
ఇంటర్నెట్ దేవుడిచ్చిన వరం:పోప్ ఫ్రాన్సిస్
వాటికన్‌సిటీ: ఇంటర్నెట్‌ను దేవుడిచ్చిన వరంగా పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అందరినీ సంఘటితం చేయడానికీ.. పోరాటానికీ అది వీలు కల్పిస్తుందని చెప్పారు. ఈ మేరకు ప్రపంచ సమాచార దినోత్సవ సందేశాన్ని పోప్ అందించారు. ‘మనం కూడా డిజిటల్ ప్రపంచ పౌరులుగా మారిపోదాం’ అని కేథలిక్స్‌కు పిలుపునిచ్చారు. ‘మన సమాచారం నొప్పి నుంచి ఉపశమనకారిగా.. ఆనందాన్నిచ్చే చక్కటి వైన్‌లా ఉండాలి’ అని అభిలషించారు. నిజానికి పోప్ ఫ్రాన్సిస్ డిజిటల్ ప్రపంచంలో ఇప్పటికే భాగమయ్యారు.
ట్విట్టర్‌ను తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. ట్విట్టర్లో ఆయనకు కోటి మంది అనుచరులు ఉన్నారు. కానీ, అదే సమయంలో మానవ సంబంధాలు, వ్యక్తిగత పరామర్శలు కూడా అంతే ప్రాధాన్యమని ఆయన తన పేర్కొంటూ ఉంటారు.