
ఢాకా: పోప్ ఫ్రాన్సిస్ గురువారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర‍్యటించనున్నారు. మయన్మార్‌లో పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో ఢాకా చేరుకున్న పోప్‌కు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక బలగాల గౌరవ వందనం ఆయన స్వీకరించారు.
పోప్ పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోప్ తన పర్యటనలో మయన్మార్ రొహింగ్యాల సమస్యను ప్రముఖంగా ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రెండవ పోప్..ఫ్రాన్సిస్. మొదటిసారిగా 1986 లో పోప్ జాన్‌పాల్-2 బంగ్లాదేశ్‌లో పర్యటించారు.