
ఒలింపిక్స్‌లో ప్రారంబోత్సవ వేడుకలకు ముందే డోపింగ్‌తో ఆటగాడు సస్పెండ్ అయ్యాడు. ఇరాక్‌కు చెందిన జూడో ఆటగాడు సజ్జాద్ సెహెన్ నిషేధిత ఉత్రే్పరకాలు మెటాన్‌డినోన్, బోల్డెనోన్ తీసుకున్నట్లుగా పరీక్షలో తేలింది.
మంగళవారం జరిగే పోటీల్లో ఈ జూడో ప్లేయర్ 81 కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉండగా, ఇప్పుడు ‘పాజిటివ్’గా దొరికిపోయాడు. దాంతో అతడిని పోటీల నుంచి తప్పించడంతో పాటు ఒలింపిక్స్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) ప్రకటించింది.