బెత్లహాంలోని ప్రపంచ ప్రఖ్యాత ‘చర్చ్ ఆఫ్ నేటివిటీ’ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుక ప్రత్యేక కార్యక్రమాలు మొదలైన దృశ్యం
బెత్లహాం: ప్రతిసంవత్సరం బెత్లహాంలో అంగరంగవైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై కరోనా నీడ పడింది. దీంతో గురువారం ఆరంభమైన ఉత్సవాలకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రతిసారీ ప్రపంచం నలుమూలల నుంచి బెత్లహాంకు భక్తులు ఈ ఉత్సవాలు చూసేందుకు వచ్చేవారు. ఈదఫా ప్రయాణాలపై ఆంక్షలతో దాదాపు విదేశీ యాత్రికులు కనిపించడంలేదు. వాటికన్ సిటీలో జరిగే పోప్ ఫ్రాన్సిస్ పూజాకార్యక్రమాలకు కూడా కర్ఫ్యూ కారణంగా ఎవరూ హాజరు కాకపోవచ్చని అంచనా. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా ఆంక్షలు క్రిస్మస్ ఉత్సాహాన్ని తగ్గించాయి.
Comments
Please login to add a commentAdd a comment