ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఓ లైన్‌మన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు.
ఆదిలాబాద్(జైపూర్): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఓ లైన్‌మన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో లైన్‌మన్ శంకర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.