నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్‌ | Pope Francis Says I Will Give You Kiss But Dont Bite | Sakshi
Sakshi News home page

ముద్దిస్తా కానీ కొరకకూడదు: పోప్‌

Published Thu, Jan 9 2020 10:29 AM | Last Updated on Thu, Jan 9 2020 10:33 AM

Pope Francis Says I Will Give You Kiss But Dont Bite - Sakshi

వాటికన్‌ సిటీ: పోప్‌ ఫ్రాన్సిస్‌.. నూతన సంవత్సర వేడుకల్లో ఓ మహిళ తన చేయి పట్టుకుని వెనక్కు లాగినందుకు ఆమె చేతిని రెండుసార్లు కొట్టి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పారునుకోండి. అది వేరే విషయం. తాజాగా పోప్‌ ఫ్రాన్సిస్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. వేలాదిమంది జనం గుమిగూడి ఉన్న హాల్‌ మధ్యలో పోప్‌ ఫ్రాన్సిస్‌ నడుచుకుంటూ వెళ్తున్నారు. అరుపులు, రొదలతో హాలంతా సందడిగా ఉంది. అంతమంది అరుపుల మధ్యలో ఓ నన్‌ గొంతు గట్టిగా ప్రతిధ్వనించింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్‌..’ అంటూ గట్టిగా కేకేసింది. అది విన్న పోప్‌ ఓ క్షణమాగి తనను కొరకనంటేనే ఇస్తానన్నారు.

పోప్‌ జవాబుతో అక్కడి జనమంతా ఘొల్లున నవ్వారు. ‘ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్‌ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్‌ ఆమె కుడి చెంపపై సుతారంగా ముద్దు పెట్టారు. దీంతో పట్టలేని సంతోషంతో ఆ మహిళ ‘థాంక్‌ యూ పోప్‌’ అంటూ గంతులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పోప్‌ ఫ్రాన్సిస్‌ జనాలు అతని చేతిని తాకడానికి అనుమతిస్తారు. కానీ ప్రజలు తన చేతిని ముద్దాడటాన్ని మాత్రం అస్సలు సహించరు. దీనివల్ల సూక్ష్మక్రిములు త్వరగా వ్యాప్తి చెందుతాయని ఆయన బలంగా నమ్ముతారు.

చదవండి: మహిళకు క్షమాపణ చెప్పిన పోప్‌ ప్రాన్సిస్‌

ఈ ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ సందేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement