Person of the Year
-
టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు
న్యూయార్క్: ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్ మేగజీన్ తాజా సంచిక ప్రచురించింది. ఉక్రెయిన్‌లో, విదేశాల్లో చాలా మంది జెలెన్స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారని పేర్కొంటూ ట్వీట్ చేసింది టైమ్ మేగజీన్. ‘ఉక్రెయిన్ సహా విదేశాల్లో చాలా మంది వొలొదిమిర్ జెలెన్స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది. ఇదీ చదవండి: ఫోర్భ్స్ కుబేరుల జాబితా: పాపం ఎలన్ మస్క్ అలా దిగజారి.. ఆ వెంటనే.. -
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్
Time's person of the year 2021: టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు). 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. చదవండి: ఎలన్ మస్క్ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు -
పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా బైడెన్, కమల
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్‌లు టైమ్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తులుగా నిలిచారు. ప్రతీ ఏడాది టైమ్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసే ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’’లో 2020లో బైడెన్, హ్యారిస్ నిలిచారు. వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని, అమెరికా కథనే మార్చారని టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచికలో వారిని కొనియాడింది. ప్రపంచం యావత్తూ ఒక మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంటే దానికి మందు ఎలా వెయ్యాలో దృష్టి పెట్టారని పేర్కొంది. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి, జాతి వివక్ష పోరాట సంస్థలు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. వీరందరూ ఇచ్చిన పోటీని తట్టుకొని జో బైడెన్, కమలా హ్యారిస్‌లు ముందుకు దూసుకెళ్లి టైమ్ ముఖచిత్రానికెక్కారు. గత ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ 16 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తే, ఈ ఏడాది జో బైడెన్ 78 ఏళ్ల వయసులో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు. టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఇండియన్ అమెరికన్ రాహుల్ దుబేకి చోటు లభించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్న 70 మందికి పైగా నిరసనకారులకి రాహుల్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. -
బైడెన్, కమలా హారిస్‌లకు అరుదైన గౌరవం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌లు.. ఈ యేటి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పత్రిక ప్రకటించింది. హెల్త్ కేర్ వర్కర్లు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ పడ్డా.. డెమొక్రటిక్ జంటకే టైమ్ గౌరవం దక్కడం విశేషం. టైమ్ మ్యాగజైన్ కవర్‌పేజీపై బైడెన్, హారిస్ ఫోటోలను ప్రచురించారు. చేంజింగ్ అమెరికాస్ స్టోరీ అన్న సబ్‌టైటిల్ ఆ ఫోటోకు ఇచ్చారు. తాజాగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. ట్రంప్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రిపబ్లికన్ నేత ట్రంప్ కన్నా.. బైడెన్‌కు సుమారు 70 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 20న జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక క్యాలండర్ ఇయర్ల అధిక ప్రభావం చూపిన వ్యక్తులను టైమ్ మ్యాగజైన్ తన కవర్‌పేజీలో ప్రచురిస్తుంది. వారినే 'పర్సన్ ఆఫ్ ఇయర్' అవార్డుతో సత్కరిస్తున్నది. -
గ్రెటా ది గ్రేట్
జోన్ ఆఫ్ ఆర్క్.. ది గ్రేట్ ! చే గువేరా.. ది గ్రేట్ ! మార్టిన్ లూథర్ కింగ్.. ది గ్రేట్! ఈ వరుసలో.. ఇప్పుడు గ్రెటా థన్‌బర్గ్.. ది గ్రేట్! ఏంటి! తోస్తే పడిపోయేట్లు ఉండే ఈ అమ్మాయా! ఆమె పడిపోవడం కాదు. ప్రపంచాన్ని నిలబెట్టడానికి పిడికిలి బిగించింది. అందుకే ఈ ఏడాది ప్రతి దేశంలోనూ గ్రెటానే.. ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’. దేశాలు ఈ టైటిల్ ఇవ్వకపోవచ్చు. దేశ దేశాల ప్రజలు ఇచ్చేశారు. ప్రకృతి విధ్వంసం గురించి వేలాదిమంది కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, చివరకు ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ వేదిక సైతం దశాబ్దాలుగా చేయలేకపోయిన పనిని ఆ చిన్నారి అతి తక్కువ వ్యవధిలో సాధించింది. పర్యావరణం పేరిట జరుగుతున్న రాజకీయాలను తోసిపారేసింది. ప్రకృతి రక్షణపై చిన్నచూపు చూస్తున్న ప్రపంచ నాయకులను ఐరాస వేదికగా ‘హౌ డేర్ యు’ అంటూ నిలదీసింది. అక్కడితో ఆగిపోలేదు. పర్యావరణం పట్ల ప్రపంచ దృక్పథాన్నే తాను మార్చివేసింది. అప్పటికే ప్రపంచాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలని పోరాడుతున్న వారికి కొండంత స్థైర్యం కలిగించింది. నిఘంటువులు చోటిచ్చాయి పర్యావరణ సమ్మె పేరిట 2018 ఆగస్టులో స్కూలు దాటి బయటకొచ్చిన ఆమె.. పదహారు నెలల వ్యవధిలో ప్రపంచాన్ని సుడిగాలిలా చుట్టేసింది. స్వీడిష్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ‘పర్యావరణం కోసం పాఠశాల సమ్మె’ మొదలెట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ అధినేతలను సవాలు చేసింది. పోప్‌ను కలిసింది. అమెరికా అధ్యక్షుడు వంకర ట్రంప్‌ను ఈసడించింది. 2019 సెప్టెంబర్ 20న తలపెట్టిన ప్రపంచ పర్యావరణ సమ్మె సందర్భంగా నలభై లక్షల మందికి ప్రేరణ కలిగించింది. మానవ చరిత్రలో అతిపెద్ద పర్యావరణ ప్రదర్శనకు నాయకత్వం వహించింది. లాటిన్ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తర్వాత అంతటిస్థాయిలో తన చుట్టూ వీరారాధనను సృష్టించుకుంది. కొందరు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచారు. కొందరు ఆమెను ప్రపంచ నిగూఢ రహస్యాన్ని తన చిరునవ్వులో దాచిన మోనాలీసాతో పోల్చారు. వీటన్నిటికి మించి ఆమె స్వీడన్ పార్లమెంటు ముందు కూర్చుని పలికిన ‘పర్యావరణ సమ్మె’ అనే పదాన్ని ఈ సంవత్సరం మొత్తంలో విశిష్ట పదంగా నిఘంటువులు సైతం పొందుపర్చాయి. ప్రభుత్వాలు తలవంచాయి ఇంతటి ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన గ్రెటా థన్‌బెర్గ్ అంతా చేసి 16 ఏళ్ల బాలిక. మానవ చరిత్రలో కెల్లా మహిమాన్విత ప్రసంగాల్లో మొదటిది ఐ హ్యావ్ ఎ డ్రీమ్ (నేను కల కంటున్నాను) అనే మార్టిన్ లూథర్ ప్రసంగంగా అందరికీ తెలుసు. ఐక్యరాజ్యసమితి వేదికపై నిల్చుని.. ‘‘మా చిన్ని ప్రపంచాన్ని, మా కలల్ని కూల్చివేయడానికి మీకెంత ధైర్యం’’ అంటూ గ్రెటా చేసిన ప్రసంగం ఆ స్థాయిలో నిలుస్తోంది. పర్యావరణ రక్షణకోసం పోరాడుతున్న వారికి, దాన్ని పట్టించుకోని వారికి మధ్య ఆమె నైతికపరమైన లక్ష్మణరేఖను గీసింది. తమ దేశాల్లో కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలిస్తామని దేశాధినేతలు, ప్రభుత్వాలు సైతం అంగీకరించేటట్లు చేసింది. శారీరకంగా చూస్తే.. తోస్తే పడిపోయేటట్లు కనిపించే అర్భకురాలు. కానీ ప్రపంచంలో పర్యావరణానికి కలిగిస్తున్న అన్యాయాలను నిలదీస్తూ లెబనాన్ నుంచి లైబీరీయా వరకు లక్షలాది టీనేజ్ గ్రేటాలు పాఠశాలలు వదిలి పర్యావరణ సమ్మెలో పాల్గొనేలా చేసిన ప్రేరణ కర్త ఆమె. ‘టైమ్’ పత్రిక గ్రేట్ అంది గ్రెటా.. టైమ్ పత్రిక తరపున 2019 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. జన్మ సార్థకతకు చిహ్నంగా అందరూ భావించే ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రపంచనేతలు, సీఈఓల ముందు నిలబడి ప్రపంచాన్ని భయపెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పిందామె. ‘‘ప్రతిరోజూ నేను పొందుతున్న భయానుభూతిని మీరందరూ అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. తర్వాతే మీరు పనిలోకి దిగాలని నా ఆశ. కానీ భయపెట్టటంలోనూ బాధ్యత ఉంది’’ అని గుర్తు చేసిందామె. అధినేతలు ఫాలో అయ్యారు పసిపిల్లల కళ్ల నుంచి ప్రపంచాన్ని చూడటం అనేది మనసును మార్చడానికి అత్యుత్తమ విధానం అని అంటుంటారు. ప్రపంచాధినేతలు ఆమె కళ్లు వెలువరిస్తున్న భావాలను అర్థం చేసుకుంటున్నారు. వారిలో కాస్త నిజాయితీగా కనిపిస్తున్న వారు ఆమె మాటలకు దాసోహమవుతున్నారు. ‘‘మనం పెద్ద నాయకులమే కావచ్చు కాని ప్రతి రోజూ, ప్రతివారం పర్యావరణ పరిరక్షణపై అలాంటి సందేశాన్ని ప్రతిచోట నుంచి ఇస్తున్నప్పుడు మనం తటస్థంగా ఉండలేం’’ అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యువల్ మేక్రాన్ ఒప్పేసుకున్నారు. ‘‘ఈ పిల్లలు నేను మారడానికి సహాయపడ్డారు’’ అంటున్న ఆయన మాటలు ఇప్పుడు చాలామందికి కనువిప్పు కలిగిస్తున్నాయి. పర్యావరణ మార్పును పట్టించుకోని దేశాలపై పన్ను విధించాలని యూరోపియన్ యూనియన్ సిద్ధమైందంటే పసిపిల్లల నినాదాలు ఏ స్థాయిలో ఈ ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయో తెలుస్తుంది. ‘‘రేపు అనేది లేనప్పుడు, కనిపించనప్పుడు మనం జీవితాన్ని కొనసాగించలేం. కానీ మనందరికీ రేపు అనే భవిష్యత్తు ఉంది. అది అందరికీ కనబడుతోందని మాత్రమే మేం చెబుతున్నాం’’ అంటూగ్రెటా ప్రపంచ చిన్నారుల తరపున ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచం బాధను ఆమె తన భాధగా చేసుకుందని అంటున్నారు. ప్రపంచం బాధను, నిరాశను, నిస్పృహను, కోపాన్ని వ్యక్తీకరించడంతో సరిపెట్టుకోకుండా.. ఓటు హక్కు కూడా లేని కోట్లాదిమంది చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతున్నప్పుడు... మనం బతకాలి అంటూ వేస్తున్న పెనుకేక గ్రెటా థన్‌బెర్గ్. – శోభారాజు క్లాస్ రూమ్‌లో మొదలైంది థన్‌బర్గ్ చదువుతున్న ప్రాథమిక పాఠశాల టీచర్ పర్యావరణ విపత్తుల గురించి చెబుతున్న ఒక వీడియోను క్లాసులో చూపించి వాతావరణ మార్పు వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పినప్పుడు క్లాస్ మొత్తం షాక్‌కు గురైంది. పిల్లలందరూ త్వరలోనే తేరుకున్నారు. కానీ గ్రెటా కోలుకోలేకపోయింది. ధ్రువప్రాంతాల్లోని ఎలుగుబంట్లు ఆకలితో అలమటించడం, వాతావరణం పూర్తిగా మారిపోవడం, వరదలు ముంచెత్తడం చూసిన గ్రెటా 11 ఏళ్ల ప్రాయంలో తీవ్రమైన అలజడికి గురైంది. నెలలతరబడి మాట్లాడలేకపోయింది. అతి తక్కువ ఆహారం తీసుకోవడంతో ఆసుపత్రి పాలైంది. ఆ సమయంలో ఆమె పరిస్థితిని ‘అంతంలేని విషాదం’గా కన్నతండ్రే వర్ణించారు. మానవ మనుగడే ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై తనలో ఏర్పడిన గందరగోళం చివరకు ప్రాణాలమీదికి తెచ్చిందని గ్రెటా కూడా స్వయంగా చెప్పింది. -
ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజేసుకున్నారు. పర్యావరణ యువ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రఖ్యాత పత్రిక ‘టైమ్’ పర్సన్ ఆఫ్ ది ఈయర్‌గా ప్రకటించడంపై మండిపడ్డారు. అది తెలివితక్కువ నిర్ణయమని టైమ్ పత్రికను విమర్శించారు. ‘గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ తరువాత ఓ ఫ్రెండ్‌తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్.. గ్రెటా చిల్!’ అని గురువారం ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా గ్రెటా థన్‌బర్గ్ తన ట్విట్టర్ బయోడేటాను మార్చారు. ‘నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్‌ను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’ అని ట్రంప్‌నకు రిటార్ట్ ఇచ్చారు. -
‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా పాల్
న్యూఢిల్లీ: మీడియా రంగానికి చెందిన డాక్టర్ హెచ్.ఎస్.పాల్‌ను ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా ‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్–2018’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్(ప్రొఫెసర్) పీకే పాటసాని, ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్(ప్రొఫెసర్) అభిరామ్ కులశ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ‘మీ టూ’
న్యూయార్క్: లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన ‘సైలెన్స్ బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో సినీ ప్రపంచం కుదుపునకు లోనైన సంగతి తెలిసిందే. హార్వేపై ఆరోపణలు చేసిన వారితో పాటు, లైంగిక దాడులకు గురయ్యామని ప్రపంచ వ్యాప్తంగా ‘మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా తమ బాధలను పంచుకున్న మహిళలందరినీ ‘సైలెన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. ‘పెటా’ జాబితాలో సెల్ఫీ కోతి జకార్తా: నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి ‘నరుటో’ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను ‘పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి తెలీకుండా చకాచకా కొన్ని సెల్ఫీలు తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఫొటో షూట్ వద్దు: ట్రంప్
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ అందించే పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండోసారి తనకు వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానం కోసం ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలని టైమ్స్ కోరడంతో ట్రంప్ స్పందించారు. ‘గతేడాదిలాగే ఈ సారి కూ నేనే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యే అవకాశముందని చెప్పేందుకు టైమ్స్ ప్రతినిధులు ఫోన్ చేశారు. అందుకోసం ఓ మేజర్ ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలన్నారు. ఇందుకు నేను వద్దని చెప్పా. ఏదేమైనా ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎంపికపై ట్రంప్ పొరపడుతున్నారని టైమ్స్ వ్యాఖ్యానించింది. విజేతను డిసెంబర్ 6న ప్రకటిస్తామని వెల్లడించింది. -
టైమ్‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: ఆన్లైన్ రీడర్స్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచిన భారత ప్రధాని మోదీని తోసిరాజని అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌ను టైమ్ మేగజీన్ 2016 ఏడాదికి‘ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. తొలి రన్నపరప్గా ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్లైన్ హ్యాకర్లు నిలిచారు. ఈ గౌరవానికి బరిలో నిలిచిన తుది 11 మందిలో భారత ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ఈ నిర్ణయం వెలువడిన తరువాత ట్రంప్ స్పందిస్తూ ‘ ఇది గొప్ప గౌరవం. టైమ్ మేగజీన్ చదువుతూ పెరిగాను. గతంలో ఈ మేగజీన్ కవర్ పేజీపై చోటు సంపాదించడం నా అదృష్టం ’అని ఎన్బీసీ న్యూస్‌తో సంతోషం పంచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, ప్రజాకర్షక అభ్యర్థిగా ప్రచారం చేసి అమెరికా ఎన్నికల్లో కనీవిని ఎరుగని విధంగా ట్రంప్ విజయం సాధించారని ‘టైమ్’ కొనియాడింది. ప్రపంచ వ్యాప్తంగా మంచికి లేదా చెడుకి వార్తల్లో ఎక్కువగా నిలిచిన నాయకులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ను టైమ్ ఎడిటర్లు ఎంపిక చేస్తారు. ఇతర పోటీదారుల్లో...యూఎస్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, టర్కీ అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్, యూకే ఇండిపెండెన్స పార్టీ నాయకుడు నైగల్ ఫరేజ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ తదితరులున్నారు. తదుపరి రక్షణ మంత్రిగా మ్యాటిస్ 4 స్టార్ మెరైన్ కోర్ రిటైర్డ్ జనరల్ జేమ్స్ మ్యాటిస్‌ను ట్రంప్ అమెరికా తదుపరి రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. 66 ఏళ్ల మ్యాటిస్కు ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అమెరికా రక్షణ విధానంలో విజయం సాధించాలంటే రక్షణ విభాగాన్ని నడిపించేందుకు సరైన వ్యక్తి కావాలని మ్యాటిస్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. -
‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎబోలా ఫైటర్స్
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, సహాయకులను ఈ ఏడాదికిగానూ ఉమ్మడిగా ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసినట్లు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. చికిత్స అందించే క్రమంలో సహచర వైద్యులు వైరస్‌బారిన పడి కన్నుమూసినా ధైర్యం, కరుణతో రోగులకు సేవలు అందిస్తున్నందుకుగానూ తుది ఎనిమిది మంది జాబితాలోంచి వీరిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు మ్యాగజైన్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ తెలిపారు. -
‘టైమ్’ ఈ ఏటి మేటి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా ‘టైమ్’ మ్యాగజైన్ ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన 9నెలల కాలంలోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణమైన రీతిలో మార్చారంటూ ఆయనను శ్లాఘించింది. గడచిన పన్నెండు వందల సంవత్సరాల్లో తొలి యూరోపియనేతర పోప్‌గా చరిత్ర సృష్టించిన పోప్ ఫ్రాన్సిస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నారని పేర్కొంది. ‘టైమ్’ మ్యాగజైన్ 2013 సంవత్సరానికి చేపట్టిన ఈ ఏటి మేటి వ్యక్తి ఎంపికలో అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ రెండోస్థానంలో నిలిచారు. టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త ఎడిత్ విండ్సర్ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 42వ స్థానంలో నిలిచారు.