
ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ ఫాలోవర్లు 30 లక్షలు
వాటికన్ సిటీ: ప్రఖ్యాత ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా 30 లక్షల మార్కును దాటింది. ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరచిన పోప్ ఇప్పటివరకు మొత్తంగా 143 ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ ఇంగ్లీష్‌లో.. సబ్‌టైటిల్స్ ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.
120కోట్ల మంది కేథలిక్‌లకు పోప్‌గా ఎన్నికై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా యువతతో మమేకమయ్యేందుకు మార్చిలో ఆయన ఈ ఖాతాను ప్రారంభించారు. పోప్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2.7కోట్లు.