విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇంటి వద్దకు చేరుకున్న బసంత్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట చేతపట్టుకుని ఇరాక్‌కు వెళ్లిన తెలంగాణ జిల్లాలకు చెందిన ఐదుగురు కార్మికులు అక్కడి బస్రా జైల్లో బందీలుగా ఉన్నారు. ఇంటికి వచ్చే తరుణంలో ఎయిర్‌పోర్టులో కార్మికులను అరెస్టు చేసిన ఇరాక్ పోలీసులు జైల్లో బంధించారు. వారికి తమ ఇంటివారితో మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించడం లేదు. తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోషియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. జగిత్యాల జిల్లాకు చెందిన జక్కి రాజు, పసుపుల లక్ష్మణ్, దుర్గం శాంతయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన కోడి రాజయ్య, నిర్మల్ జిల్లాకు చెందిన తాళ్లపెల్లి నారాయణలు ఏజెంట్ల ద్వారా 16 నెలల కింద ఇరాక్ వెళ్లారు.
అక్కడ 10 నెలల పాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన కార్మికులకు యాజమాన్యాలు సరైన వేతనమివ్వలేదు. కడుపునిండా భోజనం పెట్టలేదు. వసతి సరిగా లేకపోవడంతో కార్మికులు అనారోగ్యా నికి గురయ్యారు. ఇరాక్‌లో ఉంటే తాము బతికి బట్ట కట్టలేమని, తమని ఎలాగైనా స్వదేశానికి పంపించా లని ఇరాక్‌లో ఉన్న తమ గల్ఫ్ ఏజెంటును వేడుకు న్నారు. గత మేలో ఐదుగురు కార్మికులను ఇంటికి పంపించడానికి ఇరాక్‌లో ఉన్న ఏజెంటు దాసరి మురళి » స్రా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. అక్కడి పోలీసులు ఆ కార్మికులను అరెస్టు చేసి జైల్లో ఉంచా రు. ఏజెంటు దాసరి మురళి సమాచారం ఇవ్వడం తోనే బాధిత కుటుంబీకులు ఈ సమాచారం తెలుసు కోగలిగారు. మే 14న అరెస్టైన కార్మికులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇరాక్‌లోని మన విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కార్మికులను విడిపించాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment