
గ్రెటా థన్‌బర్గ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజేసుకున్నారు. పర్యావరణ యువ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ప్రఖ్యాత పత్రిక ‘టైమ్’ పర్సన్ ఆఫ్ ది ఈయర్‌గా ప్రకటించడంపై మండిపడ్డారు. అది తెలివితక్కువ నిర్ణయమని టైమ్ పత్రికను విమర్శించారు. ‘గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ తరువాత ఓ ఫ్రెండ్‌తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్.. గ్రెటా చిల్!’ అని గురువారం ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా గ్రెటా థన్‌బర్గ్ తన ట్విట్టర్ బయోడేటాను మార్చారు. ‘నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్‌ను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’ అని ట్రంప్‌నకు రిటార్ట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment