
ఇరాక్‌లో ఇరుక్కున్నాం.. ఆదుకోండి
జన్నారం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఇరాక్ వెళ్తే మొదటికే మోసం వచ్చింది. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలని చెప్పి లక్షలు గుంజిన ఏజెంట్లు విజిట్ వీసాలు చేతికిచ్చి పంపారు. మూడు నెలల వీసా గడువు ముగి యడంతో ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు మూడు వందల మంది ఇరాక్‌లో ముప్పుతిప్పలు పడుతు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని పది మంది బాధి తులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ‘సాక్షి ’కి అందజేశారు.
అసలేం జరిగిందంటే...
మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన సుమా రు మూడు వందల మంది ఉపాధి కోసం గత ఐదారు నెలల క్రితం ఇరాక్ వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్లకు లక్షన్నర వరకు చెల్లించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరూ పట్టిం చుకోక పోవడంతో మోసపోయినట్లు గుర్తిం చారు. అయితే అఖామా (అనుమతి) లేకుండా తమ దేశంలో ఉండవద్దని, అలాంటి వారికి రూ.రెం డు లక్షల జరిమానా లేదా జైలుశిక్ష తప్పదని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అఖామా లేకుండా ఎర్బిల్ ప్రాంతంలో ఉంటున్న వారంతా ఆందోళనలో పడ్డారు.
గల్ఫ్ బాధితుల సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిధి బసంతరెడ్డి, జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన కొమురయ్యలను కలిసి తమ గోడు విన్నవించారు. వారు 31 మం దిని రెండు నెలల క్రితం ఇండియా పంపించేం దుకు చొరవ చూపారు. జన్నారం మండలా నికి చెందిన మరో 50 మంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నట్లు తెలియడంతో గత నెల రోజుల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచు రించింది. అధికారులు మరో 46 మందిని స్వదేశానికి పంపడానికి ఇరాక్‌లోని ఎర్బిల్ భారత రాయబార సంస్థ అధికారి దీపక్ విజ్ఞాని ఒప్పుకుని వారి పేర్లను ప్రకటించారు.
ఔట్ కోసం వెళితే పట్టుకుంటున్నారు..
భారత రాయబార సంస్థ ప్రతినిధి తిరిగి స్వ దేశానికి పంపడానికి పేర్లను ప్రకటించ డంతో వారు అక్కడి దేశంలోని అఖామా కార్యాల యంలో ఔట్ తేదీ ప్రకటించాలని వెళ్లారు. వారు తేదీ ప్రకటించడంలో జాప్యం చేస్తున్న ట్లు బాధితులు సాక్షితో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాక్ దేశం నిబంధనలను తీవ్రత రం చేసిందని, ఇందులో భాగంగా ఓ గదిలో ఉంటున్న పది మందిని అక్కడి పోలీసులు పట్టుకెళ్లినట్లు జన్నారం మండలం తపాల పూర్‌కు చెందిన కొమురయ్య తెలిపారు. తిండిలేక పస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు.
చాలా ఇబ్బందులు పడుతున్నారు
మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంన గర్, సిరిసిల్ల, కామారెడ్డి తదితర జిల్లాలకు చెందిన సుమారు మూడు వందల మంది అఖామా లేకుండా ఇబ్బంది పడుతున్నా రు. సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తతో 46 మందిని ఇండియా పంపడానికి ఎర్బిల్‌లో ని భారత రాయబార సంస్థ ఒప్పుకుంది. కాని బయటకు పంపే తేదీ చెప్పడం లేదు. ఇక్కడి ప్రభుత్వం మొదట రూ.2లక్షల జరి మానా చెల్లించాల్సిందిగా ఆదేశించినా తరు వాత దానికి రూ.55 వేలకు కుదించింది.
- కొమురయ్య, ఇరాక్ (తపాలపూర్)