అల్ అజర్ గ్రాండ్ ఇమామ్‌తో పోప్
అబుదాబీ: చరిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్‌లో అడుగుపెట్టిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ చేరుకున్న పోప్‌కు మిలటరీ పరేడ్‌తో అధికారులు ఆహ్వానం పలికారు. దీంతో దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌గా పోప్ ఫ్రాన్సిస్‌కు చరిత్రకెక్కారు. పోప్ బసచేసిన అబుదాబీ అధ్యక్ష భవనం వద్ద అధికారులు గౌరవ సూచకంగా గాలులోకి కాల్పులు జరిపారు. దుబాయ్‌లో జరగనున్న ఇంటర్‌ఫెయిత్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలన్న అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆహ్వానం మేరకు పోప్ యూఏఈలో పర్యటిస్తున్నారు.
‘సోదరుడిగా.. యూఏఈతో కలసి పనిచేసేందుకు, శాంతి మార్గంలో పయనించేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఈ సందర్భంగా పోప్ అన్నారు. దీనిలో భాగంగా పోప్‌తో సోమవారం జరిగిన భేటీపై యూఏఈ ప్రిన్స్ స్పందిస్తూ.. ‘పోప్‌ను కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమావేశంలో భాగంగా పరస్పర సహకార మెరుగుదల, సహనశీలత, ప్రజలు, సమాజం కోసం శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైన విషయాలపై చర్చించాం’అని ప్రిన్స్ ట్వీట్ చేశారు. 1219లో ఈజిప్ట్ మాలెక్ అల్ కమేల్, స్టెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి మధ్య సమావేశాన్ని పోప్ గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment