ఓవైపు తుపాకుల మోత. ఆ బుల్లెట్ల శబ్దాల మధ్యే ఓ సైనికుడు తన సెల్‌ఫోన్ తీస్తాడు. ఇక ఇంటికి తిరిగొచ్చే అవశాలు లేవని, అమ్మను జాగ్రత్తగా చూసుకోమని సోదరుడికి చెప్తూనే.. ‘అమ్మా.. ఇక
సెలవు’ అంటూ ముద్దులతో వీడియో కట్ చేస్తాడు. ఎమోషనల్ వీడియోగా ఇది సోషల్ మీడియాలో ఇది బాగా సర్క్యూలేట్ అవుతోంది. కన్నీటి రియాక్షన్లు చాలానే వస్తున్నాయి. ఐసిస్‌తో పోరాటంలో ఆ ఇరాక్ సైనికుడు ఈ వీడియో తీశాడని బాగానే ప్రచారం చేశారు. కట్ చేస్తే...
2015లో 17 నిమిషాల నిడివి ఉన్న ‘డయలింగ్’ అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. ఈ షార్ట్ ఫిల్మ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ కావడంతో పాటు ప్రశంసలు అందుకుంది కూడా. ఈ ఇరాకీ షార్ట్ ఫిల్మ్‌కు బహా అల్ కజెమి అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యహరించాడు. తాజాగా వైరల్ అయిన వీడియో.. ఆ షార్ట్ ఫిల్మ్‌లోనిదేనని క్లారిటీ ఇస్తూ అతను పోస్ట్ పెట్టాడు. ఇది అసలు ఫ్యాక్ట్ చెక్.
విషాదాంతంగా ఉండే ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఒక సైనికుడి వీరమరణం.. అతని రాక కోసం ఎదురు చూసే తల్లి చివర్లో గుండె పగిలిపోవడం కథాంశంగా ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన మెన్హెల్ అబ్బాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసి.. వైరల్ వీడియో నిజంది కాదని, తన షార్ట్ ఫిల్మ్‌దని క్లారిటీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment