హైదరాబాద్: ఇరాక్‌కు వలస వెళ్లి ప్రమాదకర ఐసిస్ జోన్‌లో చిక్కుకున్న 31మంది తెలంగాణ కార్మికులు ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఈ సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్నారు. మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల నుంచి అనేకమంది కార్మికులు రెండేళ్ల క్రితం ఇరాక్‌కు వలస వెళ్లారు. ఏజెంట్ల మాటలు నమ్మి వారు మోసపోయారు.
అక్కడ ప్రమాదకర ఐసిస్ జోన్‌లో చిక్కుకుపోవడంతో తల్లడిల్లిన వారి కుటుంబీకులు తమవారిని రక్షించాలని తెలంగాణ, కేంద్ర ఫ్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లు చొరవ తీసుకుని వీరికి విముక్తి కలిగించారు.
ఇరాక్ వలసదారులకు విముక్తి
Published Mon, Apr 3 2017 9:54 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement
Advertisement