న్యూఢిల్లీ : భారతీయులు ఇరాక్ దేశానికి వెళ్లడాన్ని (ఎమిగ్రేషన్) 2014 జులై 17న కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఇరాక్‌పై ఉన్న ఎమిగ్రేషన్ నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ కేంద్ర సర్కారు ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. ఇరాక్‌లోని ప్రావిన్సులైన నినెవెహ్ (మోసుల్ రాజధాని), సలాహుద్దీన్ (టిక్రిత్ రాజధాని), దియాల, (బఖూబా రాజధాని), అంబార్ (రమాది), కిర్‌కుక్ ప్రాంతాలను మినహాయించి.. మిగతా ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లవచ్చని ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రభుత్వ ఈ– మైగ్రేట్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీంతోపాటు బాగ్దాద్‌లోని ఇండియన్ ఎంబసీ లేదా ఇర్బిల్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాలలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment