ప్రతీకాత్మక చిత్రం
బాగ్దాద్ : ప్రంపచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అన్ని దేశాలకు వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు 92 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అలాగే 2,922 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇరాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 3,140 మందికి చేరింది. బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రైహానీ కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ.. ఇరాన్‌లోని 31 ప్రావిన్స్‌లలో ఈ వైరస్ ప్రభావితమయ్యాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 90 వేల మంది ఈ వ్యాధి భారిన పడగా.. 3,100 మంది చనిపోయారు. (హైటెక్ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!)
ఇదిలా ఉండగా తాజాగా ఇరాక్‌లో తొలి కరోనా డెత్ నమోదైంది. కరోనా వ్యాధితో 70 ఏళ్ల వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఇటీవల ఆ వ్యక్తి ఇరాన్ నుంచి వచ్చినట్లు తెలిసింది. కాగా మొదట కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో అతన్ని అధికారులు నిర్భంధించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.దీంతో ఇరాక్‌లో ఇప్పటి వరకు 31కరోనా కేసులు నమోదవ‍్వగా..దేశంలో ఇదే తొలి కరోనా మృతి అని ప్రభుత్వం ప్రకటించింది. (కరోనా ఎఫెక్ట్: 25 కోట్ల మాస్క్‌ల స్మగ్లింగ్)
Comments
Please login to add a commentAdd a comment