
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్‌కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్‌స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment