function hall
-
పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
Iraq: భారీ అగ్నిప్రమాదం.. వంద మందికిపైగా మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివాహ వేడుకలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగి వంద మందికి పైగా మృతి చెందారు. వందాలది మంది గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా సజీవ దహనం అయ్యారు.మృతుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ప్రమాదంలో 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణాసంచా కాల్చే క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. 110 dead including the bride and groom in the fire incident at a wedding hall in Hamdaniyah,Iraq 550 injured Video is from AVA Media#Iraq #Hamdaniyah pic.twitter.com/I4dSQbQi1s — North X (@__NorthX) September 26, 2023 Nineveh Governor: Preliminary investigations indicate that the Hamdaniyah fire was caused by fireworks inside the wedding hall.#Iraq pic.twitter.com/1IuH0vqpif — Alahad TV-EN (@ahad_en) September 27, 2023 -
అప్పటి దాకా ఆడి పాడి.. అంతలోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: అప్పటి దాకా పెళ్లి వేడుకలో ఆడి పాడిన ఓ చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరాడు. ఈ దారుణ సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మే ఫేర్ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లి వేడుకలకు నందిగామ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక దంపతుల కుమారుడు అభిజిత్‌రెడ్డి (5) తల్లి సోదరితో కలిసి వచ్చాడు. పెళ్లిలో మ్యూజిక్కు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు కూడా చేశాడు. సాంయంత్రం నాలుగు గంటల నుంచి చిన్నారి కనిపించకపోవడంతో తల్లి మౌనికతో పాటు బంధువులు చుట్టుపక్కల వెతికారు. రాత్రి 6 గంటల వరకు కూడా కనిపించకపోవడంతో ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫంక్షన్ హాలులో పరిశీలించడంతో వెనకాలే ఉన్న ఓ సంపు వద్ద బాలుడి చెప్పులు కనిపించాయి. సంపులోకి దిగి వెతకడంతో బాలుడి మృతదేహం బయటపడింది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉత్సాహంగా ఆడిపాడిన చిన్నారి మృతదేహం బయటపడడంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఫంక్షన్ హాలు యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతిచెందాడని వారి కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో చేరినందుకే కక్ష సాధింపు చర్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరానన్న కారణంతో బీఆర్ఎస్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎస్సార్ గార్డెన్స్ పేరుతో ఫంక్షన్ హాల్‌ను తాను 13 ఏళ్ల క్రితం నిర్మించానని, అప్పుడు సర్వేలు చేయకుండా ఇప్పుడు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా రని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా మంగళవారం భారీ సంఖ్యలో కార్యక ర్తలతో కలిసి ఆయన గాంధీభవన్‌కు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. కొద్దిసేపు రేవంత్‌రెడ్డితో భేటీ అయిన పొంగులేటి తర్వాత మల్లు రవి, పిడమర్తి రవి, బానోతు విజయాబాయి, కోటూరి మానవతారాయ్ తదిత రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం రాజులా పాలిస్తోంది.. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తాను 20 గుంటల భూమిని కబ్జా చేశానంటూ.. ఇప్పుడు సర్వేల పేరుతో బీఆర్ఎస్ తనకు నోటీసులు ఇప్పిస్తోందని తెలిపారు. తాను ఆ భూమిని కబ్జా చేశానంటే ఎవరూ నమ్మరని, దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని వివరించారు. తాను భూమిని కబ్జా చేసినట్లు తేలితే ఆ భూమి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. అయినా కబ్జాలకు పాల్పడడం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒకలా, కాంగ్రెస్‌లో చేరినప్పుడు మరోలా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం రాజులాగా పాలిస్తోందని, హామీలు ఇవ్వడం, పథకాలను ప్రారంభించడం తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారని, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. అయినా కేసీఆర్ ఒక్కడు దీక్ష చేస్తేనే రాష్ట్రం వచ్చిందా? అని నిలదీశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరూ జోడెద్దుల్లాంటి వారు పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమితులైన పొంగులేటికి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్‌లో చేరతారని, ఈ నెల 20న జరగాల్సిన ఆయన చేరిక సభ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నామని, ఈ నెలాఖరులోగా లక్షలాది మందితో నిర్వహించే సభలో జూపల్లి పార్టీలో చేరతారని చెప్పారు. పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీకి జోడెద్దుల్లాంటి వారని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఫంక్షన్ హాల్లో రౌడీషీటర్ల విందు భోజనం.. ఎందుకంటే?
ఖలీల్‌వాడి(నిజామాబాద్ జిల్లా): రౌడీషీటర్లు ఐక్యమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నగరంలో గత ఆదివారం పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్ ఇబ్రహీం చావూస్ (29)ను రౌడీషీటర్లు హతమార్చిన విషయం విధితమే. ఈ హత్యకు ప్రధానకారణం పీడీఎస్ బియ్యం, భూ తగాదాల్లో వచ్చిన పంపకాలతోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇల్లీగల్ దందాపై పోలీసు కమిషనర్ నాగరాజు సీరియస్‌గా దృష్టి సారించారు. అంతేకాకుండా ఇబ్రహీం హత్య కేసు లో 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసుల రియాక్షన్‌తో రౌడీషీటర్లు తమకు ఇబ్బందులు తప్పవని భావించారు. తమ దందా దెబ్బతింటుందని.. విభేదాలు తొలగించుకుని ముందుకుసాగేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రౌడీషీటర్ల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు సదరు నేతలు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ల మధ్య సఖ్యత కోసం వారితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేష న్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగ్గురు రౌడీషీటర్ల అనుచరుల సమావేశం జరిగింది. దీని వెనుక రెండు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో భూ వివాదాలు, పీడీఎస్ బియ్యం, గంజాయివంటి వాటిలో వచ్చిన లాభాలు, మా మూళ్లను అందరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకరు వెళ్లిన పనులకు మరోవర్గం వెళ్లకుండా ఉండాలని చెప్పుకున్నట్లు తెలిసింది. ఎక్కడ ఏ పనులు చేస్తున్నామో సమాచారం ఒకరికొకరు ఇచ్చుకొని ముందుకు వెళ్లాలని, వచ్చిన ఆదాయాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. దీంతో వివాదాలు రాకుండా ఉంటాయని, పోలీసుల దృష్టి ఉండకుండా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు సమావేశంలో చర్చించిన నిర్ణయాలపై అందరూ సమ్మతించడంతో అందరూ కలిసి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీం హత్య తర్వాత పోలీసులు ఇల్లీగల్ దందాలు, రౌడీషీటర్లపై దృష్టి సారించడంతో ఎలాంటి గొడవలు లేక పోవడంతో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నా రు. రౌడీషీటర్ల సమావేశం అనంతరం వారి కదలిక లు మళ్లీ ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్ప డం లేవని, దీనిపై పోలీసులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్‌చారి చెప్పారు. సందీప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు జరిగిన ఫొటోషూట్‌కు వెళ్లిన తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే కారణంగానే హత్య చేశారని ఆరోపించారు. సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి కుమారుడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్‌కు తనకు ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సందీప్ కోరినట్టుగానే పెళ్లి, రిసెప్షన్ జరిపిస్తానని కూడా తాను చెప్పినట్టు వివరించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్‌లో సందీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య
దుండిగల్: మరికొద్ది గంటల్లో తాళి కట్టా ల్సిన చేతులతో తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడు ఓ వరుడు. తల్లి లేని బాధ తెలియనివ్వకుండా పెంచి న తాతయ్య..పెళ్లికి నెల రోజులు ముందే తనువు చాలించడం.. ‘పెళ్లి కొడుకు’ను చేసే కార్యక్రమం విషయ మై తండ్రితో గొడవ వంటి కారణా లతో కుంగిపోయిన వరుడు ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరుడిగా పెళ్లిపీట లెక్కితే చూద్దామని మురిసిపోయిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యు లకు గుండెకోత మిగిల్చాడు. వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు వచ్చిన వారు ఘటన గురించి తెలిసి నివ్వెరపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య మలక్‌పేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్(24). చిన్నతనంలోనే సందీప్ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్‌కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. బీటెక్ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు. ‘పెళ్లి కొడుకు’తంతుపై రేగిన వివాదం.. సాంప్రదాయం ప్రకారంగా తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్ దీన్ని వ్యతిరేకించాడు. ‘తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను ‘పెళ్లి కొడుకు’కార్యక్రమాన్ని చేసుకోలేను’అని సందీప్ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్ వైఖరిని తప్పుపట్టగా..ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు. సర్దుకుంటుందనుకుంటే.. సందీప్ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్‌ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరైన బంధువులు ఉదయం 7.30 గంటలకు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో వివాహ వేదికైన శ్రీకన్వెన్షన్ గేట్లు మూసుకుపోయాయి. విషయం తెలియని ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరిగా కన్వెన్షన్ సెంటర్‌కు రాగా జరిగిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ‘‘సందీప్ చాలా మంచి పిల్లవాడని, అతను ఇలా చేసుకోవడమేమిట’’ని చెప్పుకుంటున్నారు. ‘సందీప్ ను ఎప్పుడో పదవ తరగతి చదువుతున్నప్పుడు చూశా..ఇప్పుడు పెళ్లి కొడుగ్గా చూద్దామని ఏలూరు నుంచి వచ్చాను.. కాని అతను ఇలా చేసుకుంటాడని అనుకోలేదంటూ’ఓ బంధువు చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఘర్షణ పడ్డ సందీప్ తండ్రి.. చిన్నతనం నుంచే తన కొడుకును తనకు కాకుండా దూరం చేశారంటూ సందీప్ తండ్రి శ్రీనివాస చారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ క్రమంలో జాగేశ్వరరావు తరఫుబంధువులతో సందీప్‌ను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తాత, పిన్ని దగ్గరకు రాకుండా కట్టడి చేశారంటూ శ్రీనివాసచారి ఘర్షణ పడగా...పేట్ బషీరాబాద్ పోలీసులు వారిని విడదీశారు. సందీప్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం తాతయ్య మరణమేనా మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సందీప్ ఫోన్ తెరిచిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పేట్ బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు. వివాహ వేదిక వద్దనే సందీప్ ఆత్మహత్య కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఫంక్షన్హాల్లో పెళ్లికుమారుడు ఆత్మహత్య
-
కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్హాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రపరివారం రాక మొదలైంది. పచ్చటి పందిరి, మేళతాళాలతో ఫంక్షన్‌హాల్ కూడా ముస్తాబైంది. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు. పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లిపీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు. ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్హాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
‘ఫంక్షన్’ టైమ్‌లో టెన్షన్స్ రానీయద్దు!
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి నుంచి వెళ్ళే జాతీయ రహదారి నెం.44 అత్యంత కీలకమైంది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే వాటితో పాటు బెంగళూరు మార్గంలో ప్రయాణించే వాహనాలకు ఇదే ఆధారం కావడంతో అనునిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో రోడ్డుకు రెండు వైపులా విస్తరించి ఉన్న ఫంక్షన్ హాళ్ళ కారణంగా వాహనచోదకులకు కొత్త టెన్షన్స్ వస్తున్నాయి. ఈ హాళ్లలో కీలక కార్యక్రమాలు, పెద్ద ఫంక్షన్లు జరిగినప్పుడు ఆహుతుల వాహనాలన్నీ రోడ్లపై ఉండిపోతున్నాయి. ఇది తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే వాళ్ళు హైరానా పడాల్సి వస్తోంది. ఈ విషయంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పదేపదే ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ శుక్రవారం ఎన్‌హెచ్ నెం.44పై ఉన్న ఫంక్షన్ హాళ్ళ యజమానులతో సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులతో పాటు 23 మంది ఫంక్షన్ హాళ్ళ యజమానులు హాజరయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక హాళ్లకు సరైన పార్కింగ్ వసతి లేదని గుర్తించామని, ఇతర వసతులూ కరువయ్యాయని పోలీసులు స్పష్టం చేశారు. ఫంక్షన్ హాళ్లకు వచ్చే వారి వాహనాల కారణంగా జాతీయ రహదారిపై వెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బందులకు లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ బారికేడ్లు, కోన్లు, సైనేజ్‌లతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంలతో పాటు సీసీ కెమెరాలు సైతం ప్రతి ఫంక్షన్ హాల్‌కు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లు కచ్చితంగా ఉండాలని వారికి తెలిపారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, పికప్–డ్రాపింగ్ తదితరాల కోసం సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులతో ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ వసతులన్నింటినీ సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. -
స్కూలా.. ఫంక్షన్ హాలా?
సాక్షి,విశాఖపట్నం : ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలను టీడీపీ నేతలు తమ ఆగడాలకు అడ్డాగా మార్చేశారు. తమకు నచ్చి నట్టు పాఠశాలను ఉపయోగించుకుంటున్నారు. బడిని ఫంక్షన్ హాల్‌ను చేసేశారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మత్స్యకార విద్యార్థులకు ఆ మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా పాఠశాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురాగా స్థానిక టీడీపీ నాయకుడు పేర్ల మషేన్, 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు నిరంకుశంగా వ్యవహరిస్తూ పాఠశాలను తమ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. పాఠశాల పనిదినాల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాల ఆవరణాన్ని యథేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతోంది. శనివారం కూడా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాల ఆవరణాన్ని పెళ్లిమంటపంగా మార్చేశారు. కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక శనివారం రాత్రి జరగనుంది. అయితే మషే న్, పోలారావు ఒక పక్క పాఠశాలలో తరగతులు జరుగుతున్నా ఇక్కడే పెద్ద ఎత్తున షామి యానాలు వేయించారు. అంతేకాదు వంటలను కూడా పాఠశాలలోనే చేయించడం జరిగిం ది. దీంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగించింది. ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాలను వినియోగించడానికి వీల్లేదని స్థానికులు, ఉపాధ్యాయులు గతంలో చెప్పగా మషేన్ వారిపై చిందులు తొక్కాడు. దీంతో ఉపాధ్యాయులు ఏం చేయలేకపోతున్నారు. మిన్నకుండిపోవడం వారి వంతవుతోంది. చేసేది లేక పిల్లలను గదిలో ఒక మూలన కూర్చోబెట్టి పాఠాలు చెప్పాలి వస్తోంది. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటోం దని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఎందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
ఫంక్షన్..పన్ను టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. విందు, వినోదం.. కార్యం ఏదైనా ఫంక్షన్ హాల్లో జరిగితే ఇకపై పన్ను కట్టాల్సిందే. ఫంక్షన్హాల్లో ఏ కార్యం చేసినా బిల్లులో 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా ఫంక్షన్ హాల్ యాప్ రూపొందించింది. జీఎస్టీ వర్తించక ముందు ఫంక్షన్ హల్ బిల్లును సర్వీస్ ట్యాక్స్ ద్వారా చెల్లించేవారు. అయితే తాజాగా ఫంక్షన్ హాల్ సేవలతో పాటు వస్తువుల కేటగిరీలోకి రావడంతో జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తగా వార్షిక అద్దె రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న అన్ని ఫంక్షన్ హాళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటివరకు ఫంక్షన్‌హాల్స్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా కూడా పన్నులు చెల్లించ ట్లేదని గ్రహించిన వాణిజ్య పన్నుల శాఖ.. ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఫంక్షన్ హాల్స్ అద్దెలు కూడా పెరగనున్నాయి. కేటరింగ్, డెకరేషన్, వినోదంతో పాటు అన్ని రకాల సేవలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానంతో.. పన్ను వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. ఇప్పటికే ఐఓసీ, ఆర్డీ యాప్‌లతో సిబ్బందికి టార్గెట్లు కేటాయించి పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్‌లను జీఎస్టీ పరిధిలో తీసుకురావడానికి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫంక్షన్ హాల్లు పూర్తి సమాచారాన్ని కొత్త యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇంకా జీఎస్టీలో నమోదు చేసుకొని ఫంక్షన్ హాళ్లను యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఫంక్షన్ హాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో పొందుపరచడంతో అధికారులు, సిబ్బందికి రిజిస్ట్రేషన్ సులభమైందని అధికారులు చెబుతు న్నారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, సొంతం ఎన్ని.. కంపెనీలు, పార్ట్నర్షిప్లో ఎన్ని ఉన్నాయనే వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. ఫంక్షన్ హాల్ వైశాల్యం తదితరాలతో పాటు పాటు ఉద్యోగుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు. ఫంక్షన్ హాల్లో సామగ్రిపై కూడా నజర్ వేస్తున్నారు. ఒకవేళ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు డీఆర్సీ ఫామ్–3 ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయించు కోకుండా పన్నులు ఎగ్గొడితే వడ్డీతోపాటు జరిమా నాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫంక్షన్ హాల్ యాప్‌తో ఫంక్షన్ హాళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లు సులభమవు తున్నాయని అధికారులు చెబు తున్నారు. -
వెంకన్నకే శఠగోపం
హిమాయత్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న కల్యాణ మండపాలు వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌గా మారాయి. ధనాపేక్షతో టీటీడీ అధికారులు సాక్షాత్తు వెంకన్నకే శఠగోపం పెడుతున్నారు. వారికి లీజుకు ఇచ్చిన మండపాల్లో పెళ్లిళ్లు నిర్వహించకుండా ప్రైవేటు వ్యాపారాలకు అద్దెకు ఇస్తున్నారు. టీటీడీకి కట్టాల్సిన బకాయిలు సైతం చెల్లించకపోవడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహానికి గురైంది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం లీజు గడువు ముగిసినా లీజుదారులు దానిని ఖాళీ చేయకుండా పాత కోర్టు ఆర్డర్‌ను చూపిస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. గత ఆరు నెలలుగా టీటీడీకి ఒక్క రూపాయి చెల్లించకపోగా నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నందుకు గాను దానిని సీజ్ చేశారు. దాదాపు రూ.కోటి బకాయిలు ప్రస్తుతం టీటీడీలోని కళ్యాణమండపం ఎస్.వైష్ణవి పేరుతో కొనసాగుతోంది. 2016 అక్టోబర్న లీజుకు తీసుకున్నారు. 2018 అక్టోబర్‌తో లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు. దీంతో తిరుపతి నుంచి వచ్చిన అధికారులు మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే రోజు లైసెన్సుదారుడు కోర్టుకు వెళ్లి ఎక్స్టెన్షన్ కోరుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటి వరకు లీజును పొడిగిస్తున్నట్లు కానీ..లీజు ముగిసిన నాటి నుంచి నేటి వరకు టీటీడీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.కోటి వరకు బకాయిపడినట్లు టీటీడి విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకే ప్రాధాన్యం:పెళ్లిళ్ల కోసం మాత్రమే టీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తోంది. అయితే కల్యాణమండపాన్ని లీజుకు ఇచ్చే సమయంలోనే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే హిమాయత్‌నగర్ టీటీడీలో మాత్రం కథ భిన్నంగా ఉంది. లీజు దారుడు పెళ్లిళ్లకు మండపాన్ని ఇవ్వకుండా వ్యాపార సంస్థలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు కేటాయిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. లీజు దారుడి వ్యవహరశైలిపై టీటీడీ ఉద్యోగులు విజిలెన్స్ అధికారులకు సమచారం అందించడంతో ఈ నెల 22న విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసినందున మండపాన్ని స్వాధీనం చేసుకుంటున్నామంటూ మండపాన్ని సీజ్ చేశారు. ఈ విషయంపై తిరుమల విజిలెన్స్ ఎస్టేట్ ఆఫీసర్‌ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా..‘ఇటువంటి విషయాలు బయట పెట్టకూడదని, నిదానంగా అన్నీ సర్దుకుంటాయని బదులిచ్చారు’. -
మంత్రి అండతో టీడీపీ నేతల దాష్టీకం
మంత్రి సోమిరెడ్డి తన ప్రచారం కోసం ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. తన సభ నిర్వహణ కోసం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న ముస్లింలను పోలీస్ బలగాలతో మెడపెట్టి బయటకు గెంటించారు. తన అనుచరులతో ముస్లింలపై దాష్టీకానికి పాల్పడ్డారు. పెళ్లి పనులకు అటంకం కల్పించడంపై ఆందోళనకు దిగినా మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ముస్లింలు భగ్గుమంటున్నారు. పొదలకూరు: పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన ముస్లింలు షాదీమంజిల్‌లో నిఖా చేసుకునేందుకు ముందుగానే నిబంధనల ప్రకారం తహసీల్దార్ నుంచి ఆది, సోమవారానికి అనుమతి పొందారు. ఇందుకు కమిటీలో ఇద్దరు నూతన సభ్యులు అనుమతికి సంతకాలు కూడా చేశారు. పెళ్లి బృందాలు షాదీ మంజిల్‌కు చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వారితో కళకళలాడుతున్న షాదీ మంజిల్‌లో ఆదివారం వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి సమావేశం నిర్వహించేందుకు నూతన కమిటీ సిద్ధం కావడంతో ఉద్రిక వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు షాదీమంజిల్ వద్దకు చేరుకుని పెళ్లి జరగాల్సిన చోట ఫ్లెక్సీలు కట్టి, సభా వేదికను ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు తరఫు బంధువులు, తల్లిదండ్రులు ఇదెక్కడి న్యాయమని తమను పెళ్లి పనులు చేసుకోనివ్వరా? అంటూ గొంతు చించుకున్నా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గొడవలు జరుగుతాయని ముందుగా ఊహించిన అధికార పార్టీ నేతలు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయరెడ్డి నేతృత్వంలో చుట్టుపక్కల పోలీస్స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లి బృందాన్ని షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించకుండా రోప్ పార్టీతో అడ్డుకున్నారు. ఒక దశలో ముస్లిం మహిళలు భవనం వద్దకు వెళ్లి బైఠాయించి ఆందోళనకు దిగారు. తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించి.. నూతన కమిటీ నాయకులు భవనం తాళాలు పగులగొట్టి షాదీ మంజిల్ భవనంలోకి ప్రవేశించి సభా వేదికను ఏర్పాటు చేశారు. షాదీమంజిలో మహబూబ్‌బాషా, మున్నీ కుమారుడి వివాహం జరిపించేందుకు ముందస్తుగా తహసీల్దార్ నిర్మలానందబాబా ద్వారా ఆదివారం ఉదయం 11 నుంచి సోమవారం మధ్యాహ్నం వరకుఅనుమతి పొంది తాళాలు తీసుకున్నారు. ఆకస్మికంగా అధికార పార్టీకి చెందిన మంజిల్ నూతన కమిటీ సభను ఏర్పాటు చేసుకోవాలని తాళాలు ఇవ్వాల్సిందిగా పోలీసుల ద్వారా అడిగించారు. పెళ్లి పనుల్లో ఉన్న వారు తాళాలు ఇవ్వలేమని, పెళ్లి జరుగుతున్న చోట సభలు ఎలా పెడతారని ప్రశ్నించారు. పక్కనే మూడు భవనాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో మంత్రి సభను నిర్వహించుకోవాల్సిందిగా సూచించారు. అయితే అధికారం ఉందని తాళాలు పగుల గొట్టడంతో దీన్ని అడ్డుకునేందుకు పెళ్లి వారు, బంధువులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపడి పెళ్లి బృందాన్ని బయటకు పంపించారు. పోలీసులు, పెళ్లి వారి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో మంత్రి వచ్చి వెళ్లేంత వరకు పెళ్లి వారిని లోపలికి ప్రవేశించకుండా పోలీసులు మెయిన్ రోడ్డుపైనే రోప్‌పార్టీ ద్వారా అడ్డుకున్నారు. మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు పెళ్లి వారిని బయటకు పంపి సమావేశం నిర్వహిస్తున్న మంత్రి సోమిరెడ్డి తీరును నిరసిస్తూ ముస్లింలు మెయిన్‌రోడ్డుపై డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ జరుగుతున్న దాష్టీకంపై తాము చెప్పేది మంత్రి వినాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజకీయ పార్టీలతో పని లేదని పెళ్లి పనులు చేసుకోనివ్వకుండా ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలని టీడీపీకి చెందిన మైనార్టీ నేత ముసుగులో ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. మా మనోభావాలను దెబ్బతీశారు శుభమాని సొంత సోదరి కుమార్తెను తమ కుమారుడికిచ్చి వివాహం జరిపించేందుకు ఏర్పాటు చేస్తుండగా సభలు, సమావేశాలంటూ మా మనోభావాలను దెబ్బతీశారు. శుభాకార్యం చేసుకుంటున్న తమ ఇంట్లో సంతోషం లేకుండా చేశారు. మాకు రాజకీయ పార్టీలతో పనిలేదు, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేవాళ్లం కాదు. పెళ్లి జరిగే ప్రదేశంలో ఒక పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కార్యకర్తలతో వచ్చి గందరగోళం సృష్టించారు. తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే ఆయన సర్దుకుని వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. పోలీసు అధికారులు సైతం పక్షపాత వైఖరి ప్రదర్శించారు. – ఎస్కే మాహబూబ్‌బాషా, మున్నీ,పెళ్లి కొడుకు తల్లిదండ్రులు -
సండే సందడి కరువు..!
చేతిలో నగదు లేక జనం విలవిల సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా జీతం చేతికి అందాక వచ్చే ఆదివారం చిరుద్యోగులకు పండుగే.. మటనో, చికెనో లేదా ఏదైనా ప్రత్యేక వంటకాల తోనో ఓ విందులాగా గడుపుతారు.. సాయంకా లం భార్యాపిల్లలతో సినిమాకో, షికారుకో వెళతా రు.. కానీ ఈ నెల తొలి ఆదివారం మాత్రం సామా న్యులందరికీ తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చింది. కారణం చేతిలో డబ్బులు లేకపోవడమే! బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవ డంతో రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చిరుద్యోగులు, నెల నెలా డబ్బులు చేతికందే వివిధ రంగాల వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెలవు రోజైనా కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. కొందరు ‘సెలవు రోజు’కే విశ్రాంతి ప్రకటించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నగదు కోసం ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. వ్యాపారాలన్నీ బంద్.. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు, దుకాణాల్లో అమ్మకాలు 50 శాతానికిపైగా పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్‌లోని బేగంబజార్, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, అబిడ్స, కోఠి తదితర ప్రధాన మార్కెట్లలోనూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. సాధా రణంగా నగరంలో వీధి వ్యాపారాలు అత్యధికంగా జరుగుతుంటాయి. కానీ నోట్ల రద్దు, చిల్లర కష్టా లతో అవన్నీ బాగా దెబ్బతిన్నాయి. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స, ఐమ్యాక్స్, జూపార్క్ తదితర వినోద, పర్యాటక స్థలాలకు రద్దీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎం.. ఏ వేళలో చూసినా బంద్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏటీఎంలు ఆదివారం కూడా ఖాళీగానే వెక్కిరించారుు. హైదరాబాద్‌లోని ఏడువేల ఏటీఎంలలో రెండు వేలు కూడా పనిచేయలేదు. అందులోనూ ఎక్కడ చూసినా కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరారు. దాంతో నగదు నింపిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయాయి. ఫంక్షన్ హాల్ నుంచి గుడికి.. నోట్ల రద్దు, నగదు కొరతతో ఏకంగా ఓ పెళ్లి వేదికే మారిపోయింది. పెద్ద ఫంక్షన్ హాల్లో ఘనంగా జరగాల్సిన వివాహం.. ఓ గుడిలో నిరాడంబరంగా చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని అబిడ్స కట్టెలమండి ప్రాంతానికి చెందిన నంబి మహేందర్ పెద్ద కుమార్తె పావని వివాహం ఆదివారం (4వ తేదీన) జరిగింది. ఈ వివాహం కోసం తొలుత మెహిదీపట్నంలోని రూబీ గార్డెన్స ఫంక్షన్‌హాల్‌ను బుక్ చేసుకున్నారు. కానీ కరెన్సీ కష్టాలతో ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అదే ముహూర్తానికి ఎంజే మార్కెట్‌రోడ్‌లోని కాశీ విశ్వనాథుని ఆలయంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. మహిళను బలి తీసుకున్న నోట్ల కొరత దోమకొండ: నోట్ల సమస్య కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన పులబోయిన లక్ష్మి (32) అనే మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. లక్ష్మి(32)కి గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితం ఆమెకు గుండె ఆపరేషన్ జరిగింది. మందుల కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు శుక్రవారం ఆమె బ్యాంకుకు వెళ్లగా.. సిబ్బంది రూ.2 వేలే ఇచ్చారు. మరికొంత సొమ్ము ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో శనివారం కూడా బ్యాంకుకు వెళ్లిన ఆమె... క్యూలైన్లోనే అస్వస్థతకు గురైంది. స్థానికంగా చికిత్స చేయించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండ డంతో లక్ష్మిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. లక్ష్మి భర్త నర్సింహులు ఉపాధి కోసం 3 నెలల క్రితం దుబాయి వెళ్లాడు. వారికిద్దరు కుమార్తెలు. పేదలు కావడంతో అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో.. స్థానికులే ఆర్థిక సాయం అందించారు. వ్యాపారం పడిపోయింది నోట్ల సమస్యతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. నవం బర్ 8కి ముందు ఆది వారం వచ్చిందంటే చాలు.. ఉదయం నుంచే వినియోగదారుల రద్దీ ఉండేది. కానీ ఈ ఆదివారం వ్యాపారం సగానికి తగ్గింది. వచ్చిన వినియోగదారుల్లో కొందరు రూ.2 వేల నోట్లు తీసుకురావడంతో చిల్లర ఇవ్వలేక తిప్పి పంపేయాల్సి వచ్చింది.. - సంతోష్‌కుమార్, చికెన్ వ్యాపారి, ఉప్పుగూడ నగదు పరిమితితో అవస్థలు నగదు ఉపసంహరణ పరిమితులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూపార్క్‌లోని జంతువులకు ఆహరం కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేవు. మాంసాహార జంతువుల కోసం మాంసం సరఫరా చేయడం కష్టంగా ఉంది.. - ఫరీద్, ఆహార సరఫరా కాంట్రాక్టర్, జూపార్క్ -
కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్వతీపురం మెయిన్‌రోడ్డులోని సూర్యకళా ఫంక్షన్ హాల్ కింది భాగంలో ఉన్న సెల్‌షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో మండపంలో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలిపోతాయన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. -
పిలవని పెళ్లికి వెళ్లి... బీభత్సం సృష్టించారు
హైదరాబాద్ (గోల్కొండ) : ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి భోజనాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు షాదీఖానాలో యువకులు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దాడి గోల్కొండలో సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ లైన్స్‌కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ కుమారుడు మహ్మద్ ఆమెర్ వివాహం గోల్కొండ జీన్సి బజార్‌కు చెందిన యువతితో శుక్రవారం రాత్రి గోల్కొండ బడా బజార్‌లోని మిర్జా గార్డెన్లో జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వధూవరుల కుటుంబాలు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొనగా, డైనింగ్ హాల్లోకి వచ్చి 40 మంది యువకులు భోజనాలు చేస్తున్నారు. వీరిని చూసిన వరుడి తండ్రి మహ్మద్ సిద్దిఖ్ అక్కడకు వెళ్లి.. పిలవకుండానే వచ్చి భోజనాలు చేస్తున్నారంటూ ఆ యువకులను నిలదీశారు. దాంతో వారు తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు, రాడ్లతో సిద్దిఖ్పై దాడి చేశారు. అతడి కేకలు విని బంధువులు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. వారిపై కూడా యువకులు కత్తులు, రాడ్లతో దాడి చేసి అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికేస్తామంటూ.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని దబాయించారు. గాయపడ్డవారు కింద పడిపోగా కొందరు యువకులు మహిళలపై కూడా దాడిచేశారు. సిద్దిఖ్ భార్య గౌసియా బేగాన్ని మెడపట్టి లాగి రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఆమె మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. షాదీఖానాలోని వస్తువులను కర్రలు, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. మహ్మద్ సిద్దిఖ్ కారు అద్దాలు పగలకొట్టారు. గంటపాటు విధ్వంసం సృష్టించి దుండగులు పారిపోయారు. రాత్రి రెండు గంటలకు మహ్మద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు గోల్కొండ ఖల్ఫాన్ తెగకు చెందిన వారని మహ్మద్ సిద్దిఖ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి
-
కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం హాస్యనటుడు తాగుబోతు రమేశ్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. - కామారెడ్డి -
వివాహ వేడుకల్లో రాంచరణ్
ప్రముఖ సినీ నటుడు రాంచరణ్ యూసఫ్‌గూడలోని సవేరా ఫంక్షన్ హాల్లో జరిగిన మల్లేష్ వివాహ వేడుకల్లో పాల్గొని, వధువరులను ఆశీర్వదించారు. రామ్‌చరణ్ వద్ద మల్లేష్ అంగరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ -
కనీస ప్రమాణాలు పాటించాలి
ఎమ్మెల్సీ నాగేశ్వర్ నారాయణపేట : ప్రభుత్వ విద్యావిధానంలో కనీస ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డా.కె.నాగేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలేపల్లి ఫంక్షన్హాల్లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రథమ విద్యా మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలకు తొలిరోజు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘బంగారు తెలంగాణ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరి తపిస్తున్నదన్నారు. ఈ కల సాకారానికి బంగారం లాంటి చదువు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలకు అక్షరాస్యత, ప్రభుత్వ విద్య బలోపేతంపై చిత్తశుద్ధి లేనందున ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్నారు. ఆరేళ్ల క్రితం సీఎం నేతృత్వంలో ఏర్పాటు చేసి న ‘సాక్షరత మిషన్’కు తనను కూడా ఒక సభ్యుడిగా నియమించినా ఇంతవరకు ఒక్క సమావేశం జరగలేదన్నారు. మిషన్ విధివిధానాలు ఏమిటో కూడా తెలియవన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇందు కు రూ. 25 కోట్లు కేటాయించి అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారేగా ని, ఇంతవరకు నిపుణుల బృందాన్ని ఏ ర్పాటు చేయ లేదన్నారు. విద్యారంగ అభివృద్ధి జరగనిదే బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ప్రతి ఉపాధ్యాయుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయూలన్నారు. పిల్లల్లో ప్రశ్నిం చే, ఆలోచించే తత్వాన్ని చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నా రు. ఉపాధ్యాయుడు తరగతి గదిని ప్ర పంచానికి అనుసంధానం చేయాలని, ప్రపంచ విషయాలను పరిచయం చేసినప్పుడే శాస్త్రీయ విద్యావిధానం వస్తుం దన్నారు. ఎమ్మెల్సీ పొతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసమే కాకుండా బాధ్యతల విషయంలోనూ ముందుండాలన్నారు. రాష్ట్రంలో తొలి యూటీఎఫ్ విద్యా మహాసభల చర్చలు, అభిప్రాయాలు, తీర్మానాలు రేపటి భవిష్యత్ బాగుకు, బంగారు తెలంగాణ కలల సాకారానికి ఉపయోగపడాలన్నారు. ప్రభుత్వం ఉచిత నిర్బం దవిద్య అమలుకు కృత నిశ్చయంతో ఉందన్నారు.మహాసభ ఆహ్వాన సం ఘం అధ్యక్షుడు, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య మాట్లాడుతూ వెనకబడిన ‘పేట’ డివిజన్లో విద్యా సదస్సును నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. పెట్టుబడిదారి, బాలకార్మికుల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయలోకమేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత శివకుమార్‌రెడ్డి, కృష్ణభగవాన్, చావరవి, కిష్టయ్య, రఘుపాల్, సంయుక్త, విజయ్‌కుమార్, వెంకటప్ప, వెంకట్రామరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈవెంట్ ప్లానింగ్ ఇక ఆన్లైన్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, గృహ ప్రవేశం, పుట్టినరోజు, షష్టిపూర్తి.. ఇలా వేడుక ఏదైనా ఫంక్షన్ హాల్ మొదలుకుని క్యాటరర్స్‌ను ఎంపిక వరకు పెద్ద ప్రహసనమే. వేడుకలో ఎంజాయ్ చేయాల్సిన తరుణంలో ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యే కుటుంబ సభ్యులే ఎక్కువ . వేరే ఊర్ల నుంచి వచ్చి స్థిరపడ్డవారు, ప్రవాస భారతీయులకైతే కార్యక్రమ ఏర్పాట్లు తలకు మించిన భారమే. ఇక అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా ఆ బాధ చెప్పతరం కాదు. ఈ ఆందోళనకు ఫుల్స్టాప్ పెడుతూ ఈవెంట్ ప్లానింగ్ అం తా ఆన్లైన్లో చేసుకుని మధుర క్షణాలను ఆస్వాదించమటోంది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ యువర్ఈవెంట్.కో. ఒక్క క్లిక్‌తో కావాల్సిన హాల్, ఫోటోగ్రాఫర్, డెకోరేటర్, క్యాటరర్‌ను ఎంచుకోండని చెబుతోంది. హైదరాబాద్‌లో వచ్చిన స్పందనతో ఇతర నగరాలకూ విస్తరించేందుకు ఈ స్టార్టప్ సమాయత్తమవుతోంది. అనుభవ ం నేర్పిన పాఠం.. అది 2008. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో వార్షికోత్సవ వేడుక. ఉన్న బడ్జెట్లో సౌండ్ సిస్టమ్, లైట్లు ఏర్పాటు చేసేవారి కోసం చాలా వెతికాం. చివరకు ఎలాగోలా పట్టుకోగలిగాం. స్నేహితుడి పెళ్లి సందర్భంగానూ ఇలాంటి అనుభవమే. క్యాటరర్, ఫోటోగ్రాఫర్‌ను ఎంచుకోవడానికి స్నేహితులు, బాగా తెలిసిన వారి సహాయం తీసుకున్నాం. నమ్మకమైన వెండార్లను పట్టుకోవడానికి స్నేహితులో లేదా పాత పరిచయాలపై ఆధారపడుతున్నాం. ఈ అనుభవమే కంపెనీ ఏర్పాటుకు దారి తీసిందని అంటున్నారు యువర్ఈవెంట్.కో సహ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీహర్ష భవిరిశెట్టి. వేడుకలో ఎంజాయ్ చేయాల్సిందిపోయి కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న బెంగ చాలా మందిలో ఉంటుందని అన్నారాయన. నమ్మకమైన వెండార్లను, అందులోనూ ఆన్లైన్లో క్షణాల్లో బుక్ చేసుకునే వ్యవస్థ ఉంటే పెద్ద ఊరటేనని చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ చూశాకే.. ఈవెంట్‌తో ముడి పడి ఉన్న వెండార్లందరినీ వెబ్సైట్లోకి తీసుకురావడం లేదు. వెండార్ల బ్యాక్‌గ్రౌండ్ చూసి కస్టమర్లకు మంచి సర్వీసు ఇస్తార ని విశ్వసించాకే ఎంపిక చేసుకుంటున్నాం. కస్టమర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నదే మా లక్ష్యం అని శ్రీహర్ష తెలిపారు. ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ సర్వీసులకే యూత్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇతర ఊర్లు, ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు... అలాగే ప్రవాస భారతీయులకు యువర్ఈవెంట్.కో చక్కని వేదిక అని చెప్పారు. వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్న వారిలో 20 శాతంపైగా ఎన్నారైలు ఉంటున్నారని వివరించారు. ఎన్నారైలు ఒకట్రెండు వారాలు ఇక్కడ ఉండి వేడుక జరుపుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారికి ఒక క్లిక్ దూరంలోనే సర్వీసులు ఉండడం ప్రయోజనమని అన్నారు. ఎంపిక అంతా మీ ఇష్టం.. వివిధ సర్వీసులు ఇచ్చే వెండార్ల వివరాలు అంటే హోటళ్లు, ఫోటోగ్రాఫర్లు, క్యాటరర్ల వంటివారి సమాచారం అంతా వెబ్సైట్లో పొందుపరిచారు. హోటల్ సామర్థ్యం, ప్రదేశం, చార్జీలు తదితర వివరాలూ ఉంటాయి. కస్టమర్ తన బడ్జెట్, వచ్చే అతిథుల సంఖ్యను టైప్ చేస్తే చాలు అందుకు అనుగుణంగా సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఇప్పటివరకు 350కి పైగా వెండార్లతో కంపెనీ చేతులు కలిపింది. వెండార్ల నుంచి కస్టమర్లు కొటేషన్ కోరి బెస్ట్ డీల్స్ పొందొచ్చు. చెల్లింపులన్నీ నేరుగా వెండార్లకే చేయాలి. కస్టమర్లు వెబ్‌సైట్‌ను సందర్శించడం, వెండార్లతో లావాదేవీల వివరాలను ట్రాక్ చేసే వ్యవస్థ కంపెనీ వద్ద ఉంది. ఎంత సీజన్ ఉన్నా వెండార్ల తొలి ప్రాధాన్యత తమ కస్టమర్లేనని కంపెనీ అంటోంది. -
భార్య చేతిలో నేను కీలు బొమ్మనట!
మనోగతం నాలో మొదటి నుంచి ప్రగతిశీల భావాలు ఎక్కువ. స్త్రీలంటే చాలా గౌరవం. చాలామంది పురుషులు భార్యను చిన్నచూపు చూస్తారు. వెటకారంగా మాట్లాడతారు. ఈ విషయంలో నేను మిగతావాళ్ల కంటే భిన్నంగా ఉంటాను. నా భార్యతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడిని. ఇది మా చుట్టాలలో చాలామందికి వింతగా అనిపించేది. ఒకసారి నేను ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఒక పెద్దావిడ- ‘‘ఏం నాయనా...పెళ్లాం ఎంత చెబితే అంతేనట కదా!’’ అంది నవ్వుతూనే. నాకు మాత్రం ఎక్కడో చురుక్కుమంది. మరోరోజు, మరోచోట వరుసకు మామయ్య అయ్యే ఒకాయన- ‘‘ఆడవాళ్లకు అతి స్వేచ్ఛ ఇవ్వకూడదు...’’ అని ఏవేవో చెప్పడం మొదలు పెట్టాడు. ఆ రోజు కూడా కంటి నిండా నిద్ర లేదు. నేను ఎప్పుడూ శాంతంగా ఉంటాను. నాలో కోపం అనేది ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. ‘శాంతమూర్తి’ అని కూడా నన్ను ఆప్యాయంగా పిలిచేవారు ఉన్నారు. అలాంటి నేను మా పెద్దమ్మ కూతురు పెళ్లిలో పట్టలేనంత కోపంతో ఊగిపోయాను. ఒకడు అన్నాడు...‘‘పెళ్లాం చేతిలో కీలుబొమ్మగా ఉంటే ఎలా? కొన్నిరోజులైతే నీతో బట్టలు కూడా ఉతికిస్తుంది’’ అని. ఆ మాటలు విని, అతని చెంప మీద ఒక్కటిచ్చుకున్నాను. గట్టిగా అరిచాను.పెద్ద గొడవై పోయింది. చాలామందితో పాటు నాలోని కోపాన్ని నేను మొదటిసారిగా చూశాను. ఆరోజు మంచికో చెడుకో కోపంతో ఊగిపోయినా...ఇక అప్పటి నుంచి వెటకారపు మాటలు మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. మనకు అమ్మ ఉంటుంది. ఆమె ఆడదే. మనకు చెల్లి ఉంటుంది. ఆమె ఆడదే.. అయినప్ప టికీ ఆడవాళ్లంటే శత్రువుల్లా ప్రవర్తిస్తాం. చిన్నచూపు చూస్తాం. మాట్లాడతాం. ‘అలా మాట్లాడ కూడదు’ అని చెప్పడానికి మంచి మాటలు సరిపోనందుకు, చెయ్యెత్తి కొట్టాల్సి వచ్చినందుకు సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు! - డి.మూర్తి, మచిలీపట్నం -
ఆటోలు ఢీ.. పది మందికి తీవ్రగాయాలు
పండుగ ఆ కుటుంబాల్లో వేదనను మిగిల్చింది... పండక్కి వెళ్లి సంతోషంగా గడపాలని భావించిన వారికి ఆటో రూపంలో ప్రమాదం సంభవించి క్షతగాత్రులుగా మిగలాల్సి వచ్చింది. మూడు కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచక పిల్లలు రోదించారు. నర్సీపట్నం/నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఎదురెదురుగా వస్తున్న ప్రయాణికులు, గూడ్సు ఆటోలు ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి 7గంటల సమయంలో పట్టణంలోని కేవీఆర్ ఫంక్షన్ హాలుకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి నుండి వస్తున్న బొప్పాయి లోడు ఆటో నర్సీపట్నం నుండి 11 మంది ప్రయాణికులతో ఏటిగైరంపేట వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ప్రయాణికుల ఆటోడ్రైవర్‌తో పాటు తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరికీ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి ఐదుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో మాకవరపాలెం మండలం చామంతిపురానికి చెందిన భార్యాభర్తలు పోతల రమణ(50), వరలక్ష్మి(45)తో పాటు పిల్లలిద్దరితో కలిసి గబ్బాడ పోతురాజుబాబు పండుగకు వెళ్తూ ఈ ఆటో ఎక్కారు. ఇదే మండలం పాపయ్యపాలేనికి చెందిన గవిరెడ్డి బాలరాజు(12), గబ్బాడకు చెందిన పెదపూడి జోగులమ్మ(50), కశింకోట మండలం తీడ నుండి కొల్లు రామకృష్ణ(35) గబ్బాడలో జరుగుతున్న పండుగకు వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇదే మండలం పాపయ్యపాలేనికి చెందిన లెక్కల జ్యోత్స్న(9), లెక్కల రత్నం(45), గొలుగొండ మండలం ఏటిగైరంపేటకు చెందిన పోతల సత్య(20), పోతల పొన్నంనాయుడు(14)లు తమ స్వగ్రామానికి వెళ్తూ ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పాకలపాడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కూరాకుల రామకృష్ణ(35) గాయపడ్డారు. వీరిలో భార్యాభర్తలైన పోతల రమణ, వరలక్ష్మిలకు తీవ్రగాయాలు కావడంతో ఇద్దరు పిల్లలు వారి పక్కన కూర్చుని బిత్తర చూపులు చూస్తున్నారు. తల్లీకూతుర్లయిన లెక్కల రత్నం, జ్యోత్స్నల ఇద్దరి కాళ్లు నుజ్జయ్యాయి. అక్కాతమ్ముడైన పోతల సత్య, పొన్నంనాయుడులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పొన్నంనాయుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రి 7గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో క్షతగాత్రులందరినీ ఏరియా ఆస్పత్రికి 108లో తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల బంధువులు హుటాహుటిన తరలి వచ్చారు. ప్రమాదానికి కారణమైన గూడ్స్ ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు. నర్సీపట్నం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అధికారులంతా విధుల్లో కష్టపడి పనిచేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. బుధవారం స్థానిక శాలిమార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేకకార్యక్రమంలో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన మెప్మా పీడీ పద్మహర్షను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగరీత్యా బదిలీలు సహజమేనని, కానీ విధుల్లో ఉన్నరోజులు కష్టపడేతత్వంతో రాణించేలా ప్రతి అధికారి కృషిచేయాలని ఆకాంక్షించారు. మెప్మా పీడీ పద్మహర్ష జిల్లాకు వచ్చిన రెండేళ్ల కాలంలో మెప్మాలో బాగా కష్టపడి రాణించారని అభినందించారు. అదేవిధంగా ఒక మహిళా అధికారి కావడంతో మహిళల సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరిస్తూ సంఘాలను బలోపేతం చేశారని కొనియాడారు. ఏదేని మహిళలకు సంబంధించిన కార్యక్రమాన్ని అప్పగిస్తే తన సొంత పనిలా భావించి విజయవంతంగా నిర్వహించేవారని, ఇందు కు బతుకమ్మ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ఆమె ఇకముందు కూడా బాధ్యతాయుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధుల నిర్వహణలో ఆమెను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని రాణించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పీడీ పద్మహర్షకు జిల్లాతో నాలుగేళ్ల అనుబంధం ఉందన్నారు. జిల్లా ప్రజలకు ఆమె అనేక సేవలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. జిల్లాను మరిచిపోలేను: పద్మహర్ష జిల్లాలో పనిచేసిన నాలుగేళ్లలో తనకు సహకరించిన కలెక్టర్‌తో పాటు ఇతర అధికారుల సహకారం, జిల్లాప్రజలు అందించిన అభిమానాన్ని మరిచిపోలేనని బది లీపై వెళ్తున్న పీడీ పద్మహర్ష అన్నారు. అయితే విధుల్లో తనవంతుగా రాణించానని చెప్పారు. ఇకముందు కూడా ఇలాంటే సేవలనే కొనసాగిస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట్ ఆర్డీఓ యాస్మిన్‌బాషా, పట్టణ మహిళా సమాఖ్య కార్యదర్శి యాదమ్మతోపాటు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
పదవి అంటే కిరీటం కాదు..
సిద్దిపేట, న్యూస్‌లైన్: పదవి అంటే కిరీటం కాదని... అది గురుతర బాధ్యతని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన 316 మంది నూతన సర్పంచ్‌లకు ‘అధికారాలు... బాధ్యతలపై అవగాహన’ సదస్సును ఆదివా రం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరులైనట్లే... గ్రామానికి సర్పంచ్ కూ డా అంతేనన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసినప్పుడు 2001లో గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి 21,923 గ్రామాలకు కార్యదర్శులు ఉండేలా చూశామన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఒక కార్యదర్శికి ఐదారు గ్రామా ల బాధ్యతలు అప్పగించి పంచాయతీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. తాగు నీటి సరఫరా, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత అంశాలను సర్పంచులు వార్డుల వారీగా అనునిత్యం సమీక్షిస్తుండాలని సూచించారు. నూత న సర్పంచుల పనితీరు ఆధారంగానే పల్లెల్లో పార్టీ పలుకుబడి ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని ఆయన ధీమాగా చెప్పారు. సఖ్యతగా ఉంటేనే పనులు: రమణాచారి సర్పంచులు ఆయా శాఖల అధికారులతో సఖ్యతగా, అనుకూల భావనలతో ఉంటేనే పనులవుతాయని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి సూచించారు. అధికారులు కూడా అవగాహన ఉన్న సర్పంచులతో ఓ రకంగా, అమాయకులైన వారితో మరో విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. క్యాష్బుక్, లెడ్జర్, ఓచర్లు వంటి వాటి నిర్వహణలో అప్రమత్తం గా ఉండాలన్నారు. ప్రజలతో గౌరవ భావంతో మెదలు కోవాలన్నారు. తన 36 ఏళ్ల సర్వీసులో మహిళా ప్రజాప్రతినిధులున్న చోట ఎక్కువగా మగవారి పెత్తనమే కనిపించిందని, ఆ అపప్రదను తొలగించాలని ఆయన సూచిం చారు. చెక్ పవర్ సర్పంచుల సొంతం: హరీష్‌రావు రాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం లేని చెక్‌పవర్ కేవలం సర్పంచులకే ఉందని ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. ఆ అధికారాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. హరీష్‌రావు ప్రతిపాదన మేరకు చెక్ పవర్ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులు తెలంగాణ భవన్లో కాలు మోపగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గ్రామాలు గులాబీమయం కావాలని, పంచాయతీ కార్యాలయాల్లో జయశంకర్, కేసీఆర్, తెలంగాణతల్లి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పెద్దలింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి తన అనుభవాన్ని కొత్త ప్రజాప్రతినిధులకు వివరించారు.