపట్నం మండలం నమ్మివానిపేటకు చెందిన బంగార్రాజు అక్టోబర్ 31వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తరువాత అతడు ఇంటికి రాకపోవడంతో ఈనెల 3వ తేదీన అతడి భార్య నందిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగార్రాజుతో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలున్న కోరాడ గోవిందరావు, కోరాడ లక్ష్మణరావు, పైడిరాజు, వెంకటేశ్‌లపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్టోబర్ 31న కోరాడ గోవిందరావు ఒక్కరే హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ 31న బంగార్రాజుకు గోవిందరావు ఫోన్‌చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిర్మాణంలో ఉన్న కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్‌కు వెంటనే రమ్మని చెప్పాడు. కూలీలంతా భోజనాలకు వెళ్లిన ఆ సమయంలో గోవిందరావు కరెంటు సరఫరా ఆపేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. డబ్బుల కోసం వచ్చిన బంగార్రాజును ఇనుపరాడ్‌తో తలపై, వీపుపై కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని దాచిపెట్టి బయటకు వెళ్లిన గోవిందరావు ఆది అనే వ్యక్తి మొబైల్ నుంచి ఫోన్ చేయడంతో పైడిరాజు, సంతోష్ వచ్చారు. మృతదేహాన్ని కనిపించకుండా చేస్తే రూ.లక్ష ఇస్తానని వారితో గోవిందరావు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.7 వేలు ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో వారు మృతదేహాన్ని పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ ఏనుగులపాలెంలోని పొలంలోకి తీసుకెళ్లి రేకు కప్పి ఉంచారు. ఒకటో తేదీన బోని వాటర్ వర్క్స్ వద్ద బంగార్రాజు మోటార్ బైక్ లాక్ చేసి దాచారు. పొలం వెళ్లిన రైతులు దుర్వాసన రావడంతో పరిశీలించి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు మధ్యవర్తిగా వసూలు చేసిన రూ.30 లక్షలను గోవిందరావు వాడుకున్నట్లు డీసీపీ–1 తెలిపారు. కొందరి అప్పులు తీర్చినట్లు తేలిందని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీలు సీహెచ్ శ్రీనివాసరావు, పెంటారావు, శ్రావణ్‌కుమార్, మూర్తి, శిరీష, సీఐలు పాల్గొన్నారు. -
ఉద్యోగాల విప్లవం
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు మరో వరం ప్రకటించారు. ఈ నెల రెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న లైన్‌మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో 1,60,591 మంది గ్రామ, వార్డు వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు 7వ తేదీ నుంచి శిక్షణ అందించనుంది. దీనికి తోడు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయల్లో 19 రకాల పోస్టులకు నిరుద్యోగులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. జిల్లాలో 632 పోస్టుల.. జిల్లాలో ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న 632 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రామ సచివాలయాల్లో 460, వార్డు సచివాలయాల్లో 172 పోస్టులున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్ట్ 17 తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకూ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్ ట్రేడ్ అర్హతలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పోస్టులకు ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఇంటర్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. ఐటీఐ, ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారికి అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రస్తుత లైన్మెన్ నోటిఫికేషన్‌తో వారంతా కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్ ట్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్–రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్–కాంట్రాక్టింగ్ చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులు మంచి అవకాశాన్ని కల్పించనున్నాయి. వయోపరిమితి సడలింపు.. లైన్మెన్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఇతరులకు 35 ఏళ్ల వయసున్న పురుషులు అర్హులు. 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో, మిగిలినవి స్థానిక కోటాలో భర్తీ చేస్తారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇవి తెలియాలి.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెంట్ స్తంభం ఎక్కడం తెలుసుండాలి. అలాగే మీటర్ రీడింగ్ నిర్వహణపై అవగాహన ఉండాలి. వివరాలకు ఏపీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. -
నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
♦ పంచనామా నివేదిక సిద్ధమైతే బాధ్యులపై వేటు ♦ ఏఈని కేసు నుంచి తప్పించేందుకు యత్నాలు ♦ విద్యుత్ శాఖను కుదిపేస్తున్న ప్రైవేటు కార్మికుడి మృతి ఘటన అరసవల్లి: ‘రెగ్యులర్ ఉద్యోగం ఇప్పించేస్తాం. కొద్ది రోజులు ఆగండి. అంతవరకు మాతో పనిచేస్తాడు అంటూ ఏళ్ల తరబడి తిప్పుకుని ఇప్పుడు నా కుమారుడి మృతికి కారణమయ్యారు’ అంటూ ప్రైవేటు కార్మికుడు ఎం.లక్ష్మీ సాయి ప్రసాద్ తల్లిదండ్రులు వీరాస్వామి, శారద గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దీనంతటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గొల్లుమంటున్నారు. ఆదివారం ఫాజుల్‌బాగ్ పేటలో ప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగానే! శనివారం సాయంత్రం స్థానిక గుజరాతిపేట సమీపంలో రెల్లివీధి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కిందకు పడిపోయి లక్ష్మీప్రసాద్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటన ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. నిబం«ధనల ప్రకారం ప్రైవేటు కార్మికులను విద్యుత్ స్తంభాలు ఎక్కించకూడదు. సంబంధిత ప్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శ్రీనివాస్, లైన్‌మేన్ ధనుంజయ్ తదితరులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసాద్‌ను విద్యుత్ స్తంభాలు ఎక్కించి పనులు చేయించుకున్నారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కీలకంగా పోస్టుమార్టం నివేదిక ఈ కేసు రాజీ చేసేలా కొందరు విద్యుత్ ఉద్యోగులు రంగంలోకి దిగి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై మృతుని కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోస్టు మార్టమ్ రిపోర్టు కీలకంగా మారింది. ఆదివారం పోస్టుమార్టమ్ పూర్తయి.. అంత్యక్రియలు జరిగిపోయాయి. మరో రెండు రోజుల్లో రిపోర్టు రానుండడంతో ఇటు విద్యుత్ అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. రిపోర్టులో విద్యుత్ షాక్‌తోనే మృతుడు మరణించినట్లు స్పష్టమైతే సంబంధిత బాధ్యులైన అధికార సిబ్బందిపై చర్యలు తప్పవని కొందరు అధికారులే చెబుతున్నారు. ఏఈ శ్రీనివాస్‌ను తప్పించేందుకు యత్నాలు! ఈ ఘటనలో విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జోక్యం చేసుకోవడం చర్చనీ యాంశమైంది. ఇందులో ముఖ్యంగా శనివారం వన్‌టౌన్‌లో నమోదైన కేసులో ఏఈ శ్రీనివాస్ పేరును ప్రస్తావించడంతో.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు ఎలాగైనా ఆ పేరును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు కొందరు ఉద్యోగులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. మృతుని తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించేందుకు ఓ వామపక్ష నేతను కూడా బరిలోకి దింపి ఆదివారం పంచాయితీ జరిపించారు. అయినప్పటికీ మృతుని సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి అంగీకారాన్ని వ్యక్తం చేయలేదని సమాచారం. ఒకవేళ ఏఈ శ్రీనివాస్‌ను దూరం చేస్తే పరిహార చెల్లింపులో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందని మృతుని సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. -
ఫ్యూజు పోతే చీకటే!
– 416 గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది కరువు – గ్రామీణ, మండల కేంద్రాల్లో పనిచేసే వారికి కర్నూలులో పోస్టింగ్ – రాయకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు - నేడు సీఎండీ కర్నూలుకు రాక కర్నూలు (రాజ్‌విహార్): కోడుమూరు మండలం అమడగుంట్లలో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇటీవల రాత్రి 8.15 గంటలకు ఫ్యూజు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ఫ్యూజ్ వేసే లైన్‌మన్ లేక గ్రామస్తులు రాత్రంతా చీకట్లో ఉన్నారు. గూడూరు మండలం బురాన్దొడ్డికి వచ్చే 11కేవీ వ్యవసాయ విద్యుత్ ఫీడర్ ట్రిప్ అయింది. మరమ్మతు చేసే నాథులు లేక రాత్రంతా ఆ గ్రామస్తులు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు నోచుకోలేదు. ఇలాంటి సమస్యలు ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని 416కు పైగా గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ కింది స్థాయి సిబ్బంది లేకపోవడం, ఉన్నవారిని ఇటీవల బదిలీ చేసి.. వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో ఇటీవల జరిగిన బదిలీలు వినియోగదారులకు శాపంగా మారాయి. రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది పైరవీలు, యూనియన్ నాయకుల ఉదాసీనత కారణంగా అడ్డదారుల్లో పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కోరుకున్న సీటు కోసం కొందరు అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే.. మరికొందరు ఏకంగా ఉత్తర్వులు ఇచ్చే అధికారులనే సంప్రదించి పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. వినియోగదారుడే విద్యుత్ సంస్థకు ఆదాయ వనరు. నెలనెలా బిల్లులు సక్రమంగా చెల్లిస్తేనే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి. అలాంటి వినియోగదారుడి అవసరాలు, సమస్యలను బదిలీల సమయంలో ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఏ సమస్య వచ్చినా వినియోగదారులు గంటలు, రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా (సర్కిల్)లో 54 మండలాల్లోని 920గ్రామాలకు, 615 మజరా గ్రామాలకు విద్యుత్ సరఫరా అందుతోంది. వీటిలో 12 లక్షల మంది వినియోగదారులు ఉండగా.. 1.50లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీరి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్ల వరకు సంస్థకు బిల్లుల రూపంలో వస్తోంది. 416 గ్రామాల్లో సిబ్బంది లేరు జిల్లాలో 416కు పైగా గ్రామాల్లో సంస్థకు చెందిన రెగ్యూలర్ సిబ్బంది లేరు. ఇటీవల జరిగిన బదిలీల్లో పల్లెల్లోని సిబ్బందికి జిల్లా, రెవెన్యూ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరికి డీఈలు, మరి కొంత మందికి ఎస్ఈ ఉత్తర్వులిచ్చారు. అసలే 250కి పైగా గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా బదిలీలు జరిగాయి. దీంతో కర్నూలు డివిజన్లోని 15 సెక్షన్ల (ఏఈ పరిధిలోని మండలం)లో 92 గ్రామాల పరిధిలో ఒక్కరు కూడా సిబ్బంది లేరు. అలాగే నంద్యాల డివిజన్లోని 17 సెక్షన్ల పరిధిలో గల 121గామాల్లో, ఆదోని డివిజన్లో 126, డోన్‌లో 52 గ్రామాల్లో ఒక్క లైన్‌మన్ లేదా జూనియర్ లైన్‌మన్ కూడా లేరని తెలుస్తోంది. అసలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీలు లేకపోయినా ‘ఎనీ ప్లేస్ ఇన్ కర్నూలు ఆర్ టౌన్’ అని ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమస్య వస్తే చీకట్లే నిబంధన ప్రకారం విద్యుత్ సరఫరా (డిస్ట్రిబ్యూషన్) ఉన్న ప్రతి గామానికి ఒక లైన్‌మన్ (రెగ్యులర్) లేదా జూనియన్ లైన్‌మన్ ఉండాలి. అయితే, 416గ్రామాల్లో ఫ్యూజ్ పోయినా, బ్రేక్ డౌన్ అయినా, ఫీడర్ ట్రిప్పింగ్, జంపర్ల కటింగ్, ఎగ్జిఫ్యూజ్ పోవడం వంటి సమస్యలు ఏర్పడినా పట్టించుకునే నాథులే లేరు. నేడు సీఎండీ రాక ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వై. దొర బుధవారం కర్నూలుకు రానున్నారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యుత్ భవన్‌లోని సమావేశపు హాలులో ఉదయం 10గంటలకు సమీక్ష ప్రారంభం కానుంది. సీఎండీతో పాటు డైరెక్టర్ పి.పుల్లారెడ్డి కూడా హజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
- మద్యం మత్తులో ఎల్సీ తీసుకోకుండా పనులు చేయించిన లైన్‌మేన్ - విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - గాజులపల్లెలో ఘటన గాజులపల్లె(మహానంది): ఓ లైన్‌మేన్ నిర్లక్ష్యం కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఫూటుగా మద్యం సేవించి కనీసం ఎల్సీ కూడా తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్ వద్ద పనులు చేయించాడు. ఫలితంగా విద్యుదాఘాతం సంభవించి పనులు చేస్తున్న వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాహెర్ హుసేన్(37) చిన్న చిన్న విద్యుత్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లైన్‌మేన్ గోపాల్ గాజులపల్లె ఫీడర్‌లోని గుండంపాడు రస్తాలో పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులకు పిలుచుకెళ్లాడు. అప్పటికే ఫూటుగా మద్యం తాగిన లైన్‌మేన్ ఎల్సీ తీసుకోకున్నా తీసుకున్నట్లు చెప్పి పనులు చేయాలని సూచించాడు. తాహెర్‌హుసేన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తర్వాత విచారించగా ఎల్సీ తీసుకోలేదని ఆపరేటర్ విశ్వరూపాచారి ఆలియాస్ విశ్వం తేల్చిచెప్పాడు. హుశేన్ మృతదేహంపై పడి భార్య మల్లికాబీ, పిల్లలు, కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన.. తాహేర్‌హుశేన్ మృతితో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు వందలాదిగా గాజులపల్లె సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు, గ్రామస్తులు మధుసూదన్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఏఈ శ్రీనివాసులుతో ఫోన్లో మాట్లాడారు. బాధితుడికి న్యాయం చేయాలని, లైన్మెన్ గోపాల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఒక ఉద్యోగం కల్పించాలని మతపెద్ద, ఖాజీ అబ్దుల్‌మన్నన్‌తో పాటు ముస్లీం పెద్దలు కోరారు. కేసు నమోదు.. తాహెర్‌హుసేన్ మృతికి కారకుడైన లైన్‌మేన్ గోపాల్‌పై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతానికి గోపాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. -
పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం
-
పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం
వికారాబాద్ : తన నివాసంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. బిల్లు కట్టకపోవడంతో ఆయన ఇంటికి లైన్మెన్ గతరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. సుమారు రూ.50వేలు బకాయిలు ఉండటంతో కరెంట్ కట్ చేయాలని విద్యుత్ అధికారులు ఆదేశాలతో లైన్మెన్ సరఫరా ఆపివేశాడు. దీంతో లైన్‌మెన్‌తో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫోన్లో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే... లైన్మెన్ను తీవ్రంగా దూషించారు. ఎమ్మెల్యే ఇంటికే కరెంట్ కట్ చేస్తావా? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ విరుచుకుపడ్డారు. లైన్‌మెన్‌తో ఎమ్మెల్యే ఫోన్ కాల్ సంభాషణలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే పీఏ అశోక్ రెడ్డి తనపై చేయి చేసుకున్నట్లు లైన్మెన్ ఆరోపించాడు. ఈ మేరకు ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లైన్మెన్ రాజగోపాల్ సస్పెన్షన్
లేపాక్షి : లేపాక్షిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్‌మన్‌గా పని చేసే రాజగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు హిందూపురం ట్రాన్స్‌కో డివిజనల్ డీఈఈ ఆర్ఎన్ శేషగిరిరావు గురువారం తెలిపారు. రాజగోపాల్ తన రెండో భార్య మంజులను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు వివరించారు. -
స్తంభం పైనుంచి పడి లైన్మెన్కు గాయాలు
నందిగామ: విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తూ కింద పడిపోవడంతో ఓ అసిస్టెంట్ లైన్మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ లైన్మెన్ సూరిబాబును విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏసీబీకి చిక్కిన లైన్‌మన్
ఆదిలాబాద్(జైపూర్): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఓ లైన్‌మన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో లైన్‌మన్ శంకర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో హెల్పర్ మృత్యువాత
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: తెగిపడిన విద్యుత్ తీగను సరిచేస్తుండగా విద్యుత్ ప్రసారం అవడంతో ఓ హెల్పర్‌కు విద్యుదాఘాతమై మృత్యువాత పడ్డాడు. లైన్‌మన్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుర్కపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మ దాసు అలియాబాద్ సబ్‌స్టేషన్ పరిధిలోని (42) తుర్కపల్లిలో పదహారేళ్లుగా హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, కూతురు మాధవి, కుమారుడు మహేష్ ఉన్నారు. శుక్రవారం తుర్కపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు అవతల ఉన్న 11కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. దాసు ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకుని పోల్ వద్ద మరమ్మతు చేస్తున్నాడు. రెండు తీగలను కలుపుతుండగా కరెంట్ సరఫరా అయింది. దీంతో స్తంభంపై ఉన్న దాసుకు విద్యుదాఘాతమై కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దాసు మృతిచెం దినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా చేశారు. బంధువుల ఆందోళన.. సబ్‌స్టేషన్ నుంచి దాసు ఎల్సీ తీసుకున్నా లైన్‌మన్ విద్యుత్ ప్రసారం చేయడం ఏమిటని మృతుడి బంధువులు మండిపడ్డారు. లైన్‌మన్ గణపతి నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని సంఘటనా స్థలంలో మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు గంటసేపు ఉద్రిక్తత నెలకొంది. శామీర్‌పేట్ సీఐ కాశిరెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు కుటుంబానికి పెద్దదిక్కు అయిన దాసు మృతితో భార్యాపిల్లలు గుండెలుబాదుకున్నారు. ‘మాకు దిక్కెవరు...?’ అని వారు రోదించిన తీరు హృదయ విదారకం. దాసు మృతితో తుర్కపల్లిలో విషాదం అలుముకుంది.