
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4067 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 490 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇప్పటి వరకు 292 మంది కొలుకోగా, 109 మంది మృతి చెందారని తెలిపింది. 690 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు 571, ఢిల్లీ 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 321, కేరళలో 314, రాజస్థాన్‌లో 253, ఆంధ్రప్రదేశ్‌లో 226, ఉత్తరప్రదేశ్‌లో 221, మధ్యప్రదేశ్‌లో 165, కర్ణాటకలో 151, గుజరాత్‌లో 122, జమ్మూకశ్మీర్‌లో 106 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైయ్యాయి. (కరోనా: ఎక్కడ చూసినా శవాలే!)
Comments
Please login to add a commentAdd a comment