
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. జనాల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూద్దాం.
సహాయ పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అదిత్ అరుణ్.. ఆ తర్వాత హీరోగా మారాడు. 24 కిస్సెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, ప్రేమదేశం తదితర చిత్రాలు చేశారు. కాకపోతే హిట్స్ లేకపోవడం వల్ల పెద్దగా ఫేమ్ సంపాదించలేకపోయాడు. 'లైన్ మ్యాన్' అనే సినిమాతో గతనెలలో కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన 'లైన్ మ్యాన్' సినిమా తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైంది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ప్రముఖ ఓటీటీల్లో కాకుండా లోకల్ కన్నడ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఊరంతా కలిసి కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉండాలని ఫిక్సవుతారు. అయితే దీనికి కారణమేంటి? ఏ మంచి పనికోసం అందరూ కరెంట్ లేకపోయినా పర్లేదు అని ఒప్పుకొన్నారు అనే కథాంశంతో 'లైన్ మ్యాన్' తీశారు.