
బాగ్దాద్ : ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతమైన హలాబ్జాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపతీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపు 200మందికి పైగా మృతిచెందగా, వేలాది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భవంతులు, లిఫ్ట్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాక్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషస్ ఇరాకీ స్టేట్ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్, లెబనాన్, కువైట్, టర్కీలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
Comments
Please login to add a commentAdd a comment