‘టైమ్’ ఈ ఏటి మేటి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా ‘టైమ్’ మ్యాగజైన్ ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన 9నెలల కాలంలోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణమైన రీతిలో మార్చారంటూ ఆయనను శ్లాఘించింది. గడచిన పన్నెండు వందల సంవత్సరాల్లో తొలి యూరోపియనేతర పోప్‌గా చరిత్ర సృష్టించిన పోప్ ఫ్రాన్సిస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నారని పేర్కొంది. ‘టైమ్’ మ్యాగజైన్ 2013 సంవత్సరానికి చేపట్టిన ఈ ఏటి మేటి వ్యక్తి ఎంపికలో అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ రెండోస్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త ఎడిత్ విండ్సర్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 42వ స్థానంలో నిలిచారు.