
టెహ్రాన్ : ఇటీవల ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో విధ్వంసం సృష్టించిన భూకంప మృతుల సంఖ్య 530కి చేరుకుంది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూకంపంలో 8 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు మంగళవారం రాత్రి వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
ఈ భూకంప తీవ్రతకు ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న జహాబ్ పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఇరాన్‌లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం పడింది. ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని భూ పరిశీలన సంస్థ తెలిపింది. గత మూడు రోజులుగా చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment