తొలి మ్యాచ్‌లో క్లబ్‌ ఇండియా ఓటమి | Club india beaten by iraq | Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌లో క్లబ్‌ ఇండియా ఓటమి

Published Tue, Nov 21 2017 11:34 AM | Last Updated on Tue, Nov 21 2017 11:36 AM

Club india beaten by iraq - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తొలి రోజు భారత్‌కు చెందిన క్లబ్‌ ఇండియా జట్టుకు ఓటమి ఎదురైంది. అల్‌ శుర్తా (ఇరాక్‌) క్లబ్‌తో సోమవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో క్లబ్‌ ఇండియా 37–51తో ఓడిపోయింది. ఈనెల 30 వరకు జరిగే ఈ పోటీల్లో అల్‌నూర్‌ (సౌదీ అరేబియా), అల్‌ దుహైల్‌ (ఖతర్‌), షార్జా (యూఏఈ), నఫ్త్‌ ఓ గాజ్‌ (ఇరాన్‌), మస్కట్‌ (ఒమన్‌), అల్‌ అహ్లి (ఖతర్‌), ఆర్‌కోర్‌ (ఉజ్బెకిస్తాన్‌), అల్‌నజ్మా (బహ్రెయిన్‌), అల్‌ శుర్తా (ఇరాక్‌), క్లబ్‌ ఇండియా (భారత్‌) జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

పోటీల నిమిత్తం కోటి రూపాయల ఖరీదు చేసే ఈ 9ఎంఎం టెరాఫ్లెక్స్‌ మ్యాట్‌ను స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతి«నిధ్యం వహిస్తున్నారు. వరంగల్‌కు చెందిన అశోక్, భరణి టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement